Saturday, January 19, 2013

Coorge Honeymoon


స్వర్గం నుంచి భూమ్మీదకి చేజారిన ప్రదేశాన్ని చూసి, చిత్తం మరిచి, చిత్తరువులా చోద్యం చూస్తూ, మొత్తంగా సృష్టినే 'శృంగార రససృష్టిగా మార్చాలని, మన్మథుడి విల్లునే పాళీగా మార్చి, వర్షాన్ని సిరాగా చేసి, రతీదేవి హోయలను అక్షరాలుగా తీర్చి, ప్రక్తురిని చిత్రంగా గీసి, క్షణకాలం విభ్రాంతమై, చిర్నవ్వుతో, రోమాంచిత ధృక్కులతో తన రససృష్టిని చూసినంతనే దృశ్యం, అదృశ్యంగా చూస్తోన్న మన్మథుడే శృంగారోన్ముఖుడైనాడో, రతీదేవి సరస సల్లాపాలకు ఆహ్వానం పలుకుతూ బాహువులతో స్వాగతించిందో ... విధాత సృష్టితో, మన్మధుడి స్పర్శతో, ప్రక్రుతి సాన్నిహిత్యంలో ధన్యమైన కూర్గ్ కు ఎంత కులుకో ....
తియ్యదనాలు జ్ఞాపకాలకు ఎంత టెక్కో ...
మైసూర్ ... రైల్వేస్టేషన్ ...
అనుదీప్ వెనుకే సిన్సియర్లీ యువర్స్ లా బుద్ధిగా, ముద్దుగా అడుగులేస్తోంది మంత్ర. స్టేషన్ బయట కొందరు బోర్డు పట్టుకుని నిల్చున్నారు.
'
వెల్ కమ్ టు కూర్గ్ ... వెల్ కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ మంత్ర - క్లబ్ మహేంద్ర రిసార్ట్స్' అని బోర్డు పట్టుకున్న వ్యక్తిని సమీపించాడు అనుదీప్.
"
అయామ్ అనుదీప్'' అంటూ స్నేహపూర్వకంగా చేయి చాచాడు అనుదీప్.
"
వెల్ కమ్ సర్ ... అయామ్ సుబ్రహ్మణ్యం. గెస్ట్స్ కో-ఆర్డినేటర్ ని. మా రిసార్ట్స్ కు వచ్చే గెస్ట్స్ ని ఇన్వైట్ చేయడం, వాళ్లకు కావలసిన సహాయం అందించడం నా డ్యూటీ'' చెప్పాడు అనుదీప్ వంకే చూస్తూ సుబ్రహ్మణ్యం అనబడే వ్యక్తీ.
"
నైస్ మీటింగ్ యూ ... షి ఈజ్ మై బ్రిత్ మంత్ర ...'' చిరునవ్వుతో పరిచయం చేసాడు అనుదీప్.
అబ్బురంగా జంటవంకే చూసాడు సుబ్రహ్మణ్యం. కూర్గ్ లాంటి హిల్ స్టేషన్ కు దేశం నలుమూలలనుంచే కాదు, ప్రపంచం నలుమూలల నుంచీ వస్తారు. భిన్న సంస్కృతులు, రకరకాల జంటలు ... ఎక్కువగా హనీమూన్ జంటలే వస్తాయి. పెళ్ళయిన కొత్తలో వుందే మురిపెం, ఆత్రం అతనికి తెలియనివి కావు. తమ మెంబర్స్ కు ఆతిథ్యం యివ్వడం వరకే తమ డ్యూటీ ... అంతకుమించి ఎవ్వరి విషయంలోనూ ఆసక్తి చూపించడు అతను. కానీ, ఎందుకో అనుదీప్-మంత్ర జంటలో అతనికేదో ప్రత్యేకత కనబడుతోంది.
            *****
"
మీరు తెలుగువారా?'' అడిగాడు అనుదీప్ సుబ్రహ్మణ్యాన్ని.
"
విజయవాడ మా స్వస్థలం ... పదేళ్ళ కిందటే ఇక్కడికి వచ్చాను. దాదాపు ఇక్కడే సెటిలయ్యాను. మీరు ...!''
"
మంత్ర ... మేడిన్ ... నాది హైదరాబాద్ ... మధ్యే మ్యారేజ్ అయ్యింది'' చెప్పాడు అనుదీప్.
"
హనీమూన్ అన్నమాట'' చిన్ననవ్వుతో అన్నాడు సుబ్రహ్మణ్యం.
