Thursday, January 17, 2013

Nuvvu naa todu unte….


"అమెరికా సంబంధం ... ఇలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంటుంది ... ముందు నువ్వొప్పేసుకో మాధవరావుగారూ'' కంగారు పెట్టేశాడు మ్యారేజి బ్యూరో ఓనర్ లింగరాజు.
మాధవరావు దీర్ఘాలోచనలో పడిపోయాడు ... ఫోటోలో అబ్బాయిని చూస్తే చూడముచ్చటగా ఉన్నాడు. అతనిలో వంక పెట్టాల్సిన ఒక్క అంశమూ మాధవరావుకి కనిపించలేదు.
కానీ అతను ఆలోచిస్తున్నది ఒక్కటే ... అమెరికా సంబంధం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా కట్నకానుకలతో కూడుకున్న పని. ఒకవేళ సంబంధం కుదిరితే తాను అంత ఖర్చుని భరించగలడా అన్న ఆలోచన మాధవరావు మదిని తోలిచేస్తుంది.
లింగరాజు అసహనానికి గురయ్యాడు ... మాధవరావు ఆలోచనలని కనిపెట్టినట్టు ...
"
మాధవరావుగారూ ...! మీరేం ఆలోచిస్తున్నారో అర్థం అయ్యింది. కట్నకానుకల విషయమే కదా ...! దాని గురించి మీరేమీ బెంగపెట్టుకోకండి. అమ్మాయి లక్షణంగా పదహారణాల తెలుగింటి అమ్మాయిలా వుంటే చాలు ఖాణీ కట్నం అవసరం లేదని వాళ్ళు నాకు ముందే చెప్పారు. ఇక విషయం గురించి ఆలోచించకుండా అంది వచ్చిన అద్భుత అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ... ముందు జరగవలసింది చూడండి'' తొందర చేసాడు లింగరాజు.
"
మీరు చెప్పింది బాగానే వుంది కానీ, మధ్య అమెరికా పెళ్ళిళ్ళు అంటూ జరుగుతున్న మోసాలు పేపర్లలో వస్తున్నాయి కదా ...'' నసిగాడు మాధవరావు.
లింగరాజు చిరాకుగా మొహం పెట్టి "అబ్బా... మీకన్నీ అనుమానాలే ఎవరో ఏదో మోసం చేసారని ప్రతివారినీ అనుమానిస్తే ఇక మనం ముందుకేం వెళతాం. ఒక రైలు పట్టాలు తప్పింది కదా అని ప్రయాణం మానుకోము కదా ... అయినా మిమ్మల్ని వాళ్ళింటికి తీసుకు వెళతాను ... అన్నీ పరిశీలించాకే నీ నిర్ణయం చెబుదువుగానీ ...''
లింగరాజు అన్న చివరి మాటలకు మాధవరావు తృప్తిగా తలాడించాడు. అనుకున్నట్లుగానే మరునాడే ప్రయాణం కట్టారు ... నల్లగొండ జిల్లాలోని మారుమూల గ్రామం అది. చుట్టూ పచ్చని పొలాల మధ్య అందంగా అమర్చినట్టున్న ఇల్లు ... ఊరి మధ్యలో గంభీరంగా కనిపిస్తున్న పెద్ద భవంతి ముందు కారాపాడు లింగరాజు. ఇంట్లోకి వెళ్ళాక పరిచయ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అసలు విషయానికొచ్చారు. భవంతి రూపురేఖలు గమనించగానే కుటుంబం సాంప్రదాయ విలువలకి కట్టుబడి ఉందని గమనించాడు మాధవరావు.
ఇంట్లో వున్న వ్యక్తులు ఉమ్మకి కుటుంబంలా అన్యోన్యంగా ఉండడం చూసాక వారిపైన ఒక మంచి అబిప్రాయం కలిగింది. డెబ్బై అయిదు సంవత్సరాల వృద్దుడు, అరవై అయిదు సంవత్సరాల స్త్రీని చూడగానే వాళ్ళే తనకి కాబోయే 'అల్లుడి' తాతయ్యా, నానమ్మలని గుర్తుపట్టాడు మాధవరావు.
