Thursday, January 3, 2013

Rajyakakshmi katha


రాజ్యలక్ష్మమ్మకు కొడుకు రామం గురించి బెంగ పట్టుకుంది. అంతకంటే పక్కింటి పార్వతమ్మ గురించి బెంగపట్టుకుందంటే సబబుగా ఉంటుందేమో.
పార్వతమ్మ స్వతహాగా మంచిదే. ఉపకారి కూడాను. మొగుడు బట్టల వ్యాపారంలో తరుచుగా టూర్లు వేడుతుంటాడు. కొడుకూ, కూతురు, ఆడపడుచూ ఊళ్ళో చదువుకుంటున్నారు. ఏదైనా బయటపని చేసేపెట్టాలంటే తను రామాన్ని పంపిస్తుంటుంది కూడా.
పార్వతమ్మ అందుకు తగ్గట్టుగా కాఫీపొడి, పంచదార, అప్పుడప్పుడు బియ్యం ఏది అరువు కావాలన్నా ఇస్తుంది. మళ్ళీ తిరిగి ఎప్పుడిచ్చినా ఏమీ అనదు. ఒక్కోప్పుడు తను చేబడుల్లు కూడా తీసుకోవలసి వస్తుంది మొగుడి నిర్వాకంవల్ల.
ఈయన బస్సు డ్రైవరు. జీతం ఎంత వస్తుందో, తాగుడికి ఎంత పోతుందో, అది కూడా ఇంట్లో ఎప్పుడు ఇస్తాడో బ్రహ్మదేవుడిక్కూడా తెలియదు. రూటు మీదకు వెడితే ఒక్కోసారి రెండు, మూడు రోజులకి గానీ రాదు. సంసారం గడుపుకు రావడం ఎలా మరి? పక్కన పార్వతమ్మలాంటి  వాళ్ళు లేకపోతే?
అదృష్టవశాత్తు కొడుకు బుద్ధిమంతుడు. తండ్రి లక్షణాలు రాకుండా ఫస్టుగా చదువుకుంటూ ఇంటర్లోకి వచ్చాడు. పెద్దయ్యాక వాడే మమ్మల్నిద్దర్నీ చూడాలి.
పార్వతమ్మ సరదా మనిషి. ఆవిడ మొగుడు ఊళ్ళో ఉంటూంటాడు. కాబట్టి తామిద్దరూ కూర్చుని మధ్యాహ్నమనక, రాత్రనక కబుర్లు చెప్పుకుంటుంటారు. మంచి కాలక్షేపం. వాళ్ళాయనకు ప్రయాణాలు ఎక్కువ కాబట్టి బోరు కొట్టకుండా అదోరకం పుస్తకాలు, పత్రికలూ కొంటుంటాడు. ఈవిడ అవన్నీ అక్షరం పొల్లుపోకుండా చదివేసి, పూసగుచ్చినట్టు తనకు చెప్తూ ఉంటుంది. రకరకాల జోకులు గుర్తుంచుకుని సమయం చూసి పేలుస్తూ ఉంటుంది.
అంతవరకూ బాగానే ఉంది. కానీ ఆవిడకు ఇంగితం తక్కువ. తామిద్దరూ ఇలాంటి కబుర్లలో ఉండగా, రామం అటువైపు వచ్చినా మాట్లాడడం ఆపదావిడ. తను సంభాషణ మరల్చబోయినా పట్టించుకోడు. చివరకు 'నడవరా ... నీతో పనుంది అంటూ రామాన్ని తనే అక్కణ్ణుంచి తీసుకుపోవాల్సి వచ్చీది. లేకపోతే వాణ్ని కూర్చోబెట్టి మిగతా కథ చెప్పేసేంతటి తింగరి ఆవిడ.
