Saturday, January 5, 2013

Pakkintavida story

వెన్నెల పహారా కాసేవేల ... కిలికించితాలు చెలికించితాలై, కవ్వింతల సంతకాలై, కౌగిలింతల మంత్రాలై ఉద్వేగపు ఉచ్చ్వాసాలను, ఉద్రేకపు నిశ్వాసాలను ఆహ్వానిస్తూ, ఆదమరిచి నిద్రను నియంత్రించి, కోరికలు ఒళ్ళు విరుచుకుని, కాంక్షలు బంధనాలు తెంపుకుని ... తమకాలన్నీ తపనలతో కలిపి తారట్లాడేవేళ ... పదే పదే పక్కింటావిడ గుర్తొస్తే ....
వంటిల్లంతా సర్ది పడకింట్లోకి అడుగుపెట్టింది ఇందువదన. మంచానికి ఆనుకుని వున్న కిటికీ దగ్గర నిలబడి, కిటికీలో నుంచి పక్కింటివైపు చూస్తున్నాడు దినేష్. అతడికేమాత్రం డిస్టర్బెన్స్ కలగనంటగా, చీర కుచ్చెళ్లు కాస్త పైకి దోపుకుని, మెట్టెల శబ్దం కూడా కాకుండా అడుగులో నడిచిందామె భర్తవైపు.
దినేష్ మాత్రం తదేకంగా పక్కింటివైపు చూస్తున్నాడు. రోజే పక్కింట్లో జంట కొత్తగా అద్దెకు దిగింది. కొంగు బోడ్లోకి దోపుకుని, ట్రాలీలోనుంచి ఒక్కో సామాను అనడుకుంటూంటే కన్నార్పకుండా ఆమెవంక అలానే చూస్తుండిపోయాడు దినేష్. అందానికి నిర్వచనంలా వుంది. పాలమీద పేరుకున్న తెల్లదనమంతా ఆమె ఒంటిమీదకు వచ్చినట్టుంది.
ఆకాశంలోని నెలవంకను తీసుకుని వచ్చి ఆమె నడుం మీద పెట్టుకున్నట్టు ... నడుం మడత ... నక్షతాల తళుకు బెళుకులన్నీ ఆమె తెల్లని పలువరస మీదికి చేరినట్టు, నవ్వితే తళుక్కున మెరిసే పళ్ళు, ఆకాశానికి మబ్బుల చెమట పట్టినట్టు ఆమె మొహమ్మీద అలుముకున్న స్వేదం ...
కన్నార్పకుండా అలానే ఆమె అందాలను చూస్తుండిపోయినా అతనికింకా తనివి తీరలేదు. అతనికి అందమన్నా, అందమైన అమ్మాయిలన్నా బోలెడు ఇష్టం.
"
ఏమండీ ...!'' పిలిచింది ఇందువదన అతని చెవి దగ్గరికి తన పెదవులను చేర్చి. వెంటనే తన ఆలోచనలు, చూపులు ఆపి భార్యవైపు చూసి "నువ్వా ఇందూ ... ఎంతసేపైంది వచ్చి?'' అడిగాడు.
ఆమె చెప్పింది ... కానీ, అతను వినడం లేదు.
మధ్య మధ్యలో కిటికీలోనుంచి పక్కింటివైపు చూస్తూనే వున్నాడు.
"
ఏమండీ లైటార్పమంటారా? ఉంచమంటారా?'' అని దినేష్ ను అడిగింది ఇందువదన.
"
లైటార్పి పడుకో'' చెప్పాడు దినేష్.
ఇందువదన భర్త వంక ఓసారి చూసి, లైటార్పి బెడ్ లైట్ స్విచ్ వేసి వెళ్ళి మంచంమీద పడుకుంది.
పక్కింట్లో దిగిన జంటలోని భర్త బయటకు వెళ్ళిపోయాడు. అతని భార్య బయటకొచ్చి చల్లగాలిని ఆస్వాదిస్తోంది. నైతీలో ఆమె దేవకన్యలా కనిపించింది అతని కంటికి. ఒళ్ళు విరుచుకుంటూ ఆకాశంవంక చూస్తోంది. ఆమె అప్రయత్నంగా చుట్టూ ఎవరూ లేరని ధైర్యంతో కాబోలు రెండు చేతులూ పైకెత్తి ఒళ్ళు విరుచుకుంటోంది.
