Wednesday, January 9, 2013

Oo manasa!!!

భర్తను మూడు కోరికలు కోరి, రాముడ్ని అడవికి పంపి, భర్త మరణాన్ని తనకు శాపంగా మిగుల్చుకుంది కైకేయ. బంగారులేడి నడిగి, రామ-రావన యుద్ధానికి నాంది పలికింది సీత. పారిజాతాన్ని కోరి శ్రీక్రిష్ణుడ్ని ఇక్కట్లలోకి నెట్టింది సత్య. ఆనాటి భార్యల చిన్న చిన్న కోరికలు ... పురాణాల్లోని నీతి వాక్యాలు.
ఈనాటి భార్య చిన్న బలహీనత ఆమె భర్త అనే జీవుడ్ని ఎలాంటి ఇక్కట్లకు గురిచేసిందో తెలుసా ...
శ్రీమతి ముచ్చట్లు సాక్షిగా ... చదివి తెలుసుకోండి.
"
ఏయ్ సుశ్రితా ... ఎక్కడ్నుంచి ప్రారంభించను ... సారం నుంచి మొదలెట్టి మస్తకం వరకు చుంబకయాత్ర కొనసాగించనా?
తెల్లటి పాదాన్ని చూస్తే ముద్దుల ముద్రలు అదేపనిగా వేయాలనిపిస్తోంది. పసిడి ఛాయతో మెరిసే పాదాలపై భాగం నునుపుదనం చూస్తోంటే మన పెళ్ళయి అప్పుడే అయిదేళ్ళు దాటిందా అనిపిస్తోంది. అదేంటీ నీ నాభిలో ఎన్ని గుప్తనిధులకు సంబంధించిన రహస్యాలున్నాయో ...''
రుత్విక్ లో భాపుకత పొండి, శృంగార ముకత పరవళ్ళు తొక్కి, రసానుభూతి చిందుకు వేస్తోంది. ముఖ్యంగా యిలాంటి వెన్నెల రాత్రుల్లతో మరీ ఎక్కువ.
"
మాట్లాదవేంటి సుశ్రితా ... నీ మెడ బాపులో సుఖముందా! నీ నడుం ఒంపులో శృంగార మాధుర్యముంటుందా? వీటితో నాకెప్పుడు పెచీయే ... ఒక్కేసారి నీ పొట్టమీద తల ఆన్చి, నిద్రపోయి తర్వాత మెలకువ వస్తే అమృత కలశాలే దర్శనమిస్తాయి ...'' అతని మాటల్లో కొంతెదనం ప్రస్ఫుటమవుతుంది.
సుశ్రిత అతని ఛాతీ మీద తలవాల్చి గుండెల మీద ఉన్న పుట్టుమచ్చ చుట్టూ చూపులు వేలుటీ సంనాలా చూసుకు వింటోంది.అతని ఆఖరి మాటలకు సిగ్గుతో ముఖం ఎర్రగా అయింది.
"
సిగ్గులేకపోతే సరి ... ఏదైనా క్రికెట్ కామెంటరీనా? పెళ్ళాంతో మాట్లాడవలసిన మాటలేనా? అయినా మీలో చిలిపితనం రోజురోజుకీ ఎక్కువవుతోంది'' ముద్దుగా విసుక్కుంది మొగుడ్ని సుశ్రిత.
"
పోనీ పక్కింటి ప్రణతితో మాట్లాడేదా? ఎదురింటి రమణితో ముచ్చట్లాడేదా?'' అతను చిరుకోపంగా అన్నాడు.
"
ష్ ...'' అంటూ యిక లాభం లేదన్నట్లు అతని పెదాలను తన పెదాలతో మూసేసింది.
ఒక్క క్షణం మాట్లాడలేకపోయాడు. తాంబూలం సేవించినట్లుండే ఆమె ఎర్రటి పెదాలు ... అతని పెదాలతో ముదిపడ్డాయి. పంచదార పాకం అతని పెదాల మీద చిలికినట్టయింది. అతని నడుం చుట్టూ ఆమె చేతులు బిగుసుకున్నాయి.