"
భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి కొంత ఏకాంతం, మరికొంత సాన్నిహిత్యం, ఇంకొంత మంచి వాతావరణం కావాలి. ఇది మా ఫీలింగ్ జోన్. మా ఫీలింగ్స్ ని ఇక్కడే డిపాజిట్ చేసి వెళ్తాం ... ప్రతి సంవత్సరం వడ్డీ తీసుకోవడానికి వస్తాం'' చెప్పాడు అనుదీప్.
ఒక్కక్షణం స్థబ్దుగా వుండిపోయాడు సుబ్రహ్మణ్యం. అనుదీప్ మంచి బావకుడే కాదు, పరిణతి ఉన్న ప్రేమికుడు అని అర్థమైంది. అతను జీవితాన్ని ప్రేమిస్తున్నాడు ... తన భార్యనే జీవితంగా మార్చుకుంటున్నాడు.
            *****
మైసూర్ నుంచి ఆరుగంటల ప్రయాణం సార్. కూర్గ్ మంచి హిల్ స్టేషన్, కాఫీ తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ్నుంచి కాఫీ తోటలు, టీ తోటలు, పనస తోటలు, లోయలు ... చెట్ ... కనువిందు చేస్తాయి సార్'' సుబ్రహ్మణ్యం చెబుతున్నాడు.
సాయంకాలం బద్ధకంగా కదులుతోంది. రాత్రి వడివడిగా వస్తోంది. వాతావరణం ఆహ్లాదంగా వుంది. రోడ్డుకు రెండు వైపులా కాఫీ తోటలు, అమ్మాయిలూ వీపునకు బుట్టలు తగిలించుకుని బుట్ట బొమ్మల్లా ఇంటిముఖం పడుతున్నారు. కొందరు టీ ఆకులను అలవోకగా బుట్టలోకి వేసుకుంటున్నారు. చాలా నైపుణ్యంతో పనిచేస్తున్నారు. దృశ్యం చాలా గొప్పగా వుంది.
కాఫీ తోటలను చూస్తోంటే కాఫీ ఘుమ ఘుమలు నాసికా పుటలను పరామర్శిస్తోందన్న ఫీలింగ్, కారు క్లబ్ మహేంద్ర రిసార్ట్స్ ని చేరింది. అప్పటికి సన్నని వానతుంపర మొదలయ్యింది. హిల్ ప్రాంతంలోని కాటేజీలు, హోటళ్ళు, గెస్ట్ హౌస్ లు రంగు రంగుల విద్యుద్దీపాలతో సింగారించుకుంటున్నాయి. అమ్మాయిల అందాల్లా జిగేలుమంటున్నాయి ....
క్లబ్ మహేంద్ర వారు అలాట్ చేసిన కాటేజీలోకి వెళ్ళారు. బెడ్ రూమ్ నీట్ గా అలంకరించి పెట్టారు. హాల్లో సోఫా కమ్ బెడ్ వుంది. పగలు సోఫాలా, రాత్రులు బెడ్ లా చేసుకోవచ్చని చేసి చూపించాడు బోయ్.
బాల్కనీలోకి వచ్చి చూసారు ఇద్దరూ. చుట్టూ కొండలు, అక్కడక్కడ మినుకు మినుకు మంటున్న దీపాలు. ఆకాశం నల్లరంగుల్లో వున్న మబ్బుల్లో నిండివుంది. కిన్చేన్ లో కట్ లెరీ ఐటమ్స్, వోవెన్ అన్నీ సర్దివున్నాయి. మినీ ఫ్రిజ్ లో కోక్ బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్ సర్దివున్నాయి.
మంత్ర హాల్లో వున్న గ్లాస్ డోర్ లో నుండి బయటి అందాలు చూస్తోంది. కూర్గ్ అందాలు రాత్రిపూట వయ్యారాలు పోతున్నాయి.
బోయ్ అన్నీ చూపించి వెళ్ళిపోయాడు.
అనుదీప్ డోర్ లాక్ చేసి వచ్చాడు. ఆమె వెనుకగా వెళ్ళి, తన చేతులతో చుట్టి, ఆమె జడలలో తురిమిన మల్లెల వాసనను ఆఘ్రాణిస్తూ, ఆమె మెడవంపుమీద పెదవులు ఆన్చి కళ్ళు మూసుకున్నాడు.
ఆమె అతని నిశ్చల తపస్సును ఆటంకపరచ కూడదన్నట్టు అలానే నిలబడిపోయింది.
"
మంత్రా ...! నీ చూపుల్లో, చేతల్లో ఏదో మంత్రముంది'' అన్నాడు ఆమె మెడమీద ముద్దు పెట్టుకుంటూ ...
"
నేను మంత్రపుష్పాన్ని ... మీ ముందు, మీ కోసం, మీ కర్పితం అవ్వడం కోసం తయారైన మంత్రపుష్పాన్ని'' ఆమె పోయిటిగ్ గా అంది.