దినేష్ రెప్పవేయటం మరచిపోయాడు. అతనిలో చిన్న ప్రకంపనం ... సరిగ్గా అప్పుడే ఆవిడ తనవేపు చూడటంతో చూపులు తిప్పెసుకున్నాడు. ఈలోగా ఆవిడ భర్త వచ్చాడు. భార్య నడుం చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకువెళ్ళాడు. అతగాడిమీద జెలసీ కలిగించి.
మంచం దగ్గరికి వచ్చాడు. భార్య రెండుచేతులూ తలకింద దిండులా పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకుంది. ఒక్క క్షణం చిన్న గిల్టీ ఫీలింగ్. ఇందువదన చామనఛాయ ... మరీ పొడవు ... పొట్టి కాని ఎత్తు. అయితేనేం మోహంలో కల ... మనసులో నిష్కల్మషం ... గుండెల నిండా ప్రేమ.
కేవలం తల్లితండ్రుల బలవంతం మీదే ఇందువదనను పెళ్ళి చేసుకున్నా, ఇందువదన ప్రేమలో లోపమూ లేదు. ఉన్నదంతా తన ఆలోచనల్లోనే. దినేష్ కు అందమంటే ప్రాణం ... ఇష్టం ... అందంగా వున్నవాళ్ళంటే పడిచస్తాడు ... దినేష్ మంచి అందగాడు. మిస్ యూనివత్స కొలతలు వున్న అమ్మాయే తనకు భార్యగా రావాలని అతను కోరుకునేవాడు.
సన్నటి నడుము ... మెరుపు తీగలాంటి శరీర సౌష్టవం ... అసలు అతని ఊహల్లోని అమ్మయిలే వేరు. అతని ఇష్టంతో ప్రమేయం లేకుండా, అతని తల్లిదండ్రులు ఇందువదనతో వివాహం నిశ్చయించేశారు. ఇందువదన్ బొద్దుగా వుంటుంది ... ముద్దబంతిలా వుంటుంది.
పెళ్ళయిన తరువాత కొన్నాళ్ళు తనో అందగత్తె అయిన భార్యను మిస్సయ్యాననే ఫీలింగ్ వెంటాడుతూ వున్నా ఇందువదన ప్రేమతో అవన్నీ మరచిపోయాడు దినేష్. కానీ అప్పుడప్పుడు ఇలా పక్కింటావిడ అందాలను చూసినప్పుడు ఫీలవుతూ వుంటాడు.
చల్లగాలి రివ్వున వీచి, కిటికీలోంచి గదిలోకోస్తోంది. చిన్న వణుకులాంటిది వచ్చింది. లేచి వెళ్ళి కిటికీ తలుపులు మూస్తూ ఓసారి పక్కింటి వైపు చూశాడు. పక్కింటి కిటికీ తలుపులు తెరిచే వున్నాయి. అవి పడగ్గది కిటికీ తలుపు ... మొగుడూ, పెళ్ళాలిద్దరూ ఒకరినొకరు హత్తుకుంటున్నారు. బహుశా ఇంత రాత్రివేళ ఎవరూ తమ పడగ్గదిలోకి తొంగి చూడరని కాబోలు.
కిటికీలు మూసోచ్చినా అతనికి దృశ్యమే కనబడుతోంది. ప్రకృతి సిద్ధమైన కోరిక శరీరాన్ని వెచ్చబరుస్తూ వుంది. కుడివేపుకు తిరిగి వున్న భార్యను తనవేపుకు తిప్పుకున్నాడు. భార్య పొట్టమీద చేయి వేశాడు. మెల్లిగా తలను కిందకి వంచి ఆమె పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు.
ఇందువదన కళ్ళు తెరిచింది ... ఎదురుగా భర్త కళ్ళల్లో కనిపిస్తున్న కాంక్ష తాలూకు తీవ్రత గమనించింది. భర్త మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుంది ... భర్త మొఖాన్ని గుండెల మధ్య పెట్టుకుంది. రెండు చేతులను భర్త నడుంచుట్టూ చుట్టేసింది.