"
సుశ్రిత డియర్ ... ఎంత బావుందీ సమయం''
"
యిది ఫలానా బ్రాండ్ వారి సమయం కాదు శ్రీవారు ... యిది మీ శ్రీమతి గారి సమయం, శృంగారానికి సింగారాలు అద్దే సమయం ... అయిన మాటలతో కాలాయాపన చేసేవాళ్ళు కాస్త దృష్టిని లైఫ్ పార్టనర్ పైకి మళ్లించి, రొమాంటిక్ వార్ ఎలా మొదలెట్టాలో ఆలోచిస్తే బావుంటుంది కదూ ...'' ఆమె మాటల్లో ఇన్విటేషన్ ప్లస్ డి హింట్.
"
యూ నాటీ ...నువ్వు నాకు దొరకడం అద్భుతమైతే నేను నీకు దొరకడం ...''
"
అపురూపం ...''' అంది భర్త తలను తన గుండెల పైకి లాక్కుంటూ ....
ఆమె రెండు గుండెల మధ్య తల వాల్చుకొని శరణార్థిగా మారాడు అతను. ఆమె వేడి నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. గుండెల మధ్య అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు చక్కర్లు కొడుతున్నాయి.
ఆమె మత్తుగా మూలిగింది. భర్త తలను తన గుండెలకు గట్టిగా హత్తుకుంది.
వాళ్ళిద్దరి మధ్య మాటలు కరువయ్యాయి. చేతలు మాత్రమే మిగిలాయి. ఒక విధమైన చేతనావస్థలో వుండిపోయారు. వాళ్ళ పెళ్ళయి అయిదేళ్ళు దాటింది. అయినా ఎప్పుడూ ఫ్రెష్ గా వుంటారు. అతను బిజినెస్ పనుల మీద వారంలో మూడు రోజులు బయటే వుంటాడు. మిగతా రోజుల్లో అతను ఆఫీసు నుంచి పెందరాళే వస్తాడు. తర్వాత వాళ్ళ యింటి తలుపులు మూసుకుంటాయి. వాళ్ళ మనసు తలపులు తెరచుకుంటాయి. శృంగార తలపులు గుర్తుకొస్తాయి.
పడగ్గదిని యుద్ధక్షేత్రంగా మారుస్తారు. స్వపక్ష నిపక్షులవుతారు. అతనామెకు శరణాగతి అవుతాడు. వస్త్రాలు వివస్త్రాలవుతాయి/ వేడి నిట్టూర్పులు తీపి గుర్తులుగా మిగిలిపోతాయి. ఉద్రేకపు నఖక్షత్రాలకన్నా, ఉద్వేగపుటంచు నక్షత్రాలే ఎక్కువ.
అతను ఆపాదమస్తకం ముద్దులతో ముంచెత్తుతాడు. ఆమె అతనికి అడ్డు చెప్పదు. శృంగారంలో సిగ్గూ, బిడియం నిషిద్ధం అని తెలుసామెకు.
ఒకరిలో ఒకరు ఐక్యమవుతారు. ఒకరికోసం మరొకరు ఒకరిలో మరొకరు ఏకమవుతారు.
క్షణం వాళ్ళ కలయిక రమ్యంగా వుంటుంది.
అతనామె నుండి విడివడి ఆమె నుదుట మీద అలుముకున్న స్వేదంపై తన పెదవులు ఆన్చి "థాంక్స్ డియర్'' అన్నాడు ప్రేమగా.
"
నేను చెప్పాలి ...'' అంది అతనికి తన ప్రక్కన చోటు ఇస్తూ సుశ్రిత.
ఇద్దరూ చిన్నపిల్లల్లా ఒకరి మీద మరొకరు చేతులు వేసి కాళ్ళు వేసుకుని కరుచుకొని పడుకుండిపోయారు.