లింగరాజు వృద్ధుడికి వినయంగా నమస్కరించి "అయ్యా ... తమ మధ్యవర్తికి సంబంధం చూడమని మీ అబ్బాయి పదేపదే కోరగా, ఆర్నెల్ల నుండి భూతద్దం పెట్టి మరీ గాలించి లక్షణమైన సంబంధాన్ని పట్టుకొచ్చాను. మాధవరావుగారిది సాంప్రదాయమైన కుటుంబమే కాకుండా అమ్మాయి కూడా ఎం.బి.. పూర్తి చేసింది. అమ్మాయి రూపురేఖలలో కూడా కుందనపు బొమ్మని తలపిస్తుంది ... ఫోటోని చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తే ... మిగతా కార్యక్రమాన్ని తొందరగా జరిపించేయవచ్చు ...'' అమ్మాయి ఫోటోని అతనికి అందించాడు లింగరాజు.
మందంగా వున్న కళ్ళద్దాలని సవరించుకొని తల కాస్త పైకెత్తి కళ్ళని దించి ఫోటో వైపు తేరిపార చూసి తృప్తిగా నిట్టూర్చాడు. వెంటనే ఫోటో అతని భార్య చేతుల మీదుగా మిగతా కుటుంబ సభ్యులందరికీ చేరిపోయింది .... ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ సంతోషంగా పెళ్ళికి ఒప్పుకున్నారు.
తరువాత జరగవలసిన కార్యక్రమాలు వెంట వెంటనే జరిగిపోయాయి. పదిహేను రోజుల్లో పెళ్ళి కొడుకు సందీప్ తో పాటు అతని తల్లిదండ్రులు ఇండియా వచ్చేశారు.
మాధవరావు ఇంట్లో అంతా హడావిడిగా వుంది. కారణం రోజే అమ్మాయిని చూడటానికి పెళ్ళివారు వస్తున్నారు. పైగా అమెరికా సంబంధం ... తన అమ్మాయికి పట్టిన అదృష్టానికి తెగ సంబరపడిపోతున్నాడు మాధవరావు ...
ఖాణీ కట్నం తీసుకోకపోవడమే కాకుండా పెళ్ళి బ్రహ్మాండంగా రంగరంగా వైభవంగా జరిపించడానికి అదనంగా రెండు లక్షల రూపాయలని కూడా తనకి అందజేస్తానని పెళ్ళికొడుకు తాతయ్య చెప్పాడు. అందుకే మాధవరావు ఎన్నడూ లేని ఉత్సాహంతో పనులన్నింటినీ చకచకా పూర్తి చేస్తున్నాడు. ఊర్లోని వారందరూ కూడా మాధవరావు కూతురి పెళ్ళి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక పెళ్ళి కూతురు లావణ్య అయితే ...! సందీప్ ఫోటోని చూసినప్పటినుంచీ ఊహాలోకాల్లో విహరిస్తోంది.
సందీప్ ఎప్పుడెప్పుడు కళ్ళెదురుగా కనిపిస్తాడా అన్నట్లుగా క్షణాలని లెక్క పెట్టుకుంటూ మరీ ఎదురు చూస్తోంది. లావణ్య ఫ్రెండ్స్ చెవిలో చెబుతున్న చిలిపి మాటలను కూడా వినే స్థితిలో లేదు ... ఆమె ఆలోచనలన్నీ సందీప్ గురించే సాగుతున్నాయి. రానే వచ్చారు పెళ్ళివారు ....
నాలుగు కార్లు దుమ్ము రేపుకుంటూ ఊర్లోకి ప్రవేశించగానే ఇంతరవరకూ ఎప్పుడూ అంత ఖరీదైన కార్లని చూడని ఊరి జనాలు మాధవరావు ఇంటిముందు గుమిగూడారు. అమెరికా అబ్బాయిని చూడటానికి ఒకరికంటే ఒకరు పోటీ పడుతున్నారు. దృశ్యాన్ని చూసి మాధవరావు గర్వంతో పొంగిపోయాడు.
అతిథి మర్యాదలు దగ్గరుండి మరీ జాగ్రత్తగా జరిపించాడు. పెద్ద హాల్లో అందరూ ఆసీనులయ్యారు. లావణ్య కంటే ఎక్కువగా ఆత్రుతగా ఉంది సందీప్ కి లావంయని చూడాలని .... సమయం రానే వచ్చింది ....