అతని చేతివేళ్ళు ఆమె పొట్టను, నాభిని నొక్కిపెడుతూ, తనవైపు అదుముకుంటున్నాయి.
"
రోమాన్స్ లో ఇంత కిక్కు వుంతుదని అనుకోలేదు'' అతను గుసగుసగా అని ఆమె చెవి కొసను తన పెదవుల మధ్య బిగపట్టాడు.
ఆమె గిర్రున అతనికి అభిముఖంగా తిరిగి, పాదాలను పైకిలేపి, అతని పెదవులు అందుకునే ప్రయత్నం చేస్తూ ... "రోమాన్స్ లో ఆవకాయ రుచి, ఫాస్ట్ ఫుడ్ టేస్ట్, మత్తుమందు కిక్కు కలిసి వుంటుంది'' అంది.
"
వ్వాట్ ...!'' అతను ఆశ్చర్యపడిపోయి అడిగాడు.
ఆమె అతని పెదవులను తన పెదవులతో కరిచేసింది.
"
అబ్బా ...!!!'' అన్నాడతను.
"
ఇది ఆవకాయ రుచి ...'' అంది అతడికి మరికాస్త దగ్గరగా జరుగుతూ ....
ప్రయత్నంలో ... అప్రయత్నంగానో, ప్రయత్నంగానో ఆమె అతడ్ని మరికాస్త కరుచుకుపోయింది. అతనికి గొప్ప రిలీఫ్ గా వుంది. ఆమె నడుంని గట్టిగా నొక్కి పెట్టాడు.
"
ఇది ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ ...'' అంది అలానే తన కౌగిలిలో అరెస్టవుతూ ...
"
మరి మత్తుమందు ...?''
ఆమె అలాగే కార్పెట్ మీద పడుకుండిపోయింది. పాలరాతి శిల్పం కార్పెట్ పై పడుకుండిపోయినట్టుంది. పాలరాతి శిల్పం తన కాఠిన్యాన్ని విడిచి మెత్తబడి ... ఊపిరి పోసుకుంటున్నట్టు వుంది. ఆమె పాదాలు ... నడుం ఒంపు ... నాభి ... అతనికి నిశ్వాసమే కష్టమవుతోంది ...
ఆమె అతడికి ఆహ్వానాన్ని అందించింది చేతులు చాచి. ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. అతని శరీరం విద్యుద్ఘాతాన్ని క్షణకాలం చవిచూసింది. ఆమె చేతులు అతని నడుంని చుట్టి, అతని బరువును అంచనా వేస్తున్నట్టున్నాయి.
"
అదే మత్తుమందు కిక్కు ... మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తుంది'' అంది మంత్ర.
            *****
మెల్లగా నడుస్తూ ... ఆమెకు చేయి అందించాడు అనుదీప్. ఇద్దరూ కొండపైకి చేరుకునే ప్రయత్నంలో వున్నారు. చుట్టూ కాఫీతోటలు వీళ్ళని పలుకరిస్తున్నాయి. పనస చెట్లనిండా బరువైన పనసపళ్ళు గుత్తుల్లా వ్రేలాడుతున్నాయి. చలిగాలి వీళ్ళ చుట్టూ తిరుగుతూనే వుంది. అప్పుడప్పుడు ఉరుములు-మెరుపులు మెరుపులో కూర్గ్ అందాలు ... క్షణాల్లోనే మబ్బులు సమావేశమవుతాయి ... క్షణాల్లోనే మబ్బులు ఆనందభాష్పాలను వర్షంగా జారవిడుస్తాయి. నల్లని మేఘాలు వయ్యారాలు పోతూ వుంటాయి. చిరు చినుకులు శరీరాలను ముద్దాడుతూ వుంటాయి.
కొండపైకి చేరుకున్నారు వారిద్దరూ. నిర్మానుష్యంగా వుంది ... అక్కడక్కడ ఒక సిమెంట్ బెంచీలు, రాతి చప్టాలు ... చుట్టూ రెయిలింగ్, మంత్ర చిన్నపిల్లె అయ్యింది. పిల్లలకోసం చిన్న పార్క్ లా వుంది. ఉయ్యాల వూగింది. 'హలో ...' అంటూ పైకి ఎగిరింగి మేఘం ... ఆమె చేతిని తాకుతున్నట్టే వెళ్తోంది.
"
ఏయ్ మంత్రా ...! ఏం చేస్తున్నావు?'' అడిగాడు అనుదీప్ ఆమెను అపురూపంగా చూస్తూ.
