శరత్ తో తను చెప్పాల్సిన మాటలను మళ్ళీ మననం చేసుకుంది రాధిక. ఒక పట్టాన చిక్కడు దొరకదు. ఎప్పుడూ ఏదో ఆటపట్టిస్తూ ఉంటాడు. అతను తన మాట కాదనకుండా ఎలా ఒప్పించాలి అని ఆలోచించింది. పెళ్ళైన తర్వాత ఆరునెలల వరకు కాపురానికి పంపలేదు ఆమె పుట్టింటివారు. శరత్ తో కలిసి ఉండటం మొదలుపెట్టి కొన్ని నెలలే గడిచింది. అందుకే శరత్ దగ్గర మాట్లాడటానికి ఒకోసారి కాస్తంత బెరుకు ఆమె మనసులో మెదులుతూ ఉంటుంది. కాఫీ కలిపి కప్పుల్లో పోసి ట్రేలో పెట్టుకుని హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్న శరత్ కి ఆమె కాలిమువ్వల సవ్వడి వినిపించి తల ఎత్తి చూశాడు. నీలం రంగుచీరలో మెరిసిపోతోంది అప్సరసలా. ఎంగేజ్ మెంట్ తర్వాత ఒకసారి కలుసుకున్నప్పుడు శరత్ గిఫ్ట్ గా ఇచ్చిన చీర అది. ఆ చీరంటే ఇద్దరికీ ప్రత్యేకమైన ఇష్టం.
ట్రేను టీపాయ్ మీద ఉంచి తాను శరత్ పక్కనే కూర్చుని కాఫీ అందించింది రాధిక చిరునవ్వుతో.
"ఏమిటి విశేషం?'' అన్నాడు శరత్ కప్పు అందుకుని తాను కూడా నవ్వుతూ.
తెరచి ఉన్న పెద్ద పెద్ద కిటికీల లోనుంచి ధారాళంగా గాలి వీస్తున్నది. ఐదంతస్థుల భవనంపై ఉన్న విశాలమైన పెంట్ హౌస్ వాళ్ళది. గాలికి రాధిక శిరోజాలు అల్లరిగా ఎగిరి శరత్ ముఖాన్ని తాకుతున్నాయి. తన చేత్తో సుతారంగా వాటిని తొలగించి "ముందు కాఫీ తీసుకో, తర్వాత చెప్తాను'' అంది.
"ఊరించక చెప్పరా! వేచి ఉండటం అంటే నాకసలు ఇష్టం ఉండదు'' అన్నాడు.
అంతవరకూ ఏ విధంగా తన కోరిక బయటపెట్టాలా అని ఎన్నో రకాలుగా ఆలోచించుకున్న రాధిక 'ఎలా చెప్పాలి ఏవిధంగా ఒప్పించాలి' అనుకుంటూ సందిగ్ధంలో పడింది.
ఆల్చిప్పల్లాంటి సోగకళ్ళను కిందకు వాల్చి ఆలోచనల్లో పడిన రాధికను గమనిస్తూ ఆమె సాన్నిహిత్యంలోని ఆనందాన్ని అనుభవిస్తూ పారవశ్యంలో ఉన్నాడు శరత్.
"మరి, మరి ...'' అంటూ ఆగిపోయింది.
"ఎందుకు మొగమాటం. నువ్వదిగితే చందమామనాన్నా తెచ్చివ్వనా?'' ఆమె మనసులో ఉన్న కోరిక బయటకు చెప్పలేకపోతున్నదని గ్రహించి కాస్త ఉత్సాహ పరిచేలా అన్నాడు.
"వెన్నెల్లో తాజ్ మహల్ చాలా బాగుంతుందట కదా!''
"ఊ, అయితే ...''
"నాకు ఎప్పటినుంచో చూడాలని ఆశ''
"మరెందుకు చూడలేదు?'' గులాబీ రేకుల్లాంటి పెదవులు కలిసి విడిపోతూ మృదువైన మాటలు వినిపిస్తుంటే, అటే చూస్తూ అల్లరిగా అడిగాడు.
"ఎవరితోనే అయితే ఎప్పుడో వెళ్ళేదాన్ని. పెళ్ళయ్యాక మీతో వెళ్లాలని నా కోరిక'' స్త్రీ సహజమైన ఉక్రోషం తన్నుకొని వచ్చి కాస్త ఘాటుగానే అంది.