రాత్రి తాలూకు మధురమైన అనుభూతి పర్వానికి రోజు అందమైన వీడ్కోలు చెప్పారు.
ఉదయం తొమ్మిది గంటలు ...
"
సుశ్రిత ... నేను వెళుతున్నాను ...'' హాలోలో నుంచి కేకేశాడు.
"
వస్తున్నా ...'' అంటూ కిచెన్ లో నుంచి బయటకు వచ్చింది.
అప్పటికే రుత్విక్ బ్రీఫ్ కేస్ తో రెడీగా వున్నాడు.
"
మళ్ళీ ఎప్పుడు?''
"
ఎంత రెండ్రోజులు ... ఎల్లుండి రాత్రి తొమ్మిదింటికి ద్రవార్ ని ఎయిర్ పోర్ట్ కి పంపించేయ్ ... అద్సరే ,,, వచ్చేప్పుడు ఏం తీసుకురావాలి?''
"
మీకు తెలియదు'' అంది సుశ్రిత.
నవ్వాడు రుత్విక్ ...
"
ఎందుకలా తెలుగు సినిమాలో విలన్ లా నవ్వుతారు?'' శేషంగా చూస్తూ అంది.
"
ప్రతి మనిషికీ ఏదో వీక్ నెస్ వుంటుందని మధ్యన పుస్తకంలో చదివా ... అది గుర్తుకొచ్చి ...''
"
అంటే ... నాకేం వీక్నెస్ వుందని ...'' మరింత రోషంగా కోపంగా అంది సుశ్రిత.
"
కొందరికి పబ్లిసిటీ అంటే యిష్టం ... మరి కొందరికి సన్మానాలు చేయించుకొని శాలువాలు కప్పించుకోవడం యిష్టం ... యింకొందరికి మైకుముందు నిలబడి గంటల తరబడి స్పీచ్ యివ్వడం వీక్నెస్ ... మధ్య ఏదో మ్యాగజైన్ లో ... బహుశా ఇండియాటుడే అయివుంటుంది. బిజినెస్ మాగ్నెట్ వారం అంతా విమానాల్లో గడిపేవాడట అలా గడిపాక అది అలవాటయిపోయింది. విశ్రాంతి తీసుకునే దశలో రాత్రిళ్ళు కూడా ఫ్లయిట్ లోనే గడపడం అలవాటైన పెద్దమనిషి తన బెడ్ రూమ్ నే విమానంలో కట్టించి. దానిలో రిలాక్స్ అయ్యేవాడట''
"
యిదంతా ఎందుకు చెబుతున్నట్టు?''
"
మరేం లేదు ... నేను బిజినెస్ టూర్ కు వెళ్తే గ్యారెంటీగా నీకేదో తీసుకురావాలి ... అలా అని నీకు కానుకల మీద చీరల మీద, నగలమీద మోజు లేదు. గానీ నేను నీకోసం వచ్చేప్పుడు ఏదైనా తీసుకురాకపోతే యుద్ధమే కదూ ...'' అతను సుశ్రిత వైపు చూస్తూ అన్నాడు.
"
అవున్నిజమే ... మీరు బిజినెస్ పని మీద ఊరు వెళ్ళినా నేను గుర్తుండి, నాకోసం ఏదైనా గిఫ్ట్ తెచ్చేక నాకు తృప్తిగా వుంటుంది. మీరేమీ తీసుకురాకుండా ఒట్టి చేతులతో వస్తే నాలో ఏదో వెలితి నన్ను మర్చిపోయారేమోననే ఫీలింగ్. ఎంత బిజినెస్ బిజీగా ఉన్నానన్నా మరచిపోలేదనే నిజం మీరిచ్చే గిఫ్ట్ చెప్తుంది. అందుకే మిమ్మల్నాలా వేధిస్తానేమో ... నా వీక్నెస్ మీద నాకే కోపం వస్తోంది. సారి నుంచి ఏం తీసుకురానక్కరలేదు లెండి'' అంది ఆఖరి మాట అంటున్నప్పుడు ఆమె గొంతులో సన్ననిజీర.
