ముగ్గులోకి దించాలి ...
రంగంలోకి దించాలి ...
అవతలివాళ్ళ వీక్ నెస్ ఆసరాగా చేసుకొని పని పూర్తిచేయాలి. పక్కింట్లోకి అద్దెకొచ్చిన రాజ్యలక్ష్మి గురించే దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు యాదగిరి.
అద్దంలో ముఖానికున్న బొట్టు నీట్ గా వుందో లేదో చూసుకుంటూ సరిచేసుకుంటూ కిటికీలోంచి చూస్తున్నాడు, నరాలు జివ్వుమన్నాయి.
కామం కళ్ళలోంచి వేడిసెగలు కక్కుతోంది. రోమాలు నిక్కబోడుచుకున్నాయి. యాదగిరి కళ్ళు ఇప్పుడు అద్దం వైపు లేవు పక్కింటి రాజ్యలక్ష్మిని కిటికీలోంచి ఆమెనే తదేకంగా చూస్తున్నాయి.
అప్పుడే స్నానం చేసి కురులు ఆరబెట్టుకుంటున్నట్లుంది ... ఫ్యాను కింద వంటిపై టవల్ తప్ప మరేం లేదు. తొడలు ... ఎత్తులు ... మత్తెక్కిస్తున్నాయి. తనకి గనక మాయామంత్రాలు తెలుసుంటే గోదాలోంచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని ఏమేమో చేయాలనుంది. కిటికీ చువ్వలు జైలు కడ్డీలా అడ్డంపడుతున్నందుకు మనస్సులో నొచ్చుకున్నాడు. తట్టుకోలేక పోతున్నాడు యాదగిరి.
యాదగిరి బ్యాచిలర్ ... చిన్న చిన్న అప్పులిచ్చి రోజువారీ వడ్డీలు సాయంత్రం వసూలు చేసుకోవడం అతని వ్యాపారం. రోజులో గంటపని ... ఆ గంటసేపు ఎవరో మిత్రుడి బైక్ తీసుకుని వసూలు చేసుకుంటుంటాడు. వడ్డీ డబ్బుతో జల్సా చేస్తుంటాడు.
యాదగిరి మనసునిండా రాజ్యలక్ష్మే నిండిపోయింది. ఆమె స్నానం చేసే టైంకి లేవడం కిటికీ పక్కనే కుర్చీ వేసుకుని తన రూమ్ లోంచి చూద్దాం ఓ దినచర్యగా మారింది.
కన్నులా అవి ... కావు వెన్నెల కిరణాలు ...
చూపులా అవి కావు ... మన్మథ బాణాలు ...
ఎత్తులా అవి కావు ... ఎవరెస్ట్ శిఖరాలు ...
పిరుడులా అవి కాదు ... ఇలా ఆమెని చూస్తూ మనస్సులోనే ఆనందపడి మెలికలు తిరిగి పోవడం ... ఎలాగైనా పలకరించాలనే ఆలోచనతో నిండిపోయింది రోజురోజుకీ ఆమెపై వ్యామోహం ఎక్కువైపోయింది యాదగిరిగి.
*****
ఓ రోజు బస్టాపులో బస్సుకోసం నిలబడి వుంది రాజ్యలక్ష్మి. మిత్రుడి స్కూటర్ మీద దర్జాగా అటువైపు వస్తున్నాడు యాదగిరి. స్పీడుగా ముందుకుపోయేవాడల్లా ఆమెను చూసి వెనక్కి తిరిగాడు.
"నమస్తే మేడమ్!'' అన్నాడు బందాపి యాదగిరి.
"ఎవరు?'' అంది రాజ్యలక్ష్మి.
"నేను ... నా పేరు యాదగిరి ... మీ ఇంటిపక్కన మెడమీద రూములో వుంటుంటాను. మీకు నేను తెలియదు ... నాకు మీరు తెలుసు''
"అలానా ...!'' అంటూ ఓ అడుగు వెనక్కి జరిగింది రాజ్యలక్ష్మి.
"బస్సులు లేవనుకుంటా మేడమ్! ఎక్కడికెళ్ళాలి?'' లైట్ స్మైల్ ఇస్తూ అడిగాడు యాదగిరి.
"అదే చూస్తున్నా! గంటయిపోయింది ... ఆఫీసుకెళ్ళాలి ...'' టెన్షన్ పడుతోంది రాజ్యలక్ష్మి ఆఫీసుకు లేటయిపోతున్నందుకు.
ఎక్కడిదాకా?'' మనసులో సంతోషంతో అడిగాడు యాదగిరి.
"నాంపల్లి వరకు చాలు ...'' బ్యాగ్ చూసుకుంది. చిల్లర మాత్రమే వుంది బ్యాగులో ...
"మీరేమనుకోకపోతే అటే వెళ్ళేది నేను కూడా ... అక్కడ మిమ్మల్ని దించుతా ...''
"ఎందుకండీ మీకు శ్రమ ...'' అంది రాజ్యలక్ష్మి.