కానీ తను భయపడినంతా జరిగినట్లుంది. రామం తన ఫ్రెండుకి మధ్య జోకు చెప్తూ చెప్తూ తను రాగానే ఆపేశాడు. తనకు వినబదినంతవరకూ అది పార్వతమ్మ తనకు చెప్పిన జోకులా అనిపించింది. కొంపదీసి ఆవిడ పుస్తకాలు వీడు చదవడం లేదు కదా! పని ఉందంటూ ఆవిడ రోజు పదిసార్లు వేడిని పిలిపించుకుంటూ ఉంటుంది. పుస్తకాలు జాగ్రత్తగా దాచుకోదేమో! వీడవి చూసి ఉంటాడా?
ఇంకా కాస్త ఆలోచిస్తే ... ఒకవేళ కొంపదీసి ఆవిడే వీడికా జోకు చెప్పేసిందా? అబ్బే అంత తెలివితక్కువగా చేస్తుందా? నా ఈడుది, సరేలే, నాకంటే రెండేళ్ళు తక్కువ వేననుకో ... వీడడు కొడుకులాంటి వాడు.
వాడ్ని కొడుకులాగే చూస్తోందా అని? ఒక్కోప్పుడు హద్దూ పద్దూ లేకుండా మాట్లాడుతుంది.
"
రాముడి పేరు పెట్టుకుంటే ఏం లాభమయ్యా? జీవితమంతా కష్టాలే. ఒక్కటే పెళ్ళాం కూడానూ, హాయిగా కృష్ణుడి పేరు పెట్టుకో. పదహారు వేలమంది పెళ్ళాలు. ఏం చేసుకోవాలో తెలీనంత మంది'' అందోసారి తన ఎదురుగానే.
వీడు అపుడు 'ఛీ ... ఛీ ...' అన్నాడుగానీ ఇంకో పదిహేను రోజులు పోయాకనుకుంటా!
"
ఎన్టీరామారావు పేరు పెట్టుకుని ఇలా డళ్ గా ఉంటే ఎలానయ్యా? రామారావుని చూడు ముసలితనంలో రెండో పెళ్ళాన్ని కట్టుకుని ఎంత శృంగారం సాగిస్తున్నాడో'' అన్నప్పుడు 'ఏంటి ఆంటీ మీరు మరీను'' అంటూ వంకర్లు పోయాడు.
కాసేపయ్యాక మధ్యగడిలోకి వస్తే మాటలు వినిపిస్తున్నాయి. "అసలు నేనే అటకెక్కుదునోయ ... ఒళ్ళు బరువైపోయింది. ఇదివరకు నేనింతలా ఉండేదాన్ని కాదు తెలుసా?''
"
నిజంగానా ఆంటీ?'' రామం అడిగాడు. నిజం కాకపోయినా వీడెం చేస్తాడు?
"
నమ్మకం కలగడం లేదా? నా పాత ఫోటో తెస్తాను చూడు ... ఇదిగో చూశావా? బీచ్ మీద పడుకుని తీయించుకున్న ఫోటో. ఒళ్ళంతా బాగా తెలుస్తోంది కదూ! నీళ్ళకి చీర తడిసిపోయిందే ... ఫోటో దగ్గర పెట్టుకుని పోల్చి చూడు ... బాగా ఒళ్ళోచ్చింది కదూ?''
"
అవును ఆంటీ, బాగా లావయ్యారు''
"
అలా జనరల్ గా అనేస్తే ఎలా? ఒక్కొక్కటీ చూడు ... చేతులు చూడు ఎలా వున్నాయో. అప్పటికీ, ఇప్పటికీ పిక్కలు చూశావా? నడుం దగ్గర వంపులు పెరిగాయి కదూ ... వంపుల్లో కూడా అందం వుందనుకో. కానీ తమాషా చూశావా? ఇంత కంద చేరినా ఒళ్ళు గట్టిగానే ఉంది. రా పట్టుకుని చూడు ... నేనేం అనుకోనులే''
"
వద్దులేండి ... ఎవరైనా చూస్తే బాగోదు''
"
రావోయ్ మగడా, ఎవరూ ...''
"
రామం'' గట్టిగా అరిచింది తను. ఇల్లు దద్దరిల్లేలా. రామం పిల్లిలా ఇంట్లోకి వచ్చాడు. తానేమీ అడగలేదు. మాట్లాడకుండా భోంచేసి పడుకున్నాడు. తనకు నిద్రపట్టలేదు ఆలోచనలతో.