మాత్రానికే రుత్విక్ ప్రాణం విల విల లాడింది. అరే అనవసరంగా బాధపెట్టానేమో అనుకున్నాడు.
"
సారీ సుశ్రిత నిన్ను బాధపెట్టాలని కాదు. అయినా నీ మనసు నాకు తెలీదా చెప్పు. అందుకే నేను ముందు నీకోసం షాపింగ్ చేసి, నా పని చూసుకుంటా ...'' అన్నాడు భార్య కళ్ళల్లో కన్నీరు మాత్రమే కాదు గొంతులో బాధ సైతం భరాయించలేడతను. అటువంటి భర్త లభించడం ఆమె అదృష్టం అయితే ... ఆమె లభించడం తన అదృష్టం అంటాడు. అందుకే అర్థం చేసుకునే గుణం ఉన్న ప్రతి భార్యాభర్తలు అదృష్టవంతులే.
బయటకు నడిచాడు రుత్విక్.
"
ఆంటీ ... అంకుల్ టూర్ వెళ్ళారుగా ఏదైనా  పిక్చర్ కి వెళదాం వస్తారా?'' అంటూ వచ్చింది పక్కింటి శోభ.
రుత్విక్ లేనప్పుడు సుశ్రిత ఏదో ఒక పెద్ద పనిపెట్టుకుంటుంది. వాడ్రోబ్ మొత్తం నీట్ గా పేపర్ వేసి, కలరా ఉండలు వేసి సర్థసాగింది. తన చీరలన్నీ ఒకవైపు, భర్త షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ మరోవైపు.
"
వద్దులే శోభా ...! ఇవన్నీ సర్దాలి'' అంది.
"
అబ్బ! ఆంటీ చీర ఎక్కడికి? ఎప్పుడుకొన్నారు? చాలా బావుంది'' అంది బెడ్ పై పరిచిన మైసూర్ సిల్క్ చీర చేతిలోకి తీసుకుని చూస్తూ. పట్టుకుంటే పాము కుబుసంలా జారిపోయే ఎర్ర మిరపరంగు మైసూర్ సిల్క్ చీర ఇట్టే శోభ మనసుని దోచేసుకుంది.
దాన్ని చేతిలోకి తీసుకుని గుండెలకు హత్తుకుంటూ ..."ఇది అంకుల్ మొదటిసారి నన్నొదిలి బెంగలూరు వెళ్ళినప్పుడు తెచ్చిన చీర ...'' అంది తన్మయత్వంగా.
"
అబ్బా ...! అంకుల్ కి చీరాల సెలక్షన్ బాగానే తెలుసన్నమాట ... అయినా ఒక్క చీరలేమిటి, మిమ్మల్ని భార్యగా సెలక్టు చేసుకున్నప్పుడే అంకుల్ టేస్ట్ అర్థమయిపోయింది. సారీ ఎప్పటిదాంటీ ...?'' అంది పక్కనే ఉన్న మరో తెల్లచీర తన ఒంటిమీద వేసుకుని అద్దంలో చూసుకుంటూ.
తెల్లచీర మీద గులాబీ రంగు దారాలతో కుట్టిన ఎంబ్రాయిడరీ చీరది. చీరంటే ప్రాణం సుశ్రితకి.
"
అది ... అంకుల్ ముంబాయ్ వెళ్ళినప్పుడు తెచ్చింది ...'' అంది.
"
అబ్బ! ఎంతలక్కు ఆంటీ, అంకుల్ ఊరెళ్ళినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తారా ...?''
"
అవును ... లేకపోతే నేను బాగా పోట్లాడతాను ... అందుకే ఎప్పుడూ మర్చిపోకుండా నాకోసం ఏదో ఒకటి తప్పనిసరిగా తెస్తారు ...'' అంది గర్వంగా.
