అతని వేలి నుండి
వజ్రపుటుంగరాన్ని తీసాడు కళ్యాణ్
కుమార్.
అది అసలు సిసలైన డైమండ్ పొదిగిన ఉంగరం....
కెనడా దంపతులు పోగొట్టుకున్న డైమండ్ రింగ్ అదే!
చందన సజీవ ప్రతిమైపోయింది. విధి ఆడిన వింత నాటకంలో తను మరొకసారి ఘోరంగా ఓడిపోయింది. తనకంటూ చివరకు ఎవరూ మిగలలేదు.
కానీ రాజశేఖర్ మిగిల్చిన మహా యజ్ఞం ఇంకా పూర్తి కాలేదు.
అతని తీరని ఆకాంక్షను తను పూర్తి చేయవలసిందే...!
అది తీరని చూపులలో చివరగా తను గ్రహించిన సత్యం...తనకు అందిన చివరి సందేశం కూడా అదే...!
ఏ.ఎస్.పి. కళ్యాణ్ కుమార్ దగ్గరున్న ఫైలుపై 'నల్ల తంబి' ఎర్రని పెద్ద అక్షరాలు...కొట్టిచ్చినట్టు కనిపిస్తున్నాయి.
ఎస్....నల్లతంబికి ఇంతకుముందే హిస్టరీ షీట్ ఓపెన్ అయింది. అందరికన్నా ముందుగా తేరుకున్న కళ్యాణ్ కుమార్ ఇక ఆ హిస్టరీ షీట్ తో పనిలేదన్నట్టు నల్లతంబి పేరును రెడ్ ఇంక్ తో సున్నా చుట్టాడు.
ఇప్పుడు తన కర్తవ్యం అనాధ బాలలను ఉద్దరించడం...మరొక కళ్యాణ్....మరొక అధికారి...మరొక కమెండో...మరొక నల్లతంబి ఈ సమాజం తయారుచేయకుండా చూడడం...!
అందుకు చేయూతగా తనకు ఇప్పుడు స్వార్ధపూరిత రాగద్వేషాలకు అతీతంగా, మమతానురాగాలకు మణిపూసగా మిగిలిపోయిన తల్లికాని తల్లి చందన...జనరేషన్ గ్యాప్ లో అగాధం సృస్టించబడి తద్వారా తను ఎంత నష్టపోయిందీ, ఎందరిని కష్టపెట్టిందీ తెలుసుకుని చివరకు పరివర్తన చెందిన తాత ధీరజ్....బాసటగా నిలుస్తారు.
తన నీతి నిజాయితీలకు నీరాజనాలెత్తుతున్న పోలీసు ఆఫీసర్లు.... చివరకు భారత ప్రభుత్వం సయితం ఒక మెట్టు కిందకు దిగి తన అభిప్రాయంతో ఏకీభవించి రాజశేఖర్ మిగిల్చి వెళ్ళిన మహాయజ్ఞాన్ని కొనసాగించడానికి తమ పూర్తి సహకారాన్ని అందించగలరనే విశ్వాసం ఏ.ఎస్.పి. కళ్యాణ్ కుమార్ లో బలంగా నాటుకుంది.
ఇప్పుడు అతని కళ్ళ ముందు శాంతి నిలయం మెదులుతుంది....!

No comments:
Post a Comment