ఎర్రబడి, ఇంకాస్త ఆకర్షణీయంగా ఉన్న రాధికను చూసి "నీకు సత్యభామ పేరు బాగా నప్పుతుందేమో కదా?'' మరికాస్త ఉడికించాలని అన్నాడు శరత్.
చివాల్న ముఖం పక్కకు తిప్పుకుంది రాధిక. ఒక చిన్న కన్నీటి బిందువు ఆమె బుగ్గపై జారింది.
చేతిలో కప్పు టీపాయ్ మీద పెట్టి, లేచి ఆమె ఎదురుగా తన మోకాళ్ళపై కూర్చుని ఆమె చుబుకాన్ని మెల్లగా పైకెత్తి ప్రేమగా చూశాడు శరత్. ఉబికివస్తున్న కన్నీటిని ఆపడానికి ప్రయత్నిస్తూ తలెత్తి శరత్ ని చూసింది.
చిన్నగా నవ్వుతూ "రాధీ, ఎంత బాగున్నావో తెలుసా?'' ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. 'ఏడిపించి మళ్ళీ ఊరుకోబెట్టడంలో ఈయన్ని మించినవారు ఎవరూ ఉండరు' అనుకుంది రాధిక మనసులో.
"తాజ్ మహల్ గురించి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారో తెలుసా?''
"మీకు నన్నేడిపించడమేగాక చాలా విషయాలు తెలుసు'' దెబ్బకు దెబ్బ తీసింది రాధిక.
ఆమె మాటలు విననట్లు నటిస్తూ "అనంతకాలపు చెక్కిలిపై మెరిసే కన్నీటి బిందువుతో తాజ్ ను పోల్చారు. ఇప్పుడు నీ అద్దాల చెక్కిలిపై ఆ కన్నీటిచుక్క ముత్యంలా మెరుస్తుంటే, అందులో నాకు ఆయన దర్శించిన తాజ్ అనుభవమవుతోంది'' అన్నాడు.
శరత్ మాటలు విన్న రాధిక అణువణువు పులకరించిపోయింది. 'ఏమి రసజ్ఞ భావన!!' అనుకుంది. తనలో తాజ్ అందాన్ని చూసానన్న శరత్ ముఖంలో ప్రతిఫలిస్తున్న ప్రేమాతిశయానికి వశమై అతని శిరసుని గుండెలకు హత్తుకుని పరవశించింది.
"సరే, అమ్మాయి గారికి కోపం వచ్చినంత త్వరగాను తగ్గిపోయిందిగా'' అన్నాడు శరత్ ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి.
"మరి నాకు వెన్నెల్లో తాజ్ మహల్ ని చూపిస్తారుగా'' పొడవాటి వేళ్ళను అతని ఉంగరాల జుత్తులోనికి పోనిస్తూ అతని ముఖంలో ముఖంపెట్టి అడిగింది.
"ఇంత దగ్గర్నుంచి అడిగితె కాదనగలనా'' నవ్వుతూ అడిగాడు.
"అయితే ఎప్పుడు?'' ఆఫీసులో బిజీ అనో, శలవులు లేవనో, చెప్తాడేమో అని ఆమె మనసులో ఏదో మూల భయం. అందుకే ఆ దగ్గరతనాన్ని దూరం చేయకుండానే అడిగింది. పట్టు సడలించకూడదనే కృత నిశ్చయంతో.
ఆమె కళ్ళల్లోని మెరుపులు చూస్తూ 'సృష్టిలో అందమంతా నాకు నీ దగ్గరే అనుభవమౌతుంటే ఎక్కడికో వెళ్దామంటావేమిటి పిచ్చి పెళ్ళామా' అనుకుంటూ "నీ పుట్టినరోజుకి'' అని ప్రతిపాదించాడు.
"ఊహు, మన మొట్టమొదటి పెళ్ళిరోజుకి'' 'ఏమంటావు' అన్నట్లు చూస్తూ అడిగింది.
"సరే'' అన్నాడు.
'అబ్బ జయించాను' అనుకుంది రాధిక మళ్ళీ అతన్ని హత్తుకుంటూ.
'అబ్బ జయించాను' అనుకున్నాడు అతను కూడా ఆమెను అల్లుకుపోతూ.
*****
మళ్ళీ వారాంతానికి వెన్నెల్లో తాజ్ ని చూడడానికి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో అడిగింది రాధిక.
