తరతరాలుగా మీ జాతిని బానిసగా పడి ఉండమని శాసించే సంప్రదాయాల సాక్షిగా ... భర్త అనే పదం లేకపోతే ఇహం శూన్యమంటూ చాటి చెప్పే ఈ ఆచారాల సాక్షిగా ... వరకట్నాలు లేకపోతే అగ్నికే ఆహుతి చేస్తామంటున్న ఈ అగ్నిసాక్షిగా ...
ఏడడుగుల సప్తపది కాదు, ఏడేడు జన్మలకు నాకు బానిసవంటూ అడుగులో అడుగువేయించే ఈ సప్తపది సాక్షిగా ... నీ కష్టాలన్నీ నీవే, నీ సుఖాలు మాత్రం నావి నాటి చరామి?!
*****
"ప్రణవి డార్లింగ్
అతని చేతులు ఆమె నడుమును చుట్టేశాయి. ఆ చేయి అలా ... అలా ... వెళ్ళి నడుము దగ్గరున్న మడతను సున్నితంగా టచ్ చేసింది. ఆమె శరీరంలో లక్ష వోల్టుల విద్యుత్. విశాలమైన భవనంలో, ఏకాంత సమయంలో, అందమైన బెడ్రూమ్ లో ఆ అర్ధరాత్రివేళ. శృంగార సామ్రాజ్యాన్ని యధేచ్చగా పరిపాలించడానికి సమాయత్తమవుతున్న అపర మన్మథుడిలా కనిపిస్తున్నాడామె కళ్ళకి అతను.
అతని పేరు అవకాశ్. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కాంట్రాక్టర్. వెనకా ముందూ మొన్నటివరకు లేదు. కానీ ఇప్పుడు అతని వెనక ఆస్థి వుంది. ముందు భవిష్యత్తు వుంది.
అది నచ్చింది ప్రణవి తల్లితండ్రులకు.
అంతకన్నా నచ్చింది మరోటికూడా వుంది.
అది అతని ఆదర్శం.
ఆ నచ్చడం ఆదర్శం కాదు, ఆదర్శం పేరుతొ కాణీ కట్నం లేకుండా ప్రణవిని పెళ్ళి చేసుకోవడానికి అవకాశ్ ముందుకు రావడం. అందుకే హడావిడిగా పెళ్ళి, అంతకన్నా హడావిడిగా శోభనం.
"ప్రణవి డార్లింగ్ ... అనడంలో నువ్వు ఎవ్వరివైవుంటావు?''
"కళ్ళు పైకెత్తలేదు. పైకెత్తితే ఈ స్వర్గం జారిపోతుందేమో, రెండు పదుల కన్నెరికం అలాగే ఉండిపోతుందేమో! పుస్తకాల్లో ఏవో చదివి ... ఏవేవో ఊహించుకునే వయసు. అతను ఆమె మీదకి ఒదిగిపోయాడు. అతని ఊపిరి ఆమె గుండెల మధ్య విలవిల్లాడి పోతుంది. అప్రయత్నంగా ఆమె చేతులు అతని వీపుని చుట్టేశాయి. అతని చేయి ఆమె శరీరం మీద నాట్యం చేస్తోంది. పాదాలనుండి ఆ చేయి అలా ... అలా ... ఒళ్ళు ఝల్లుమంది. నరాలు లాగేసినట్టుగా ... గుండెను బిగపట్టి వదిలి ... మళ్ళీ బిగపట్టినట్టుగా ...
సరిగ్గా అప్పుడే ...
ప్రణవి అందమైన అనుభూతిని భంగపరుస్తూ తలుపు మీద శబ్దం.
"వద్దు' అన్నట్టుగా అవకాశ్ ని గట్టిగా తన చేతులతో బంధించింది. ఆమె ఎత్తైన గుండెలు అతని వక్షస్థలాన్ని ఢీ కొట్టినట్టుగా అనిపించింది. అయినా బలవంతంగా లేచాడు. లేచి చీర సర్దుకుంది.
ఇంత రాత్రివేళ తమ బెడ్ రూమ్ లోకి వచ్చే ధైర్యమెమీవరికి ఉంటుంది.?
తలుపు తెరిచాడు అవకాశ్.
ఎదురుగా ఓ శాల్తీ ...
"సార్ ... మినిస్టర్ గారు గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మరో గంటలో వెళ్ళిపోతారట. ఊలోగానే మనం ఆ ఫైల మీద సంతకం పెట్టించుకోవాలి. లేకపోతే మినిస్టర్ గారు దొరకరు. లక్షలు విలువచేసే కాంట్రాక్ట్ మనకు దక్కదు'' అతను తన పని పూర్తయిందన్నట్టుగా ఆగాడు.