ఎత్తయిన ఆమె రెండు గుండెల మధ్య సేదతీరుతూ తన పెదవులను కిందకి జరుపుతూ ఆమె చీర కుచ్చిళ్ళను కిందకి జరిపాడు. ఆమె నాభి మీద పెదవులాన్చాడు. ఆమె శరీరంలో నుంచి విద్యుత్ తన శరీరంలోకి ప్రవహిస్తున్న ఫీలింగ్.
ఇందువదన కళ్ళు అరమోడ్పులయ్యాయి. అతని చేతివేళ్ళు ఆమె చీర కుచ్చెళ్లను తప్పిస్తున్నాయి. ఆమె అభ్యంతర పెట్టలేదు. అతనికోసం అభ్యంగనమవుతోంది. కోరిక తాలూకు ఉధృతి, చలి తాలూకు రియాక్షన్ అతని చేతల్లో, చేతుల్లో కనిపించాయి.
ఆమె శరీరం నుంచి ఒక్కో ఆచ్చాదన నేలమీద పడుతోంది. చివరి ఆచ్చాదన సైతం ఆమెనుంచి విడివడింది. బెడ్ లైట్ వెలుతురులో భార్య నగ్న శరీరం వంక చూస్తున్నాడు. వింత కాంతితో ఆమె శరీరం మెరిసిపోతోంది. తనని మనసారా, తనువారా ఆహ్వానిస్తోన్నట్టు వుంది.
భార్యలో అతనికి నచ్చే విషయం అదే ... ఎంతో ప్రేమగా, గొప్పగా చూసుకునే భార్య అణుకువ వుండే భార్య పడగ్గదిలో సిగ్గువాళ్ళో, తెలియనితనంవల్లో పూర్తిగా భర్తలను సంతృప్తిపరచలేకపోతారు చాలామంది. ఏదో చీకటి కార్యం అన్నట్టు ....
జస్ట్ ఫర్ సెకన్స్ రిలాక్సేషన్ అన్నట్టు ఫీలయి కళ్ళు మూసుకుండిపోతారు. కానీ ఇందువదన తనలో అణువణువూ ప్రోది చేసి, మనసు పెట్టి ... శరీరాన్ని మొత్తంగా సిద్ధం చేసి తనముందు పరుస్తుంది. ఎప్పుడంటే అప్పుడు ... ఎక్కడంటే అక్కడ ... ఎలా అంటే అలా ... ఒక్కసారిగా అతనికి భార్యమీద ప్రేమ రెట్టింపైంది.
పెళ్ళయిన రోజునుంచీ రోజు వరకు అతనికి ప్రతీ సంఘటన అనుభావకవేద్యమే. పెళ్ళయిన మూడోరోజే ఆమెను ఆమెను తనతో కలిసి స్నానం చేయమన్నాడు. కథల్లో, సినిమాల్లో తప్ప వీలు కాని విషయం ... కానీ తన ఆలోచనలు తుత్తనీయలు చేసింది. తనతో కలిసి స్నానం చేసింది.
పట్టపగలు ... అర్థరాత్రి అన్న నియమం లేదు. తనకు ఎప్పుడు మూడ్ వచ్చినా సహకరిస్తూనే వుంది ... వుంటుంది.
ఆమె శరీరం మీద అతని చేతులు వేగవంతం అయ్యాయి. ఆమె వివశత్వాన్ని ఆశ్రయిస్తోంది. అతను శృంగారోద్వేగాన్ని అనుభూతిస్తున్నాడు. అంత చలిలో కూడా అతని శరీరం నుంచి చెమట ధారాపాతంగా కారుతోంది. ఆమె పెదవులపైకి జారుతోంది. ఆమె తన రెండు చేతులతో అతని చెమటను తుడుస్తోంది. ఒక్క చిన్న కన్సర్న్ ఫీలింగ్ చాలు ... చెమటతో నిండిన అతని మొహాన్ని తన పెదవులతో అద్దింది. ఒక్క ప్రేమ పూర్వకమయిన స్పర్శ చాలు.