వీడి వరస బాలేదని ఈయనతో చెప్దామా అంటే మొరటు మనిషి కోపం వస్తే గొడ్డుని బాదినట్లు బాదేస్తారు తప్ప సామరస్యంగా సాధించుకురాలేరు. తనతో అయినా సరసం లేదు, శృంగారం లేదు. మనిషి చూస్తేనే మోటుగా, బీడీ కంపు, సారా కంపూ కొడుతూ ఉంటారు. కోపం రానంతవరకూ సౌమ్యంగానే ఉంటారు.
డ్యూటీ నుంచి రావడం, పడుకొని నిద్రపోవడం, తన దగ్గరికి కూడా పెద్దగా రారు. రూటులో వెళ్ళినప్పుడు ఏవైనా వేశాలేస్తారేమో, ఒక్కోప్పుడు జేబుల్లో ఏవేవో దొరుకుతుంటాయి. వాళ్ళంతా చవకబారు మనుషులు అయి వుంటారు. డబ్బుకోసం వస్తారేమో ... లేకపోతే ఈయన మాటలతో మెప్పించి వలపించుకోవడం కూడాను ... రాత!
అయినా పార్వతమ్మకు బుద్ధి ఉండాలి. ముందూ, వెనకా దిళ్ళలా ఇంతంత వేసుకుని తిరగ్గానే సరిపోయిందా? జబ్బలు, తొడలు అంత లావేమిటి బాబూ. సరిగ్గా చూస్తే పొట్ట కూడా కనబడుతుంది. అయినా మగాన్నైనా పొట్ట పరీక్షగా చూడనిస్తుందా? ఆరంగుళాల పైనే చూపులు ఇరికించేసేట్లు లోనెక్ జాకెట్లు, అది కనబడదేమోనని అస్తమానూ పైట సర్దుకోవడం ముఖం మాత్రం బాగానే ఉంటుందిలే చిలిపి కళ్ళూ అదీనూ.
కుర్రాడు రామాన్ని అని ఏం ప్రయోజనం ఈయనే వెకిలి చూపులు చూస్తారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల పలకరించరుగానీ లేకపోతే ఆవిడతో పని కల్పించుకుని మాట్లాడుతూ ఎక్కడెక్కడో పట్టి పట్టి చూడకుండా వదిలిపెట్టేశారా?
సంసారంలో వర్రీల వల్ల తనకు కళ్ళజోడు వచ్చేసి వెంట్రుకలు తెల్లబడిపోయి, ముఖాన ముడతలు వచ్చి ముసలమ్మా రూపం వచ్చేసింది. తనలాగా దిక్కుమాలిన మొగుడు దొరికి ఉంటే తెలిసేది పార్వతమ్మ సొగసు ఏపాటిదో? పిల్లలిద్దర్నీ ఆడపడుచు నెత్తిన పడేసింది. చదువులు అక్కడ బావుంటాయని చెప్పి. అదిలించడానికి మోదుగు ఊళ్ళో ఉండేది తక్కువ. టింగు రంగా మంటూ వెధవ పుస్తకాలు చదవడం, సిగ్గులేకుండా అవన్నీ తనకి అప్పచెప్పడం.
తను కూడా కబుర్లు తగ్గించి దూరంగా పెట్టకపోతే లాభం లేదు. అప్పుడే కుర్రాణ్ణి కట్టడి చేయవచ్చు.
మధ్యాహ్నం కబుర్లు మానేయడంతో నిద్రపోవడం అలవాటైంది. ఆరోజు మధ్యాహ్నం అనుకోకుండా మెలకువ వస్తే పక్కిన్ట్లోన్చి మాటలు వినబడుతున్నాయి.
" ...