"దగ్గర్నుంచి చూడనివ్వరట రాధీ'' కిచెన్ ఫ్లాట్ ఫారంపై కూర్చుని రాధిక వేసి ఇచ్చిన దోశ తింటూ అన్నాడు శరత్.
"ఏం, ఎందుకని?'' అంది రాధిక. 'ఈయనకు ఇల్లు కదలాలంటే బద్ధకం' అనుకుంటూ.
"సెక్యూరిటీ కోసం రెడ్ స్టోన్ ఫ్లాట్ ఫారం అని ఉంటుందట అక్కడి నుంచి చూసి వచ్చేయాలట. ఇఅరవై ముప్పై మంది పర్యాటకులను ఒక్కో జట్టుగా చేస్తారట. అలా జట్లు జట్లుగా తాజ్ ని చూడటానికి వదులుతారట. ఒక్కో జట్టుకి ఓ పావుగంట సమయం ఇస్తారట. చూసి వచ్చేయాలట''
"ఎవరు చెప్పారేమిటి?''
"మన మోహన్ వాళ్ళు లేరూ, వాళ్ళుపోయిన సంవత్సరం వెళ్ళారట'' అలవాటుగా నిజం చెప్పి, నాలుక కరుచుకున్నాడు. దొరికిపోయానురా దేవుడా అంకుంటూ.
చురుగ్గా చూసింది రాధిక.
వెంటనే మాట మార్చకపోతే ప్రమాదం అనుకుని "దోశ చాలా బాగుంది. ఎక్కడ నేర్చుకున్నావ్వోయ్'' తమాషాగా అన్నాడు.
"ఆ! తాజ్ మహల్ ఎదురుగా కాకా హోటల్ లో'' వ్యంగ్యంగా అంది.
"లేదు రాధీ, సంపత్ కోసం ప్రయత్నించాను. వాడు యుకె వెళ్ళాడు. వచ్చేవారం ఇండియాకి వచ్చేస్తాడు. రాగానే నేను అన్ని ఏర్పాట్లు చేయిస్తాను కదా!'' గబగబా చెప్పాడు.
"పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ పెట్టుకుని అనవసరంగా కొలీగ్స్ తో మాట్లాడట మెందుకు? మనం వెళ్ళి రాకముందే ఈ విషయం అందరూ చర్చించుకోవడానికా! రేపట్నుంచి సంగీత నన్ను అడుగుతుంది. ఎప్పుడు వెళ్తున్నారు ఏమిటి అంటూ అసలు మీకు గుట్టులేదు'' నిష్టూరంగా అంది.
'హమ్మయ్య!! తుఫాను రాబోయేది, దేవుడి దయవలన చిరుజల్లుతో సరిపోయింది' అనుకున్నాడు.
సంపత్ పురావస్తుశాఖలో ఉన్నత్యోద్యోగంలో ఉన్నాడు. శరత్ కు కాలేజీలో సీనియర్. బాగా సన్నిహితుడు. అతను అడిగితే సహాయం చేస్తాడు. సంపత్ తో మాట్లాడి రాధిక కోరిక ఎలాగైనా నెరవేర్చాలని అనుకున్నాడు శరత్.
*****
సంపత్ యుకె నుంచి వచ్చాక అతనికి కాల్ చేసాడు శరత్. సంపత్ తన పలుకుబడిని ఉపయోగించి ప్రముఖులకు మాత్రమే అరుదుగా ఏర్పాటు చేసే ఒక ప్రత్యేకమైన సందర్శన సౌకర్యం వాళ్ళకు కల్పిస్తానని మాట ఇచ్చాడు.
తాజ్ మహల్ లోపలికి వెళ్ళే చోట మెట్లు ఉన్న ప్రదేశాన్ని 'చమేలీ ఫర్ష్ అంటారు. అక్కడ నుంచి తాజ్ మహల్ ముప్పైమీటర్ల దూరంలో ఉంటుంది. అదే రెడ్ స్టోన్ ఫ్లాట్ ఫాం నుంచి అయితే మూడు వందల మీటర్లు ఉంటుంది. అంతదూరం నుంచి స్పష్టంగా కనిపించటం లేదని పర్యాటకులు అసంతృప్తి చెందుతుంటారు.
ఆ 'చమేలీ ఫర్ష్' దగ్గర కూర్చుని వెన్నెల్లో తాజ్ ని చూసే ఏర్పాటు చేస్తానని సంపత్ మాట ఇచ్చాడు శరత్ కి. రాధికతో ఆ విషయం చెప్పి సంతోషపెట్టాడు శరత్.