    `            *****
తెల్లవారుఝామున భార్య ఒడిలో తల పెట్టి పడుకున్నాడు దినేష్. "ఇందూ ... మన పక్కింటావిడ బావుంది కదూ ...'' అన్నాడు భార్య కళ్ళల్లోకి చూస్తూ.
"
అవును ... నాకన్నా ... చాలా బావుంది''
భార్య మొహంలోకి చూశాడు. ఆమె మోహంలో కోపంగానీ, అసూయకానీ, ఉక్రోషం కానీ లేవు.
"
అసలు నీకు నా మీద కోపం కలగదా ... భర్త పరాయి స్త్రీ వంక యథాలాపంగా చూసినా ఏదో చేసినంతగా సీన్ సృష్టించే భార్యలను చూశాను కానీ ... నీలా ...''
"
ప్రపంచంలో నా బలం ... నా బలహీనత మీరు ... మీ ఇష్టం ... మీ కోరికను ... మీకు ఆనందాన్ని ఇచ్చే విషయాన్ని నేనెందుకు కాదనాలి? అందం అంటే మీకు ఇష్టం ... అందాన్ని మీరు ఆస్వాదించాలని అనుకున్నా ... అదీ నాకిష్టమే ... నేను మిమ్మల్ని ప్రేమించేది ... తిరిగి మీ నుంచి ప్రేమను పొందేందుకు కాదు ... పరస్పర సహకారం కోసం నేను మీకు ప్రేమను అందించటం లేదు''
భార్య వంక చూశాడు ... చాలా సాదాగా కనిపించే భార్యలో గొప్ప వ్యక్తిత్వం అతనికి కనిపిస్తూ వుంటుంది. తన ఆఫీసులో పనిచేసే అమ్మాయిల గురించి చేపినా ఇదే రియాక్షన్. "అంటే ... నేను అడిగితె నన్ను గంపలో కూర్చోబెట్టుకుని సతీ సుమతిలా మరో అమ్మాయి దగ్గరికి కూడా తీసుకువెళ్తావా?'' అడిగాడు.
"
గంపలో కాదు ... కారులో తీసుకువెళ్తాను.''
ఆమె ముఖంలో అదే ఎక్స్ ప్రెషన్ ... ఒక్క క్షణం తన తలను ఆమె నడుం ఓంపులో పెట్టి మౌనంగా వుండిపోయాడు. ఆమె శరీర స్పర్శ అతనిలోని కోరికను మళ్ళీ రాజేస్తున్నాయి.
వారం రోజుల తరువాత రోజు చాలా హుషారుగా ఇంటికి వచ్చాడు దినేష్.
"
ఇందూ ...! నీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా ... పక్కింటావిడ నాతో మాట్లాడింది. పైగా నాతో కాఫీ షాప్ కు వచ్చింది. టూ మోడ్రన్ .. షేక్ హ్యాండ్ ఇచ్చింది. చేతివేళ్ళు పొడవుగా సన్నగా వున్నాయి. చేయి మెత్తగా వుంది. మంచి పెర్ఫ్యూమ్ ... బహుశా పాయిజన్ వాడి వుంటుంది''
"
వెరీ ఇంట్రెస్టింగ్ ... తర్వాత ...'' అడిగింది ఇందువదన.
"
రేపు వాళ్ళాయన లేటుగా వస్తాడట ... నైట్ ఫుడ్ కార్నర్ లో డిన్నర్ తీసుకుందామంది''
వెరీ గుడ్ ... అయితే రేపు డిన్నర్ ఫుడ్ కార్నర్ లో అన్నమాట'' అంది ఇందువదన సంతోషంగా.
"
ఎస్సెస్ ... కానీ ...''
"
కానీ ...!'' ప్రశ్నార్థకంగా చూసిందతనివైపు.
"
నువ్వు'' అంటూ ఇబ్బందిగా చూశాడు.