లక్ష్మీ టాకీసులో సినిమా చూసావటోయ్! పిటపిటలాడే గుంటలు ఇద్దర్ని పెళ్ళాడేశాడు హీరో చివర్లో. నువ్వూ పెద్దయ్యాక అలాగే చెయ్యి మంచంలో ఎడాపెడా వేసుకుని పడుకుంటే చలిబాధే తెలియదు''
"
ఇద్దర్ని పెళ్ళాడితే జైల్లో పెడతారండీ!''
"
అబ్బో అన్నీ తెలుసుకునే వున్నావే! జైల్లో పెట్టరంటే ఇద్దర్ని లాగించేద్దువన్న మాట! దేవాంతకుడివి! ఇద్దరి పెట్టున్న నాలాంటి పెర్సనాలిటీ దాన్ని చేసుకో. వాటేసుకుని పడుకొంటే వెచ్చగానూ వుంటుంది. జైలు భయమూ వుండదు. ఎలా ఉంది అయిడియా?''
"
ఆలోచించి చూడాల్సిన అయిడియానేనండీ'' కొడుకు గొంతులో అంత కొంటెతనం ఉందా?
"
ఆలోచించి చూస్తే ఇవన్నీ తెలుస్తాయా? నీ వెర్రిగానీ శాంపుల్ చూసి తీసుకోవాలి''
"
భలేవారే! ఇవన్నీ ఎవరు శాంపుల్ చూపిస్తారు?''
"
అంటే సలహా చెప్పిన పాపానికి నన్నే చూపమనా నీ భావం? ఏమో అనుకున్నాను తెలివైనవాడివే''
అడుగులు కదిలిన చప్పుడు.
"
నీ అమాయకత్వం చూస్తే ముద్దొస్తుందయ్యా ... అయినా ముద్దు పెట్టనులే బెదిరిపోతావు'' అంటోంది పార్వతమ్మ.
"
రామం! రామం! ఇలారా ...'' అంటూ తను పిలిచింది.
ఆలోచించిన కొద్దీ భయం వేస్తోంది. పార్వతమ్మ అభిప్రాయం తెలుస్తూనే ఉంది. తెగ తిని, ఒళ్ళు బలిసి వుంది. ఒంట్లోని వేడంతా వీడి ద్వారా తీర్చుకుందామని చూస్తోంది. మొగుడిలా నీరసప్రాణి కాదు. కుర్రాడు ఎన్నిసార్లకైనా సిద్ధమవుతాడు. చిన్న కుర్రాడు కాబట్టి చుట్టుపక్కలవాళ్ళకి సందేహం రాదు. తిమ్మిరి తగ్గాక రామాన్ని పురుగులా విదిలించి పారేస్తుంది. కుర్రాడి భవిష్యత్తు గురించి దానికేం పట్టింది?
చదువుకునే వయస్సులో యావ పడితే వీడు ఏం బాగుపడతాడు. ఆహోరాత్రులూ అదే ధ్యాసపెట్టుకుని చదువు చెట్టెక్కిస్తాడు. వాళ్ళ నాన్నలాగే బస్సు డ్రైవరో, లారీ క్లీనరో అవుతాడు. మాకు తిండి పెట్టకపోతే మానే, వాడి పొట్టకే లేకుండా అవుతాడు. ఒక్కగానొక్క బిడ్డ. వాడిని ఎలాగైనా కాపాడుకోవాలి. పార్వతమ్మవల్ల పొందే లాభం గురించి తను ఇన్నాళ్ళూ వెనకాడింది. ఇక లాభం లేదు. పార్వతమ్మతో పోట్లాడి లాభం లేదు, గెలవలేం. ఆవిడ దగ్గర అందరూ అరువులు పెడతారు. ఇల్లు ఎలాగైనా మారాలి. ఈలోపున రామాన్ని వాళ్ళింటికి వెళ్లొద్దంటే సరి.
కానీ ఈయన్ని ఒప్పించేదెలా? ఆయన్ని చెప్పుతూనే కష్టం సుఖం చెప్పుకుంటూనే పార్వతమ్మ మంచితనం గురించి అనేకసార్లు చెప్పింది తను. ఇప్పుడు మరోలా చేస్తే? ఇల్లు మారదామంటే ఎందుకంటాడు. అప్పటికీ ఒకటి, రెండుసార్లు అని చూసింది. 'ఇంత చవగ్గా ఇల్లు ఎవడిస్తాడు? ఎండకు మారడం?' అన్నారు.