అమ్మాయిని తీసుకురండని ఎవరో అరిచారు ... అక్కడంతా నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. ఊపిరి బిగపట్టి మరీ లావణ్య రాకకోసం ఎదురుచూస్తున్నాడు సందీప్.
ముందుగా కాళ్ళ పట్టీల శబ్దం వినిపించింది ... ఒక జతవి కాదు, ఐదారు జతలవి. నిశ్శబ్దంలో పట్టీలు చేసే శబ్దం ... సంగీతంలా మదిలో హొయలు పలికిస్తుంటే ... నారీమణుల మధ్యన లేత చిగురాకు రంగు చీరలో, చేతిలో కాఫీ ట్రే పట్టుకుని, బుగ్గలు జామపండులా ఎరుపెక్కుతుండగా ... నుదుటన అందంగా గుండ్రంగా మెరుస్తున్న ఎర్రటి బొట్టు కనులను ఆజ్ఞాపించిందన్నత్తుగా ... నేల చూపులని  చూస్తూ అడుగులేస్తూ ... సిగ్గుని సింగారించుకుని ... అందానికి మరింత వన్నె తెచ్చుకుని బిడియంగా అందరికీ 'కాఫీ' అందించాసాగింది.
లావణ్య తన్మయత్వంతో లావణ్యనే చూస్తుండిపోయాడు సందీప్. రెప్పవేస్తే ఆమె ఎక్కడ మాయం అవుతుందో అన్నట్టుగా. క్షణం అలాగే నిలిచిపోతే ఎంత బాగుండును అని మనసు మారాం చేస్తుండగా ... అతనికి ఎదురుగా వచ్చి కొంచెం వంగి, ట్రిని ముందుకి సాచి మరింత సిగ్గుతో నేలచూపులు చూస్తూ నిలబడి పోయింది లావణ్య. సరిగ్గా అప్పుడు సందీప్ గట్టిగా అరిచినట్టుగా అన్నాడు "నాకు అమ్మాయి నచ్చిందని''
హఠాత్పరిణామానికి లావణ్య బిగుసుకుపోయింది ... ట్రిని జారవిడిచింది. ఒక్క పరుగులో తన గడిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది.
"
ఇది జరిగే పనేనా'' కాస్త కోపంగానే అన్నాడు మాధవరావు.
అలా ఆవేశాపదకండి బావగారూ ... ఆల్రెడీ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకున్నాము. పెళ్ళి కూడా ఫిక్స్ చేసుకున్నాము. ఇక పెళ్ళి ఒక్కటే తరువాయి ... కాకపొతే పెళ్ళి అయిన తర్వాత జరగవలసిన శోభనమేదో ... పెళ్ళికి ముందే జరిపించమంటున్నాడు మా అబ్బాయి. అలాగని అపార్థం చేసుకోకండి ... ఎంతైనా అమెరికాలో ఉంటున్నాడు కదా ... కాస్త తొందరెక్కువ వెధవకి ... ఆగలేకపోతున్నాడు ...'' కాస్త అధికార స్వరంతో వీలైనంత సౌమ్యంగా వివరించాడు సందీప్ నాన్న మాధవరావుకి.
"
ఇరవై రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ... ఇలాంటి కోరిక కోరడం సబబేనా ... ఎవరికైనా విషయం తెలిస్తే పరువుపోదూ ... నేనోప్పుకున్నా ణా కూతురు ... వినడానికే ఇబ్బందిగా ఉన్న విషయానికి ఒప్పుకుంటుందా '' ఆవేశంగా అన్నాడు మాధవరావు.
"
చూడండి బావగారూ వాదనలు అనవసరం ... మా అబ్బాయి ఏది కోరినా మేం కాదనలేడు. అలాగే ఇది కూడా ... అయినా వాడు తనకి కాబోయే భార్యనే కదా కోరాడు. వాడి కోరిక తప్పని నేననుకోవడం లేదు. పెళ్ళికి ముందు దొంగచాటుగా ఎంత మంది యవ్వారాలు జరిపించటం లేదు ... (క్షమించాలి ఇది పూర్తిగా సందీప్ అమెరికా ఫాదర్ అభిప్రాయం ... రచయితా) కాకపొతే మా అబ్బాయి ఫ్రాంక్ గా వాడి కోరికని నా ముందుంచాడు ...''