"అలాగా, ఒక్క నిముషం ...'' అంటూ డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు, ''మంత్రిగారికి అన్ని ఏర్పాట్లు చేసావా?''
"సారీ సార్! అన్నీ పూర్తయ్యాయి కానీ ... ఫిగర్ ఎక్కడా దొరకలేదు''
"బ్రోతల్ హౌస్ కి వెళ్ళకపోయావా?'' అసహనంగా అన్నాడు అవకాశ్.
"మంత్రికి సెకెండ్ క్లాస్ నచ్చదు ఫ్యామిలీ టైపులో ఫిగర్ అత్రాక్తివ్ గా వుండాలి''
"ఎక్కడైనా ట్రై ...''
"లాభం లేదు సార్''
"మరి ఎలా?'' అంటూ విసుగ్గా ముందుకు నడవబోయి ఆగాడు. ఎదురుగా అద్దంలో కనిపిస్తున్న రూపం చూసి.
"సార్!'' అతని ఉద్దేశం అర్థమయిన ఆ శాల్తీ వణికిపోయాడు. తప్పదు అంటూ వెనక్కి తిరిగి "ప్రణవి! నువ్వు త్వరాగా తయారవ్వు'' అన్నాడు అవకాశ్.
"ఎక్కడికండీ?'' అప్పటివరకూ భర్త సంభాషణ అయోమయంగా అనిపించటంతో కంగారుగా అడిగింది ప్రణవి.
"మరేం లేదు ... మినిస్టర్ గారు గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మనకో చిన్న సంతకం కావాలి. ఆ సంతకం కావాలంటే ఆయనకో చిన్న వీక్ నెస్ ఉంది. అదే అందమైన అమ్మాయిల వీక్నెస్. ఆయన పెట్టే చిన్న సంతకం సుమారు పదిలక్షల విలువ చేస్తుంది. అందుకని ...''
"అందుకని ...!''
"మరేం లేదు ... నువ్వా మినిస్టర్ గారిని ఎంటర్ టైన్ చెయ్యాలి. జస్ట్ ఓ గంట అంతే ...''
ఖాండ్రించి అతని మొహం మీద ఉమ్మేయాలన్న కోరికను బలవంతంగా అణచుకుంది.
"అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్యను తారుస్తున్నావా?'' ఆమె అణువణువూ అసహ్యంతో నిండిపోయింది.
"ప్రణవి! నయా పైసా కట్నం లేకుండా నిన్ను పెళ్ళి చేసుకుంది పిల్లల్ని కానీ నిన్ను జీవితాంతం పోషించడానికి కాదు. నేను నిన్ను జీవితాంతం వరకూ కాంట్రాక్టు తీసుకున్నాను. తాళి అనే ఖరీదు కట్టా, నీ మీద సర్వహక్కులూ నావే. వ్యాపారానికి నువ్వు నిజిన్స్ మెటీరియల్ వి'' అతని మాటలు పూర్తికాకుండానే సూట్ కేస్ తో బయటకు అడుగుపెట్టింది.
"ఆగు....!''
"ఆగవలసిన అవసరం లేదు ... ఇదిగో నువ్వు కట్టిన తాళి'' మెడలోని మంగళసూత్రాన్ని అతనికేసి విసిరికొట్టింది.
"మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా' పురోహితుడు వేయించి తన సప్తపది దాటింది. అగ్నిసాక్షిగా ఆ అగ్నిగుండంలోనుండి బయటకొచ్చింది. ఉరితాడుగా ఉన్న ఆ పసుపుతాదుని విసిరేసింది.
*****
ఇది జరిగి సంవత్సరం అయింది.
ఈ సంవత్సర కాలంలో చాలా మార్పులు జరిగాయి. కాంట్రాక్టర్ అవకాశ్ తన అవకాశవాదంతో అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో ప్రవేశించాడు. ఓ ప్రక్క డబ్బును, మరోపక్క గూండాలను పెట్టుకున్నాడు. ఎన్నికలొచ్చాయి ... పచ్చనోట్లు విరజిమ్మాడు ... గూండాయిజాన్ని ప్రదర్శించాడు.
ఇప్పుడు అవకాశ్ కాంట్రాక్టర్ కాదు ... రాష్ట్రానికి మంత్రి ... అక్షరాల అవకాశ్ అమాత్యులిప్పుడు.
కథలోకి వస్తే ...
అవకాశ్ తన స్వంత నియోజకవర్గమైన తన స్వంత ఊరికి వచ్చాడు. ఆ రాత్రి తన స్వంత ఇంట్లో ... తన బెడ్రూమ్ లో ... అటూ ఇటూ తిరుగుతున్నాడు.
అప్పుడే లోపలికోచ్చాడో కాంట్రాక్టర్.
"నమస్కారం సార్ ...!''