                                                                       *****
నారాయణకు భార్య చెప్పింది విని ఆశ్చర్యమేసింది. పార్వతమ్మ తన గురించి అంత ఆరాలు తీయడం ఎందుకు? రాజ్యలక్ష్మి అప్పుడప్పుడూ చెబుతూ ఉండేది. ఆవిడ అడపాదడపా సాయం చేస్తుంటుందని. అదంతా తనని మంచి చేసుకోవడానికేమో? మొద్దుని గ్రహించుకోలేకపోయాను. ఏది, డ్యూటీ, ఇల్లు, నిద్ర, డ్యూటీ ఎవరైనా మనకేసి చూస్తున్నారో లేదో పట్టించుకోవడం ఎక్కడ?
ఆవిడ తనలో ఏం చూసిందో? ఇదీ లేకుండా మీ ఆయన డ్యూటీ నుంచి ఎప్పుడొస్తారు? ఏం తింటారు? అంత బలంగా ఉంటారే' అని అలాటివన్నీ అడుగుతుందా? వాళ్ళాయన పీలగా ఉంటాడు. తనలో మగతనం చూసి ఉంటుంది. చూడ్డానికి మోటుగా, మొరటుగా ఉంటేనేం? అయినా అటువంటి మగవాళ్ళు నచ్చే ఆడవాళ్ళు ఉంటారుగా. కాలం హీరోలందర్నీ మొరటుగానే చూపిస్తున్నారుగా!
పార్వతమ్మ ఒళ్ళు చూస్తే పట్టుకు నలిపేయాలనిపిస్తుంది ఎవడికైనా. నలిగిపోవాలని ఆవిడకీ ఉంటుందిగా. మరి ఆవిడకి తగ్గవాడు తనే. మనం చెయ్యేస్తే కెవ్వుమనాల్సిందే. ఒక్క పెగ్గు కొట్టి వెళ్ళామంటే వారం రోజులదాకా తేరుకోలేదు.
                                                                         *****
రాజ్యలక్ష్మి చెప్పింతర్వాత పార్వతమ్మ కనబడినప్పుడు నారాయణ పలకరింపుగా నవ్వేడు. ఇంతకుముందు ఎప్పుడూ అలా నవ్వని కారణంగా కాబోలు ముందు తెల్లబోయినా, తేరుకుని ఆవిడా నవ్వింది. తర్వాత నుంచీ నారాయణ బాత్ రూమ్ లో కాకుండా నూతి దగ్గర స్నానం చేసేవాడు. పార్వతమ్మ వాటాకెదురుగా కాండలకు సబ్బు పట్టించి, తీరిగ్గా రుద్దుకుంటూ నీళ్ళోసుకొనేవాడు. పార్వతమ్మకు అతని వరస చూస్తే నవ్వు వచ్చేది. ఆమె ముసిముసి నవ్వులు చూసి నారాయణ వెర్రెక్కిపోయేవాడు.
ఒకరోజు ఎవరూ లేకుండా చూసి "మీ ఇంట్లో కథల పుస్తకం ఉంటే ఇవ్వండి'' అని అడిగేశాడు.
ఆవిడ ఆశ్చర్యపడి ఇంట్లోంచి పుస్తకం పట్టుకొచ్చింది. మ్యాగజైన్లో రెండు శృంగార కథలుండడంతో నారాయణకు రూఢీ అయిపొయింది. ఆవిడ తన కోసమే అలాంటి పుస్తకం వెతికి ఇచ్చిందని, విధంగా తన భావాన్ని చెప్పిందనీ.