వెన్నెల్లో తాజ్ మహల్ కార్యక్రమం తమ పెళ్ళిరోజునే ఎందుకు పెట్టిందో ఫ్లయిట్ టికెట్స్ బుక్ చేయడానికి కాలెండర్ దగ్గర పెట్టుకున్నప్పుడు తెలిసింది శరత్ కి. వాళ్ళ మొదటి పెళ్ళిరోజు సరిగ్గా పౌర్ణమి నాడు వచ్చింది. ఎంతో ఆశగా తమ ప్రయాణం కోసం ఎదురు చూడసాగారు యువజంట.
వారి ప్రయాణానికి మూడు రోజులు ఉందనగా సంపత్ నుంచి ఊహించని కబురు వచ్చింది. టెర్రరిస్ట్ ఎటాక్ ఉండే అవకాశం ఉందన్న సమాచారం అందటం వలన ఆ పున్నమికి రాత్రిపూట తాజ్ సందర్శనాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
రాధికకు తీవ్ర ఆశాభంగం కలిగింది. ఆమెను ఓదార్చడానికి శరత్ ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసాడు. కానీ ఆమె మామూలుగా అవ్వలేకపోయింది.
*****
అంతా సవ్యంగా జరిగితే ఆరోజే వాళ్ళు ఆగ్రా వెళ్ళాల్సిన రోజు. శలవులు ముందే పెట్టేసాడు కాబట్టి సిటీలోనే తిరుగుదామని అనుకుంది రాధిక.
శరత్ రాధిక దగ్గరకు వెళ్ళి "రాధీ, నువ్వు ఇష్టపడిన చోటుకి నిన్ను తీసుకు వెళ్ళలేకపోయాను. కాని నాకు తెలిసిన వేరే చోటు ఉంది. నువ్వు చూస్తే నీకు కూడా నచ్చవచ్చు.
"అక్కడికి?'' నిరుత్సాహంగా అడిగింది.
"ఎక్కడకు, ఏమిటి అని అడగకు. చూడు, ఎక్కడకు వెళ్తామో. నీకు నచ్చుతుందనే నా నమ్మకం.''
శరత్ ని నొప్పించటం ఇష్టం లేక కొంత, తన ఆశాభంగాన్ని అధికమించటానికి కొంత, రాధిక అతని ప్రతిపాదనకు సమ్మతించింది.
ట్రైన్ ఎక్కి బయల్దేరాక కూడా ఎక్కడికి అని రాధికకు చెప్పలేదు. తెల తెలవారుతుండగా స్టేషనులో దింపాడు. కళ్ళు నులుముకుంటూ చూసిన రాధికకు 'రాజమండ్రి' అని కనిపించింది. స్టేషనులో దిగగానే ఎవరో వచ్చి వాళ్ళను రిసీవ్ చేసుకున్నారు. బయటకు వెళ్ళగానే వారికోసం వేచి ఉన్న ఇన్నోవాలో వారి సామాను లోడ్ చేసి వారిని తీసుకుని హోటల్ కు తీసుకునివెళ్లారు.
హోటల్ కి చేరాక, "త్వరగా తయారవ్వు మళ్ళీ వెంటనే వెళ్ళాలి'' అని హడావుడి చేసాడు.
ఇద్దరూ తయారై సామాను తీసుకుని మళ్ళీ కారేక్కారు. సిటీలో నుంచి గోదావరి బ్రిడ్జి ఎక్కి కారు వెళ్తూ ఉంటే ఆసక్తిగా చూసింది రాధిక. బ్రిడ్జి దిగిన తరువాత రోడ్డుకి ఇరుప్రక్కలా పచ్చని చేలు చూసి రాధిక మనసు ఉల్లాసంగా అయింది.
కారు నది దగ్గర ఆగింది. అక్కడ ఆగి ఉన్న చక్కని ఎయిర్ కండీషన్డ్ క్రూయిజ్ లోకి రాధికను ఎక్కించాడు శరత్. జీవితంలో తొలిసారి నదిలో బోటు ప్రయాణం చేయబోవడం రాధికకు చెప్పలేనంతగా ఎక్సైటింగ్ గా అనిపించింది.
బోతులోనే కాఫీలు, టిఫిన్లు సర్వ్ చేసారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీరిద్దరకు రాచమర్యాదలు చేయించాడు ట్రావెల్ ఏజెంట్.