"నమస్కారాలెందుకులే''
"ఏదో ఓ చిన్న కాంట్రాక్ట్ ... మీరు ఊ అని సంతకం చేస్తే ...''
"పదిలక్షల కాంట్రాక్ట్ నీదవుతుంది. మరి నాకేంటి?''
"మీకోసం ఓ మంచి ఫిగరుందిసార్''
ఒక్కసారి మంత్రి నరాలు జివ్వుమన్నాయి. ఈ రాజకీయాల్లోకి వెళ్ళినప్పటినుంచి బిజీ ...
"మనకు బ్రోతల్ సరుకు పనికిరాదు''
"కాదు సార్ ... ఫ్యామిలీ ఫిగర్ ... పాపం భర్తకు ఏదో ఆపరేషనట ... డబ్బు ఇబ్బందుల్లో వుంది''
"బాగుంటుందా?''
"చాలా బాగుంటుంది సార్ ... మరి సంతకం?'' సంశయంగా అడిగాడు కాంట్రాక్టర్.
"ముందా అమ్మాయిని లోపలికి పంపు. సంతకం తర్వాత పెడతానులే''
వెంటనే ఇంపోర్టెడ్ పెర్ ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నాడు. మెల్లగా అడుగుల సవ్వడి. తల తిప్పాడు అవకాశ్.
షాక్!
"ప్రణవి?!''
"అవును ప్రణవే''
ఒక్క క్షణం షాక్ లో నుండి తేరుకోవడానికన్నట్టుగా ఆగాడు. ఆ తర్వాత విరగబడి నవ్వసాగాడు.
"ఒకపుడు నా భార్యగా ఈ బెడ్రూమ్ లో స్వర్గ సుఖాలూ అనుభవించవలసిన నువ్వు ఈ రోజు ఓ వేశ్యగా వచ్చావా?''
" .... ''
"ఆరోజు నాకోసం ఓ మనిషిని తృప్తి పరచమంటే నా మొహాన తాళిబొట్టు కొట్టి వెళ్ళిన నువ్వు ఈ రోజు ఎలా వచ్చావు వ్యభిచరించడానికి?'' అతని మాటల్లో కసి, కోపం, వ్యంగ్యం.
"అవును ... ఆరోజు నీ భార్యగా నీ మంచంమీద నీతో మానసికంగా వ్యభిచరించలేకపోయాను''
"ఓహో ... మరిప్పుడు మగతనం లేని నీ భర్త పనికిరానివాడని నాదగ్గరకి వచ్చావా?''
"నా భర్తకు మగతనం లేదు. కానీ మంచితనం వుంది. అది లేని నువ్వు బ్రోకర్ లా నన్ను తార్చడానికి సిద్ధపడ్డావు. నిజమైన మానసిక నపుంసకుడివి నువ్వు. కానీ నా భర్త హృదయమనే మగసిరి వున్నవాడు. అలాంటి వ్యక్తిని బ్రతికించుకోవడానికి నేను నా శీలాన్ని ఫణంగా పెడుతున్నాను''
"ఓహో నువ్వు మహా పత్రివ్రతవన్నమాట?''
"నువ్వు చదివిన పురాణాల్లో, గ్రంథాల్లో వున్న ప్రతివ్రతల లిస్టులో నేను చేరకపోవచ్చు. కానీ ఓ మానవత్వమున్న మనిషిని. మనసా వాచా నా సుఖాన్నే కోరే ఓ మనిషిని. మానసికంగా నా గుండెల్లో నిలిచినా ఓ వ్యక్తిని బ్రతికించుకోవడానికి నీలాంటి అవకాశవాదికి నా శీలాన్ని అద్దెకిస్తున్నాను. చాలా ...?'' ఆమె గుండెలు ఎగిసెగిరి పడుతున్నాయి.
"నా భర్త ప్రాణం ఖరీదు చెడిన నా శీలమే అయితే అందుకు సిద్ధపడే నేను వచ్చాను. కమాన్ ....'' చీర కుచ్చెళ్లు లాగింది.
ఎదురుగా వున్న అద్దంలో ... ఈ వికృత వ్యవస్థ నగ్నరూపం ప్రతిబింబం కనిపిస్తుంది.
*****
ప్రాణం కన్నా మిన్నగా భావించే శీలం కోసం సంప్రదాయాల, ఆచారాల సంకెళ్ళు తెంచుకున్న స్త్రీ ... ఓ మానవత్వమున్న మనిషిని, తన జీవితాన్ని ఓ పరిపూర్ణ భర్తగా నీడలా వెన్నంటి ఉండే వ్యక్తికోసం ఆ శీలాన్ని ఫణంగా పెట్టే ధరిత్రి స్త్రీ. ఆమె చేసింది తప్పే అయితే ఆ తప్పు ఈ అస్తవ్యస్త వ్యవస్థని శపించుగాక!

No comments:
Post a Comment