మాధవరావు పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరి అయ్యింది ... అల్లుడిగారి కోరికని కాదనలేక, అమ్మాయికి విషయాన్ని ఎలా చెప్పాలో అర్థంకాక తల పట్టుకున్నాడు.
చివరికి విషయం లావణ్య చెవిన పడింది. విషయం అర్థం కాగానే ఆమె ఒళ్ళు గగుర్పాటుకి లోనయ్యింది. తన దృష్టిలో ఎంతో ఉత్తమమైన మనస్కుడుగా చిత్రీకరించుకున్న సందీప్ ఆలోచనలు మరీ ఇంత నీచంగా వుంటాయా అనుకుంది. ఆమెకి ఏడుపు వచ్చింది.
లావణ్య ఫ్రెండ్స్ వారించి "అమెరికా వాడు కదా కాస్త ఫాస్ట్ గా ఉన్నాడు. అయినా అందరికీ పెళ్ళయ్యాక దొరికే సుఖం నీకు పెళ్ళికాకముందే దొరుకుతుంటే సంతోష పడాల్సింది పోయి ... అలా ఏడుస్తున్నావెంటి'' కొంటెగా అన్నారు.
ఎట్టకేలకు పెళ్ళికి ముందే లావణ్య, సందీప్ శోభనం ఖరారైంది.
తెల్లటి చీరలో అందంగా మెరిసిపోతుంది లావణ్య ... ఆమె చేతిలో పాలగ్లాసు ... మోహంలో సిగ్గు స్థానంలో ఒక విధమైన భయం గోచరిస్తోంది ... గుమ్మంలోపలికి నెట్టి వేయబడింది. వెంటనే తలుపులు మూసుకున్నాయి. అవతలినుండి నవ్వుల శబ్దం మాయం అయిపొయింది. ఆమె వంటిపైన బంగారు ఆభరణాలు మెరిసిపోతున్నాయి ... కానీ మెడలో తాళిబొట్టు లేకపోవడంతో అవన్నీ కలాహీనంగా మారిపోయాయి.
"
స్వాగతం ... నాక్కాబోయే అర్థాంగి గారికి'' కొంటెగా అన్నాడు సందీప్.
అతని మాటలకి ముభావంగా ఉండిపోయింది లావణ్య ... ఆమె మోహంలో కించిత్తైనా సిగ్గు కనిపించకపోయేసరికి చిన్నబుచ్చుకున్నాడు. "ఏంటి లావణ్యా ... నేనేమైనా పరాయివాడినా ... నీక్కాబోయే భర్తనేగా ... నన్ను చూసి అందంగా నవ్వవచ్చు కదా'' చిన్నపిల్లాడిలా మొహంపెట్టి అన్నాడు.
అతని మాటలు, ప్రవర్తన లావణ్య మనసుని కరిగిస్తున్నాయి ...
"
నామీద కోపంగా వుందా ...? అయినా నేను కోరిక కోరికలో తప్పేముంది ...? అదే మనం ప్రేమికులమైతే పెళ్ళికి ముందు ఎన్నిసార్లు ... ''
చివ్వున తల ఎత్తింది లావణ్య ...
"
అదే ... కనీసం ముద్దుముచ్చటైనా తీర్చుకునే వాళ్ళం కదా'' మాట మార్చాడు.
బుంగమూతి పెట్టి మొహాన్ని పక్కకు తిప్పుకుంది లావణ్య ...
సందీప్ ఆమెవైపు చూశాడు " పాలు నా కోసమే కదా?'' అంటూ ఆమె చేతిలోని గ్లాసందుకుని పాలన్నీ గటగటా త్రాగేశాడు.
గ్లాసులో సగం పాలు తన కిస్తాడనుకున్న లావణ్యకి ఆశాభంగమే ఎదురైంది ....
"
సారీ లావణ్యా! పాలన్నీ త్రాగేశాను ... మన ఒరిజినల్ శోభనం అప్పుడు ఇద్దరం షేర్ చేసుకుందాం ...''
ఆమె మాట్లాడలేదు ... అతని మాటలు గమ్మత్తుగా అనిపిస్తున్నాయి లావణ్యకి ... ఎందుకో సందీప్ పైన నమ్మకం కలుగుతుంది ...