"శ్రమేముంది ... బస్సులులేవుకదా ... ఫర్లేదు రండి మేడమ్'' అన్నాడు సమయాన్ని కనిపెట్టి భాలేఛాన్సులే అనుకున్నాడు మనసులో, తన ఆనందానికి అవధుల్లేవు.
"ఊరికినే వద్దులెండి ... ఎప్పుడైనా 'దావత్' ఇద్దురు గాని ...
"దావత్తంటే?'' అడిగింది రాజ్యలక్ష్మి.
దావత్తంటే ... దావత్తే ...'' అన్నాడు అర్థం తన మనస్సుకే తెలుసు యాదగిరికి.
'పార్టీ' కామోసు అనుకుంది రాజ్యలక్ష్మి ... తెలంగాణా భాషకింకా అలవాటు పడలేదు రాజ్యలక్ష్మి.
స్కూటరు వెనక ఎక్కి కూర్చుండి రాజ్యలక్ష్మి.
స్పీడ్ బ్రేకరు లేకపోయినా బ్రేకులేస్తున్నాడు యాదగిరి.
శరీరానికి రాజ్యలక్ష్మి ఎత్తులు తగిలి ఏదో అయిపోతున్నాడు యాదగిరి.
ఎవడిదో స్కూటరు ... ఎవడిదో పెళ్ళాం ... ఇదే కదా అదృష్టమంటే అనుకుంటూ ... నాంపల్లి స్టేషన్ కు షార్ట్ కట్ లో కాకుండా ... ఎటెటో తిప్పి బస ట్రాఫిక్ అంటూ ... అరగంట ఆనందంగా అనుభవించాడు ఆ ప్రయాణాన్ని. రాజ్యలక్ష్మి ని దింపు ... బాధగా తన దారిన వెళ్ళిపోయాడు యాదగిరి.
*****
పన్నెండు గంటలు కొట్టింది గోడగడియారం.
అప్పుడే తెల్లారినట్లు లేచాడు యాదగిరి. రాత్రి మిత్రులు పార్టీ ఇచ్చారు.
ఫ్రీగా వస్తే ఫినాయిలైనా తాగే రకం యాదగిరి. స్వతంగా సిగరెట్ కూడా కోని కాల్చడు.
వడ్డీ వ్యాపారిగా అది అతని పాలసీ ...! కిటికీ వైపు చూసి రాజ్యలక్ష్మి కనబడకపోవడంతో లేచి తలుపులు తీశాడు ...
ఆశ్చర్యం ... ఆనందం ఒకేసారి కలిగాయి. నిష్చేష్ట్రుడైపోయాడు యాదగిరి. "మీరా! రండి ఫర్లేదు ... లోపలికి రండి ... కూర్చోండి'' అంటూ ఓ కుర్చీ చూపించాడు.
"బ్యాచిలర్ రూము కదండీ ... కాస్త మీకు ఇబ్బందిగా వుంటుంది మంచం మీద దుప్పట్లు ... దిళ్ళూ సర్డాడు స్పీడుగా ...
"ఏంటి ... ఇలామీరు ...!'' అడిగాడు అనుమానంగా ఆమెను క్రిందనుంచి పైకి చూస్తూ, నయనానందం అనుభవిస్తూ ...ఫర్లేదు చెప్పండి ... చల్లకొచ్చి ముంతదాచడమెందుకు?''
"మీరు డబ్బులు వడ్డీకిస్తారట కదా! మీరిచ్చినా సరే లేదా ఎక్కడైనా ఇప్పించినాసరే;; అంది అసహనంగా కూర్చుంటూ రాజ్యలక్ష్మి.
"ఈరోజే అంటే కష్టం ... ఓ వారం తర్వాతైతే పద్దువస్తుంది" అన్నాడు.
"లేదు పిల్లల ఫీజులు కట్టాలి అర్జెంటుగా వాళ్ళకి పరీక్షలు ... మీ సహాయం మరచిపోను'' అంది రాజ్యలక్ష్మి క్రిందికి చూస్తూ.
"కష్టమే ... కానీ ట్రై చేస్తాను ... మీకోసం'' అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు యాదగిరి అదోలాగా మొహంపెట్టి.
"ఏ విషయం సాయంత్రం చెబుతాను ... మా ఫ్రెండొకతను ఇస్తాడు అతన్నదిగి ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను ... అయితే ఒకటి మంచి 'దావతివ్వాలి'''
"దావత్తా!?''
"మీకిష్టమైతేనే ... వడ్డీ మామూలేననుకోండి ... ఇప్పించినందుకు ...''
"సరే ... ముందు మా ఇబ్బంది గట్టెక్కనివ్వండి ... అలాగే దానికేం భాగ్యం'' అంటూ వెనుదిరిగింది రాజ్యలక్ష్మి.
ఆమె మెట్లు దిగి క్రిందకి వెళ్లేవరకూ రెప్పలు ఆర్పకుండా చూస్తుందిపోయాడు.