"
అయితే నేను కూడా కంపల్సరీగా టూర్స్ వెళ్ళే వ్యక్తినే భర్తగా చేసుకుంటాను ...'' అంది శోభ నవ్వేస్తూ ...
"
పని చెయ్ ...'' అంది సుశ్రిత కూడా నవ్వుతూ వాళ్ళిద్దరికి  అప్పటికి తెలీదు అదో గొప్ప ట్రాజడీ అవుతుందని.
ఎయిర్ పోర్ట్ లో నుంచి రుత్విక్ బయటకు వచ్చేసరికి కారుతో డ్రైవర్ రెడీగా వున్నాడు.
టైం టెన్ థర్టీ పి.యం. ఆకాశం అంతా మబ్బుపట్టి ఉంది. రోజు పున్నమి అయినా మబ్బుల మాటున దాగివున్నాడు చంద్రుడు.
"
వర్షం వచ్చేలా ఉంది కదూ ...'' అంటూ కారులో కూర్చున్నాడు రుత్విక్.
గ్లాస్ ఓపెన్ చేసి వాతావరణాన్ని చూస్తున్నాడు. వాతావరణం ప్లజెంట్ గా వుంది. చల్లగాలి, వెన్నెల రాత్రి, చక్కని వాతావరణం అనుకోకుండానే అతని చేతులు టేప్ రికార్డర్ వైపు వెళ్ళాయి.
హాయిగా వుంది రుత్విక్ కి.
సుశ్రిత గుర్తొచ్చింది. అతని ఒంట్లో వెచ్చని ఆవిర్లు, గుండె చిత్రంగా కొట్టుకుంది. శరీరంలోని రక్తం సర్రున గుండె వరకు పాకినట్టనిపించింది.
తను వెళ్ళీ వెళ్ళగానే సుశ్రితను చుట్టుముట్టి రాత్రంతా జాగారం చేస్తూ వుండాలి మెత్తగా, ముద్దుగా, బొద్దుగా వుందే సుశ్రిత కౌగిట్లో రెండ్రోజుల విరహాన్ని మరచిపోవాలి ... అలా ఆలోచిస్తుంటే అతని శరీరంలో వేడి, రక్తకణాల్లోకి చేరిపోతోంది.
సరిగ్గా అప్పుడు ... అప్పుడు ... గుర్తుకొచ్చింది. మద్రాస్ నుండి వచ్చేప్పుడు సుశ్రితకు గిఫ్ట్ తీసుకురాలేదని ...
అసలే విషయంలో కాసింత పట్టుదలవున్న మనిషి పైగా అందమైన రాత్రిని, అలిగి, సాధించి వృధా చేస్తుంది. సుశ్రితకు ఒక్క వీక్నెస్ లేకపోతే ఎంత బావుండును? అనుకున్నాడు.
కర్తవ్యం గుర్తొచ్చి "డ్రైవర్ కారు ఆబిడ్స్ వైపుకు పోనివ్వు'' అన్నాడు.
పదినిముషాల్లో మీనాబజార్ షాపు ముందు ఉంది కారు. అప్పటికే షోరూము మూసేయబోతున్నారు. రుత్విక్ ని చూసి షోరూం ఓనర్ విష్ చేశాడు. పడి నిముషాల్లో పట్టుచీర సెలక్టు చేసి ప్యాక్ చేయించాడు.
వర్షం మొదలైంది అప్పటికే ...
అతను ప్యాకెట్ పదిలంగా పట్టుకుని .... "ఇలాగే పోనివ్వు'' చెప్పాడు రుత్విక్ ...
"
సార్ ... ఇది వన్ వే ...'' డ్రైవర్ చెప్పబోయే లోపు ...