ఆమె భుజాలపైన రెండు చేతులు వేసీ బెడ్ వరకు తీసుకువచ్చి కూర్చుండబెట్టాడు. "నా భార్య ఇంత అందంగా వుంటుందని నేను కలలో ఊహించలేదు తెలుసా? నా అదృష్టం కొద్దీ నువ్వు నా దానివవుతున్నావు'' మనస్ఫూర్తిగా అన్నాడు సందీప్.
మాటలకి ఆమె మోహంలో కోపం స్థానంలోనే సిగ్గు విరబూసింది. ఎర్రటి ఆమె పెదాల దగ్గరకు తన పెదాలు చేర్చి మైకంగా ... లావణ్యకి మత్తెక్కించేలా ''ముద్దు పెట్టుకోనా?'' అని అడిగాడు.
మాటలకు మరింతగా సిగ్గుపడింది. మొనాంగీకారాన్ని సూచిస్తూ కళ్ళు మూసుకుంది.
అతను తన పెదాలని ఆమె పెదాలకు ఆనించాడు. స్పర్శకి నిలువునా కంపించిపోయింది లావణ్య,
లావణ్య శరీరంలో ఉన్న నరాలన్నిటికీ చలనం వచ్చినట్లు ఒంట్లో ఉన్న రక్తం వేడెక్కి వేగంగా పరుగులు తీస్తున్నట్టు అనిపించింది ... తనకు తెలియకుండానే అతన్ని తన మీదకు లాక్కుంది ... ఇద్దరి శరీరాలు వేడెక్కాయి ... మాటల స్థానంలోనే వెచ్చటి నిట్టూర్పులు వదులుతున్నారు. రసక్రీడలో అతనికి పూర్తిగా సహకరిస్తున్న సమయంలో గబుక్కున ఆమె పై నుండి లేచాడు సందీప్ ... అతని ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. మోహంలో భయాందోళనలు కనిపించాయి.
ఏదో ఆశక్తత అతన్ని ఆవహించింది. నిరాశ నిస్పృహతో రెండు చేతులతో తలని పట్టుకున్నాడు. తన మొహాన్ని లావణ్యకి చూపించడానికి ఇష్టం లేక అటువైపుకి తిప్పుకున్నాడు.
"
యామ్ సారీ లావణ్యా ... యామ్ సారీ ...'' బెడ్ పై నుండి లేచి వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోనుండి బయటకు వెళ్ళిపోయాడు.
పెళ్ళి పనులలో తలమునకలై వున్నాడు మాధవరావు. వెడ్డింగ్ కార్డ్ ప్రింటయి పంచడానికి మహా ఇబ్బందిగా వుంది మాధవరావుకి ... పెళ్ళి ఇంకా పదిహేను రోజులు ఉందనగానే బంధువులు ఒకరొక్కరుగా దిగుతున్నారు. మొత్తం మీద ఇంటికి పెళ్ళి కళ వచ్చేసింది.
కానీ లావణ్య మొహం కళావిహీనంగా మారిపోయింది. ఆమె మనసు మనసులో లేదు. మెదడంతా మొద్దుబారి పోయినట్లింది ... మూడు రోజులుగా ఆమె ఎవ్వరితోనూ సరిగా మాట్లాడలేకపోతూంది. స్నేహితులతో కూడా సరదాగా వుండలేక పోతూంది. శోభనం రోజు రాత్రి సందీప్ సడెన్ గా అలా వెళ్లిపోవడం ఆమెకి ఏవేవో అనుమానాలను కలిగిస్తోంది ....
ఒకసారి చూస్తేనే మనసు పారేసుకోవాలన్నంత అందంగా వున్నవాడు. దేహ ధారుడ్యంలో కూడ కండపుష్టి కలవాడు. పైగా అమెరికాలో ఉంటున్నాడు ... అమ్మాయి దగ్గరకు రాగానే నీరుకారి పోతున్నాడు. అంటే అతనికి మగతనం లేదా ...? ఆలోచన రాగానే లావణ్యకి ఎక్కడలేని నీరసం ఆవరించింది. అతని మాటలూ చేష్టలూ అన్నీ మగాడిలానే ఉన్నాయి. తీరా '' విషయానికి వచ్చేసరికి ఆలోచించలేకపోయింది లావణ్య. విషయాన్ని ఎవ్వరితోనూ చెప్పుకోలేకపోతోంది. ఇది తన జీవితానికి సంబంధించిన విషయం ... ఆలస్యం చేస్తే జరగరాని అనర్థం జరిగిపోతుంది.