గోదావరి అందం, ఇరువైపులా తీరాన ఉన్న వనప్రాంతం, కొండలు, అక్కడక్కడా కనిపించే చిన్నచిన్న లంకలు అన్నీ చూస్తూ ఉంటే రాధికకు మళ్ళీ తన సహజసిద్ధమైన ఉల్లాసం కలిగింది.
పాపికొండలు దూరం నుంచి పెద్దగోడలా ఇక దారిలేదు అన్నట్టు కనిపించి, దగ్గరకు వెళ్ళేసరికి మీ కోసమే దారి ఇస్తున్నాం అన్నట్టు మరలా దారి కనిపించే దృశ్యం చూసి రాధిక థ్రిల్లయిపోయింది. శరత్ తో కబుర్లు చెప్పుకుంటూ, పరాచికాలు ఆడుతూ ఉత్సాహంగా తమ ప్రయాణాన్ని ఆస్వాదించసాగింది రాధిక.
అక్కడ ప్రక్రుతి అందాలు చూస్తుంటే కాలం ఎంత త్వరగా అయిపోయిందో తెలియలేదు.
తిరుగు ప్రయాణంలో రాధికకు తమ ప్రయాణం అప్పుడే అయిపోవస్తుందని కాస్త దిగులు కూడా కలిగింది. అయితే మరుసటి రోజు తమ పెళ్ళిరోజు కాబట్టి, ఆ రోజుకి ఇంటికి చెరి సెలెబ్రేట్ చేసుకుందామని సమాధానపడింది తనకు తానే.
అంతలోనే చోటు ఒకచోట ఒడ్డుకి తీసి ఆపారు. శరత్ సామాను దింపుతుంటే రాధిక ఆశ్చర్యపడింది. 'ఇక్కడేముంది' అనుకుని.
కాస్త దూరంగా ఉన్న వెదురు కుటీరాలవంటి వద్దకు వాళ్ళను తీసుకు వెళ్ళాడు ఏజెంట్. వాటిలో ప్రత్యేకంగా అలంకరించిన కుటీరంలోకి దారి తీశాడు/ చిన్నగా ఉన్నా ఎంతో సౌకర్యంగా ఉంది ఆ కుటీరం.
"కాసేపు రెస్ట్ తీసుకో'' అన్నాడు శరత్.
ప్రయాణపు బడలికతో రాధిక వెంటనే నిద్ర పట్టేసింది.
లేచేసరికి చీకటిపడింది. బయటకు వచ్చి చూసిన రాధికకు కాస్త దూరంగా కాంప్ ఫైర్ ఏర్పాటు చేయిస్తున్న శరత్ కనిపించాడు. రాధికను చూసి దగ్గరకు వచ్చాడు శరత్. "బాగా నిద్రపట్టిందా'' అని పలకరించాడు. నవ్వుతూ తల ఊపింది రాధిక.
కాస్త కాఫీ తాగి స్నానం చేసి రా ప్రోగ్రాం మొదలు పెడదాం'' అన్నాడు.
ఎండిన కట్టెలను నేర్పుగా పిరమిడ్ లా అమర్చారు.
రాధిక తయారై వచ్చాక, ఆమె చేతికి ఒక కొవ్వొత్తి ఇచ్చారు. శరత్ కి పొడవాటి కర్ర ఒకటి ఇచ్చారు. దాని చివర చిన్న గరిటెలా ఉంది దానిలో కర్పూరం ఉంచారు. రాధిక కొవ్వొత్తితో ఆ కర్పూరాన్ని వెలిగించింది. శరత్ దానితో నెగడు వెలిగించాడు.
చిన్నగా చేతులు చరుస్తూ వృత్తాకారంలో తిరుగుతూ ఏదో జానపద గీతాన్ని మధురంగా వినిపిస్తూ నృత్యం చేయసాగారు మన సంప్రదాయ దుస్తులు ధరించి అక్కడే ఉన్న కళాకారులు కొందరు.
యువడంపతులను కూడ ప్రోత్సహించి, తమతో పాటు పాల్గొనేలా చేసారు. పక్కనే ఉండి వింత వింత వాయిద్యాలతో సందడి చేసి ఉల్లాస పరిచారు మిగిలిన కళాకారులు.