రోజు రాజ్యలక్ష్మి నారాయణ చేతిలో పుస్తకం పెట్టి "మీరు అడిగారటగా పక్కింటావిడ ఇచ్చింది'' అంటూ. నారాయణ ఆశ్చర్యపడ్డాడు. నేనడగడమేమిటి? అనుకుంటూ పుస్తకం తిరగేసి బోర్లేసి చూశాడు. చిన్న చీటీ కిందపడింది. 'రాత్రి ఎనిమిదిగంటలకు మా ఇంటికి రా. కరెంటు తీసేసి ఉంచుతాను' అని ఉంది.
పార్వతమ్మ తెలివైనదే. రాజ్యలక్ష్మి ద్వారా సందేశం పంపించింది. ఆవిడ పుస్తకాలు తెరిచి కూడ చూడడాని తెలుసు కాబోలు! ఇక ఇవాళ రాత్రి పండుగే రాజ్యలక్ష్మిని, రామాన్ని బయటకు పంపిస్తే సరి! గుడో, మరేదో చెప్పి' అనుకున్నాడు నారాయణ.
రాత్రి ఎనిమిది గంటలకు నారాయణ పార్వతమ్మ ఇంటి దొడ్డి వుమ్మాన్ని తోశాడు. తీసే ఉంది ... ఇల్లంతా చీకటి, మల్లెపూల వాసన గుప్పుమంది. 'రా! నేనిక్కడ ఉన్నాను' అని పార్వతమ్మ గొంతు వినబడింది. వెళ్ళి ఎముకలు విరిగేలా గట్టిగా కౌగిలించుకున్నాడు.
కెవ్వున కేకవేయబోయింది. 'మనదెబ్బ అలాగే వుంటుంది' అనుకుంటూ గట్టిగా ముద్దు కూడా పెడితే తడాఖా తెలిసొస్తుంది అనుకుని, కౌగిలి వదలకుండానే పెదాలు గట్టిగా కొరుకుతూ ముద్దు పెట్టాడు నారాయణ.
పార్వతమ్మ గింజుకుంది. విదిలించుకోబోయింది. కౌగిలి కొద్దిగా సడలించి మళ్ళీ పెదాలు అందుకోబోయాడు.
'
ఛీ ... ఛీ ...' అంటూ తోసేసింది. "దున్నపోతా! బయటకు పోతావా? అందర్నీ పిలవమన్నావా?'' అంది గట్టిగా.
నారాయణకు మతిపోయింది. దగ్గరకు వెళ్ళి నోరుమూసేసి "బాబ్బాబు అరవక! రమ్మని చీటీ పంపేవు కదాని వచ్చా'' అన్నాడు దీనంగా.
"
చీటీనా? నీకా? సారాకంపు వెధవ్వి, నిన్నెవత్తి వరిస్తుందిరా? చీటీ పీటీ లేదు. మా ఆయన రానీ నిన్ను జైల్లో తోయిస్తాను ...'' అంటూ అరుస్తోంది పార్వతమ్మ.
నారాయణ పారిపోయి తన వాటాకొచ్చి పడ్డాడు. 'ఎక్కడో, ఏదో పొరపాటు జరిగిపోయింది. దెయ్యం నిజంగానే బజారుకెక్కేటట్టుంది. రాజ్యలక్ష్మి ఏది సహించినా ఇది సహించలేదు. రేపే ఇల్లు మార్చి దూరంగా వెళ్లిపోవాలి .... పార్వతమ్మ మొగుడు ఊళ్ళో దిగకుండానే' అనుకొన్నాడు నారాయణ.
                                                                    *****
రాజ్యలక్ష్మమ్మ సామాన్లు సర్దుతూ తృప్తిగా నిట్టూర్చింది. రోజు పార్వతమ్మ 'రామం మా ఇంటికి రావడమే లేదు. పుస్తకం అడిగాడోసారి ... అతనికివ్వు' అంటూ ఇచ్చిన పుస్తకం తను పరీక్షగా చూడడం మంచిదయింది. చీటీ మొగుడికందేలా చూసింది. రామం భవిష్యత్తు కాపాడుకుంది.
ఇదీ రాజ్యలక్ష్మమ్మ కథ ... మళ్ళీ ఆర్నెల్లకు వచ్చేసరికి రేవతి కనబడింది.

No comments:

Post a Comment