"
మేఘాలను అందుకుంటున్నాను. అచ్చు వైజాగ్ లో మనం మామిడిచెట్టుకున్న మామిడి కాయలను ఎగిరి అందుకుంటున్నట్టే ...'' అంది ఎగురుతూనే. మేఘాలు తలలు వంచి, జంటని చూస్తూ సహా మేఘాలతో అబ్బురాన్ని చెప్పుకుంటున్నాయి. తలల మీదుగా వెళ్తున్న మేఘాలు వాళ్ళ తలపుల్లో ఆహ్లాదాన్ని నింపాయి.
ఒక్కసారిగా పెద్దగాలి ... ఆమె చీరకొంగు జెండాలా రెపరెపలాడింది. ఆమె వక్షసౌదర్యం అతనికి ప్రపంచం సమస్తాన్ని మరిచేలా చేసింది. ఆమె అల్లరిగా చూసింది ... ఉక్రోషంగా చీరకుచ్చెళ్లు లాగింది.
"
మేఘాలు చూస్తున్నాయి ...'' అన్నాడు అనుదీప్.
'
కుళ్ళుకు చావనీ ...' అన్నట్టు చూసి చీరను లాగిపారేసింది. అక్కడెవ్వరూ లేరు ... సమయంలో ఉండరనీ తెలుసు. ఎత్తయిన కొండప్రాంతం ... మేఘాలు అప్పుడప్పుడూ వర్షిస్తూ వెళ్తూనే వున్నాయి.
అప్పుడు ....
అక్కడ ...
ఇద్దరే వున్నారు ...
వాళ్ళిద్దరూ ... ప్రకృతీ ... పురుషులు ...
వాళ్ళకు ఎటువంటి నియమనిబంధనలూ వర్తించవు ... రెండు శరీరాల రాపిడిలో ఫైర్ ప్లేస్ అవసరమే లేకపోయింది.
            *****
"
ఆయామ్ సో లక్కీ ... చాలామంది భర్తలు, భార్యలకు నగలు కొనిపెట్టాలా ... దేశాలు తిప్పాలా .. ఎంత సంపాదించి పెట్టాలా అని ఆలోచిస్తారు. కానీ భార్య మనసును, శరీరాన్ని ఎలా సంతృప్తిపర్చాలా అని ఆలోచించరు. నా మనసుకు స్వాంతన, నా శరీరానికి రిలాక్షేషన్ ... రెండూ కలిసిన గొప్ప అనుభూతిని అందించారు'' మంత్ర అంది అతని భుజం మీద తలవాల్చి.
ఇది జరిగిన ఇరవై అయిదు సంవత్సరాల తరువాత ...
ఇరవై అయిదు సంవత్సరాలు ... ప్రతి సంవత్సరం కూర్గ్ వస్తూ, రొమాంటిక్ అనుభవాను డిపాజిట్ చేసుకుంటూ ... ఇరవై అయిదవ సంవత్సరం ... కూర్గ్ ...
అదే ఎత్తయిన కొండమీద ...
"
ఏయ్ మంత్రా ...! అటు చూడు ...'' అన్నాడు అనుదీప్. అమ్మాయి ఎగిరే మేఘాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది.
అబ్బాయి ఆమెను ఏదో అంటూ వీడియో తీస్తున్నాడు. చిన్న హాండీ కెమేరాతో, అతను ఆమెను టీజ్ చేస్తున్నాడు.
ఆమె ఉక్రోషంగా అతని గుండెలమీద కొడుతోంది కిలకిలా నవ్వుతూ.
అతడు మరింత దగ్గరకు లాక్కున్నాడు.
"
ష్ .... డోంట్ డిస్టర్బ్ దెమ్ ... ఆమె మన కోడలు ప్రియ ... వాడు మన పుత్రరత్నం అభిదీప్ ...''
"
అరె ...! వాళ్ళు అచ్చు మనలానే ...''
"
నేనే కోడలుపిల్లకు చెప్పాను. పాతికేళ్ళుగా కూర్గ్ లో మన స్వీట్ మెమోరీస్ ని విప్పి చెప్పాను. మన అభిదీప్ కి స్వీట్ మెమోరీస్ ని కానుకగా ఇవ్వాలని ... మరో పాతికేళ్ళ వరకూ మనలానే వాళ్ళూ మధురోహాలను డిపాజిట్ చేసుకోవాలని ...''
రెండు జంటల మధ్య వ్యత్యాసమున్నా ... ఫీలింగ్స్ లో, మెమోరీస్ లో వ్యత్యాసాలు లేవు. ఫీలింగ్స్ ని మీరు కోరుకుంటున్నారా ...? స్వీట్ మెమోరీస్ ని మీ దాపత్య జీవితంలోకి ఆహ్వానిస్తున్నారా? వెళ్ళండి మరి కూర్గ్ ...

No comments:

Post a Comment