"
ఓహ్ నేనా ... వచ్చేటప్పుడు నాకు పార్శిల్ తీసుకురండి ... లేకుంటే ఉప్మా చేసుకుంటాను''
"
నిన్ను .... నిన్నెలా అర్థం చేసుకోను ...'' అతని గుండెకు గిల్టీ ఫీలింగ్ అడ్డం పడింది.
నెక్ట్స్ డే ఆఫీసు నుంచి వచ్చి బాత్రూమ్ లో దూరాడు. అరగంటసేపు డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడ్డాడు. బ్లాక్ జీన్స్ మీద అదే కలర్ రౌండ్ నెక్ టీషర్టు వేశాడు.
"
బ్లూ జీన్స్ మీదకి వైట్ రౌద్ నెట్ టీషర్ట్ చాలా బాగుంటుంది'' సజెస్ట్ చేసింది ఇందువదన. అయిదు నిముషాలలో డ్రెస్ అతని ఒంటిమీదకు చేరింది. హుషారుగా ఈల వేసుకుంటూ బయటకు నడిచాడు ... బైక్ ఫుడ్ కార్నర్ వైపు వెళ్తోంది.
                *****
అప్పుడు సమయం రాత్రి ఏడు గంటలు ....
టెన్ పి.ఎం. దినేష్ మూడాఫ్ అయ్యాడు. వెళ్ళినప్పటి ఉత్సాహం లేదు. అందమైన పక్కింటావిడతో డిన్నర్ అతనికి చేదుగా అనిపించింది. దానిక్కారణం డిన్నర్ టైంలో 'నాకోసం ఎట్ లీస్ట్ ..  ఫస్ట్ టైం కలుస్తున్నామని డిమాండ్ రింగ్ కూడా తేలేదా?' అని అడిగినందుక్కూడా కాదు.
మనం తరచూ కలుసుకోవటానికి నాకో కైనెటిక్ హోండా కొనిపెత్తరూ అనడిగినందుకు కూడా కాదు 'మీ ఆవిడ బ్లాక్ అండ్ వైట్ కదా' అని నవ్వినందుకు ....
తనకోసం అన్నీ అమర్చి, తనే ప్రపంచంగా బతికే ఆమెను కామెంట్ చేయటానికి తనే అవకాశం ఇచ్చాడు.
మొదటి పరిచయంతోనే డబ్బుతో సంబంధాన్ని కంటిన్యూ చేయోచ్చనే అందమైన పక్కింటావిడ మెంటాలిటీ అతనికి చేదుగా తగులుతోంది.
నలభై ఎనిమిది గంటల్లో ఇల్లు మారాడు. కొట్టింట్లో మారిన కొత్త మనస్సుతో రాత్రి పడగ్గదిలో భార్యముండు మోకరిల్లి "ఇందూ ...! ఇప్పుడు నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా ... ధవళ వర్ణంతో మెరిసే మేలి ముత్యాలను ముద్దగా చేసి ... దాన్ని నీ మనసుగా చేసిన దేవుడు, నీ శరీరానికి మెరిసే రంగును ఇవ్వలేదన్న బాధ లేదు. అంతరంగపు ఆంతర్యాన్ని దర్శిస్తున్నాను. నీ నవ్వులో ఆహ్వానం ... నీ మనస్సులో అవాజ్యమైన అనురాగం ... నీ శరీరంలో కోరిక తాలూకు ఉధృతి ... నీ స్పందనలో కలయిక తాలూకు కాంక్ష ... ఇవి చాలు ... నేను నీ శరణాగతుడ్ని ... కాదు ... కాదు ... చరణాగతుడ్ని'' ఆమె పాదాలమీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు.
ఇప్పుడు కొత్తగా మారిన ఇంటి పక్కింటావిడ నల్లగా, అందహీనంగా వుంటోంది. ఆమె మనసు ఎలాంటిదైనా సరే ... ముందు పక్కింటావిడకన్నా తన భార్య బావుంటుందన్న ఫీలింగ్ అతనికి కలగాలి. అందుకే పక్కింటావిడను అలా సెలక్ట్ చేసుకుని అద్దెకు దిగాడు. మనో సౌదర్యాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడిప్పుడు.

No comments:

Post a Comment