"
నాకు తెలుసు ... ఇంత రాత్రివేళ ఏమవుతుంది! చుట్టూ తిరిగివెళ్తే గంట పడుతుంది. అయినా నువ్వు తప్పుకో నేను స్పీడ్ గా డ్రైవ్ చేస్తా ...'' అంటూ డ్రైవింగ్ సీట్ లోకి మారాడు రుత్విక్.
డ్రైవర్ ఏం చెప్పలేకపోయాడు. అలాగే వన్ వేలో రాంగ్ రూట్లో కారును పోనిచ్చాడు రుత్విక్.
చిన్న తప్పుకు ...
ఎదురుగా లారీ ... భూతంలా ... రాంగ్ రూట్ లో కారువస్తుందని వూహించని లారీడ్రైవర్ లారీని వేగంగా నడిపించి బ్రేక్ వేయలేక ... కారును గుద్దేశాడు.
ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో గ్లాస్ డోర్ లో నుంచి లోపలవున్న రుత్విక్ ని చూడగానే గుండెల్లో నుంచి దుఃఖం పొంగుకొచ్చింది సుశ్రితకు. డాక్టర్లు రుత్విక్ కండీషన్ సీరియస్ గా వుందని చెప్పారు. లోపలికి వెళ్ళనీయడం లేదు.
డ్రైవింగ్ సీట్లో రుత్విక్ వుండడం, స్టీరింగ్ కు సీటుకు మధ్య నలిగి పోవడం వల్ల రుత్విక్ కు అతనికి తీవ్రగాయాలయ్యాయి. డ్రైవర్ సేఫ్ గా ఉన్నాడు. తలకు కట్టు మాత్రమే వుంది.
"
సార్ మీకు గిఫ్ట్ తీసుకురావడం మరచిపోయారు. కారు వెనక్కి మళ్లించి షోరూం లో చీర తీసుకున్ ఆలస్యమవుతుందని, వన్ వేలో రాంగ్ రూట్ లో వెళ్దామన్నారు. నా మాట  వినకుండా తనే డ్రైవ్ చేసి ...'' ఇంకా ఆపై మాట్లాడలేకపోయాడు.
రుత్విక్ గ్లాస్ డోర్ లోంచి చూస్తున్న సుశ్రితను చూసి రామ్మన్నట్లు సైగచేశాడు. డాక్టర్ మాటల్ని కూడా లెక్కచేయక లోపలికి పరుగెత్తింది. ముక్కుకు ట్యూబ్స్ అమర్చారు. చేతులకు నీడిల్స్ గుచ్చారు. బ్లడ్ ఎక్కిస్తున్నారు. అతని గుండెల మీద గిఫ్ట్ ప్యాక్ రక్తంతో తడిచివుంది. దాన్ని కష్టం మీద తీసి సుశ్రితకు య్హివ్వబోయాడు.
ఆమె కదలిపోయింది ... ప్యాక్ మూలకు విసిరేసి భర్త గుండెల మీద వాలిపోయింది. గుండెలమీద వున్న రక్తం, ఆమె కన్నీళ్ళకు కరిగిపోయింది.
"
ఆయామ్ సారీ ... నన్ను క్షమించండి ... నాకున్న చిన్న వీక్నెస్ రోజు ఇలా ప్రాణాల మీదకు తెచ్చింది. అయినా మీరు ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా, నాకోసం తిరిగి రావడమే పెద్ద గిఫ్ట్ అని తెలుసుకోలేని మూర్ఖురలిని ...'' ఆపై మాట్లాడలేకపోయింది.
అతని గుండెలమీద సేద తీరింది. అతని తోడు లేకుండా తను వెళ్ళదు ... అని ఆమె నిర్ణయం తీసుకుంది.
ఆమె నుంచి అతన్ని వేరు చేయడం దేవుడికిష్టం లేదు ... అది దేవుడి నిర్ణయం కాబోలు అతని కళ్ళు మెరిసాయి కన్నీళ్ళతో ....

No comments:

Post a Comment