ఇక తన బ్రతుకు కుక్కలు చింపిన విస్తరిలా అయిపోతూంది. ఆమె కంతా ఆగమ్యగోచరంగా ఉంది. ఒకేసారి దుఃఖం మున్చుకువచ్చింది.
ఎంతసేపు ఎద్చిందో తెలియదు చివరకు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కన్నీళ్ళు తుడుచుకుని హాల్లోకి వచ్చి "నాన్నా ...!'' అంటూ గట్టిగా అరిచింది.
అరుపుకి ఉలిక్కిపడ్డాడు మాధవరావు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యంగా లావణ్యనే చూస్తున్నారు ...
మాధవరావు లావణ్య దగ్గరకు వచ్చి "ఏమిటమ్మా?'' అన్నాడు సౌమ్యంగా.
"
నేను ... నేను మరొక్కసారి సందీప్ తో కలవాలనుకుంటున్నాను'' స్థిరంగా చెప్పింది.
మాధవరావు అయోమయంగా "అదేమిటమ్మా?'' అన్నాడు ....
"
నేను మరొక్కసారి సందీప్ తో శోభనం చేసుకోవాలనుకుంటున్నాను ...''
మాటలకి ప్రక్కనే బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు మాధవరావు.
మాటలు విన్న ముసలాళ్ళు 'హవ్వ ... హవ్వ ...'' అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. పెళ్ళి కాకుండానే రెండవసారి శోభానమా? పిచ్చెక్కిందా అన్నట్లు లావణ్య వైపు చూశాడు మాధవరావు.
"
నీకు మతిగానీ పోయిందా ...? పది రోజుల్లో పెళ్ళి పెట్టుకుని ఇలాంటి పిచ్చి కోరిక కోరడానికి సిగ్గు లేదూ ...?'' కోపంగా అన్నాడు మాధవరావు.
"
మొదటిసారి మీరందరూ కలిసి సందీప్ దగ్గరకు నన్ను పంపించినప్పుడే పోయింది సిగ్గు. ఇప్పుడు కొత్తగా సిగ్గు పడాల్సిన అవసరం లేదు. నేను సందీప్ తో కలవాలనుకుంటున్నాను. సందీప్ ని పిలిపించండి ... లేదా పెళ్ళి క్యాన్సిల్ చేయండి'' ఖచ్చితంగా చెప్పి విసవిసా లోపలికి వెళ్ళిపోయింది లావణ్య.
మాధవరావు తల పట్టుకున్నాడు ... సంప్రదాయానికి విరుద్దంగా వెర్రిపోకడలు పోయినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని నిందించుకుంటూ చేసేది లేక పెళ్ళికొడుకుకి ఫోన్ చేయడానికి రిసీవర్ అందుకున్నాడు.
శీను మారిపోయింది ... గదిలో ఏడుస్తూ బెడ్ పైన పడుకుని ఉంది లావణ్య ...
చేతిలో పాల గ్లాసైతే లేదుగానీ సందీప్ ని గడిలోకి పంపి తలుపులు గడియ వేశారు. సందీప్ మెల్లిగా వచ్చి బెడ్ పైన కూర్చున్నాడు.
లాలనగా భుజంపైన చేయి వేసాడు ...
విసురుగా లేచి కూర్చుంది లావణ్య ... ఎంతగానో ఏడ్చింన్నట్టుగా కళ్ళు ఉబ్బి ఉన్నాయి ...
"
ఏయ్ ఏమిటిది ...! చిన్నపిల్లలా ...'' బుగ్గల్లో వున్న కన్నీళ్ళు తుడుస్తూ అన్నాడు సందీప్.
లావణ్య సందీప్ ని సూటిగా చూసింది. రెండు క్షణాలు చూసి గట్టిగా వాటేసుకుంది ... " లవ్ యూ సందీప్ ... నేను నిన్ను ప్రేమిస్తున్నాను ... మొదటిసారి ఫోటోలో నిన్ను చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ...'' కాసేపు ఆగింది.
ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు ...