ఆమె వెళ్ళిపోయినా ఆమె పిరుదుల కదలిక మనస్సులోంచి మళ్ళిపోవడంలేదు. యాదగిరి ... తలుపులు మూసి బెడ్ మీద అట్టేపడిపౌఆడు వెనక్కి. 'సక్సెస్ ... గ్రాండ్ సక్సెస్ ... యాహూ ...'' అనుకుంటూ ...
*****
బస్టాపు జనంతో రద్దీగా వుంది. బస్సురాగానే ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు, వ్రేలాడేవాళ్ళు బస్ రష్ గా వుండడంతో మరో బస లో వెళ్దామామనుకుంటూ రాజ్యలక్ష్మి అక్కడే నిలబడి పోయింది. వాచీవైపు చూసుకుంది ... ఆఫీసుకు టైమైపోతుంది. మళ్ళీ బస్సు ఎప్పుడొస్తుందో ఏమో ... అనుకుంటూ బస్ వచ్చే వైపు చూడసాగింది.
"నమస్తే మేడమ్ ...'' వెనక స్కూటర్ మీద యాదగిరి.
యాదగిరి మాటకి వెనక్కి తిరిగింది రాజ్యలక్ష్మి "రాత్రికి రండి మీరిప్పించిన ఎమౌంట్ తిరిగి ఇచ్చేస్తాను'' అంది రాజ్యలక్ష్మి నవ్వుతూ ...
"ఎమౌంట్ దేముంది? దావత్ ఎప్పుదిస్తారు?''
"అదికూడా రాత్రికే ... ఆఫీసు నుండి రావడం లేటవుతుంది. మా వారు కూడా లేరు, క్యాంప్ కెళ్ళారు. ఎనిమిది తరువాత రండి ... పిల్లలు పడుకుంటారు ... వాళ్ళ ముందు ఇవ్వడం బాగుండదు'' అంది రాజ్యలక్ష్మి.
ఎవరెస్టు ఎక్కినంతగా ఆనందపడిపోయాడు యాదగిరి. ఆనందంలో ఒక్కటే కిక్కుతో వెనుదిరిగాడు బదిమీద యాదగిరి.
*****
ట్రింగ్ ... ట్రింగ్ ...
"మీరా ...! రండి కూర్చోండి'' అంది యాదగిరిని చూసి. యాదగిరితో పాటు వెంటవచ్చిన సెంటువాసన మత్తురేపుతూ గుప్పుమంది.
"ఇదిగో పదివేలు ... వడ్డీ లేక్కచూసుకోండి '' అంటూ ఇబ్బందిగా అంది రాజ్యలక్ష్మి.
"మరి దావత్తు'' అడిగాడు యాదగిరి.
"మా ఇంట్లో శుభకార్యం ఏదైనా జరిగితే తప్పకుండా ఇస్తాను'' అంది రాజ్యలక్ష్మి అమాయకంగా ...
"నేనడిగిన దావత్తు అదికాదు ...'' అంటూ పళ్ళికిలించాడు యాదగిరి అదోలా చూస్తూ ...
"దావత్తు' అర్థం అప్పుడర్థమైంది రాజ్యలక్ష్మికి. ఒళ్ళుమండిపోయింది.
"రెండు దావత్తులివ్వాలి ... ఒకసారి స్కూటర్ మీద లిఫ్ట్ ఇచ్చినందుకు ... మరోసారి పదివేలు అప్పిచ్చినందుకు'' అంటూ చేయిపట్టుకోబోయాడు యాదగిరి.
"ఛీ ... నీచుడా ... దావత్టంటే అర్థం అదా ... నీ చెల్లెలు, నీ అమ్మ ఎప్పుడూ నీ స్కూటర్ మీద ఎక్కలేదా ... వాళ్ళనడగరా దావత్తు ... ముందు బయటికి నడువు ..'' అంది ఆవేశంగా.
"పెద్దగా అరవకు ... డామిట్ కథ అడ్డం తిరిగింది'' అనుకుంటూ అవమానంతో వెనుదిరిగాడు యాదగిరి.
అప్పుడే క్యాంపునించి వచ్చిన భర్తకి చెప్పింది రాజ్యలక్ష్మి దావత్ కధంతా ...
"వాడి పాపం వాడిదే ... వాదార్థం వాడిది ... పైవాడే చూసుకుంటాడు'' అన్నాడు భర్త.
*****
మరుసటి రోజు మిత్రుడి స్కూటర్ తీసుకుని వెళ్తూ యాక్సిడెంట్ లో చెయీ కాలూ విరిగి హాస్పిటల్ లో చేరాడు యాదగిరి. చూడ్డానికి వెళ్ళిన మిత్రుడు అడిగాడు "ఎలా జరిగిందిరా?'' అని.
''దావత్ పుణ్యం ...'' అన్నాడు చేతివంక ... బ్యాండేజ్ ల వంక చూసుకుంటూ ... శూన్యంలోకి చూస్తూ ...

No comments:
Post a Comment