చిన్ననాటి నుంచి నగర జీవితానికే అలవాటు పడిన రాధికకు, ఆ వాతావరణం, ఆ కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా ఉండి అపూర్వమూ, అపురూపమూ అయిన అనుభూతిని కలిగించింది.
కాంప్ ఫైర్ ముగిశాక కళాకారులను అభినందించి బోట్ పైకి చేరుకున్నారు వాళ్ళిద్దరూ. డేక్ పైన వారికి భోజనం సర్వ్ చేసారు. వాళ్ళిద్దరూ భోజనం ముగిసేసరికి శుక్లపక్ష చతుర్దశి నాటి చంద్రుడు నిండుగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు.
చందమామను చూసి రాధిక మోము కాలువలా వికసించింది.
గోదావరిలో ప్రతిఫలిస్తున్న కోటి జాబిల్లుల కాంతులు, ఎటు చూసినా రమణీయమైన ప్రక్రుతి సందర్శనంతో ఆమెకు మాటలకందని పారవశ్యం కలిగింది.
"శరత్! నాకు అపురూపమైన బహుమతినిచ్చావు'' అంది మురిసిపోతూ.
"కాని నీకు వెన్నెల్లో తాజ్ ని చూపించలేకపోయాననే బాధ అలాగే ఉంది'' అన్నాడు శరత్.
తాజ్ చుట్టూ భద్రతాదళాలు పహరా తిరుగుతూ ఉంటే, ఇతర పర్యాటకులతో పాటు, ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక పాలరాతి కట్టడమైన తాజ్ ని చూస్తే కలిగే ఆనందానుభూతి గొప్పదా, లేక ఈ ప్రశాంత వాతావరణంలో సజీవ గోదావరి అందాన్ని చూస్తూ పైనుంచి వెన్నెల జల్లు కురుస్తుంటే ఏకాంతంగా తామిద్దరూ ఒక్కటిగా ఉన్న ఈ ఆనందానుభూతి గొప్పదా అని రాధిక మనసులో బేరీజు వేసుకుంది.
ఏ క్షణాన ఏ ముష్కరులు దాడిచేస్తారో అనే భయం మధ్య అందమైన తాజ్ ను వెన్నెలలో చూడడంకంటే తమ హృదయాలలో నిర్మల ప్రేమ జలలు ఊరేలా చేస్తున్న ఈ పవిత్ర సహజ సౌదర్యం మాటలకందనిది అనుకుంది రాధిక.
తను కోరిన కోర్క తీర్చటానికి శరత్ ఎంత తపించాడో స్వయంగా చూసింది. ఆశాభంగం వలన తనెక్కడ బాధపడుతుందో అని శరత్ ఎంతో వేదన పడ్డాడు.
భర్త హృదయంలో భార్యకోసం కట్టే సజీవ ప్రేమమందిరం, వారికోసమే ప్రత్యేకంగా వెలిసిన తాజ్ అవుతుంది కదా! ఎవరన్నారు తాను వెన్నెల్లో తాజ్ ని చూడలేకపోయానని. అది తన ప్రియసఖుని కౌగిట్లో పదిలంగా ఉందిగా అనుకుంది రాధిక.
'సౌదర్య వస్తుగతమే కాదు, దృష్టిగతం కూడా' అని రాధిక చెవిలో చెప్పింది ప్రకృతి.
"తాజ్ ఎక్కడికి పోతుంది. కావాలంటే వచ్చే నెల వెళ్ళొచ్చు లేదా వచ్చే యేడు వెళ్ళొచ్చు. కాని నాకు మరో తాజ్ కనబడుతోంది నీ గుండెల్లో'' అంది రాధిక శరత్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ.
"నీకు మన పెళ్ళిరోజు శుభాకాంక్షలు ప్రియతమా'' అన్నాడు శరత్ గడియారంలో తారీఖు మారడం గమనించి.
"నీకు కూడా'' అంది అతని భుజంపై తలవాల్చి బాగా దగ్గరగా వస్తూ. ఆమె నడుము చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు శరత్.
"అవునూ, రేపు కూడా ఇక్కడే ఉందామా?'' అంది రాధిక ఆ దగ్గరితనంలో ఉన్న అడ్వాంటేజ్ ని వదలకూడదనుకుంటూ.
"ఊ ...'' అన్నాడు శరత్.
'అబ్బ జయించాను' అనుకుంది రాధిక అతన్ని హత్తుకుంటూ.

No comments:
Post a Comment