"
విషయం గురించి నువ్వేమీ దిగులు పడకు ... పేరున్న డాక్టర్లందరినీ కలిసి సమస్యకి పరిష్కార మార్గం వెతుకుదాం ... అమెరికాలో కాదు ... ఆంధ్రాలో కూడా పేరుమోసిన డాక్టర్లు ఎందరో ఉన్నారు ... నీపైన నాకు నమ్మకం ఉంది ... మన పెళ్ళయ్యాక సంవత్సరంలో కాకపోయినా వచ్చే సంవత్సరంలోనైనా నీ బిడ్డకి తల్లినవుతాను ...'' సందీప్ మొహంలోకి చూసింది.
అతను నవ్వుతున్నాడు ....
ఆశ్చర్యంగా చూసింది లావణ్య అతనివైపు ...
నవ్వు పెద్దదై కడుపు చేత్తో పట్టుకుని మరీ నవ్వుతున్నాడు.
అయోమయంగా అతనివేపు చూస్తుంది లావణ్య ....
"
నమ్మేశావు కదూ ... నిన్ను ఆట పట్టించడానికి సరదాగా ...'' అతని నోట్లో నుండి మాటలు రావటం లేదు.
లావణ్య మొహాన్ని చూస్తుంటే మరింతగా నవ్వొస్తోంది సందీప్ కి ...
లావణ్యకి విషయం అర్థం అయింది. అంటే రోజు అలా చేసింది తనని ఫూల్ ని చేయటానికా? ఆమె మొహం కందగడ్డలా మారిపోయింది.
"
యామ్ సో సారీ లావణ్యా ... అమెరికాలో ఉన్నప్పుడే తాతయ్య నీ ఫోటోని -మెయిల్ లో పంపించారు. నీ అమాయకమైన మొహాన్ని చూడగానే నిన్ను సరదాగా ఆటపట్టించాలనే చిన్న కోరిక నాలో కలిగింది. అయితే పెళ్ళైన తరువాత ఇలా చేస్తే థ్రిల్ ఏముంటుంది? అందుకే ... అందరి పర్మిషన్ తీసుకునే నిన్నీ విధంగా ఆట పట్టించాను. సరదాగానే సుమా ... దీనివల్ల నాకో విషయం స్పష్టంగా అర్థం అయింది. నేను సంసారానికి పనికి రానన్న విషయం తెలిసి కూడా నాతో జీవితం పంచుకోవాలనుకున్న నీవు నన్నెంతగా ప్రేమిస్తున్నావో అర్థం అయింది. మూడు రోజులూ నువ్వెంత టెన్షన్ అనుభవించావో అంతకన్నా ఎక్కువ టెన్షన్ ని నేనూ అనుభవించాను తెలుసా ... రోజు సంఘటనతో ఎక్కడ నన్ను వెలివేస్తావో అన్న భయం కూడా పట్టుకుంది ...''
లావణ్య అతన్నే మింగేసేలా చూస్తోంది ...
"
సో నేను చాలా అదృష్టవంతుడ్ని ... నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించే భార్య దొరకడం రియల్లీ అయామ్ లక్కీ'' అతను సంతోషంగా అన్నాడు.
లావణ్యకి సంతోషంతో పాటు అతని పైన కోపం కూడా వచ్చింది. కోపం మోహంలో ప్రతిఫలిస్తుండగా ...
"
నీకింకా అనుమానంగా ఉంటే శోభనమేదో ఇప్పుడే చేయడానికి నేను సిద్ధంగా వున్నాను'' కొంటెగా అన్నాడు.
"
యూ ...'' అంటూ అతనిపైకి విరుచుకుపడింది లావణ్య ... రెండు చేతులతో అతన్ని టపటపా వాయించడం ప్రారంభించింది. దృశ్యాన్ని కిటికీలోనుంచి చూస్తున్న సందీప్ తల్లిదండ్రులు, మాధవరావుతో సహా అందరూ హాయిగా నవ్వుకున్నారు.
వారిని గమనించిన లావణ్య, సందీప్ ని కొట్టడం ఆపింది ... సిగ్గు శరీరాన్ని కప్పుతుండగా అక్కడ వుండలేక మొహాన్ని రెండు చేతులతో కప్పుకుని రూంలో నుండి బయటకు పరుగు తీసింది ....

No comments:

Post a Comment