Thursday, January 17, 2013

Shakalaka baby


క్యూట్ అండ్ క్యూట్ రిసెప్షన్ కౌంటర్ బిజీగా వుంది.
అందమైన అమ్మాయిలూ కాన్వాసు మీద రంగుల్లా మెరిసిపోతున్నారు.
చీరకట్టులో, చుడీదార్లు, మిడ్డీలూ ...
నగరంలో పెద్ద పేరున్న గార్మెంట్స్ 'క్యూట్ అండ్ క్యూట్'
మోడ్రన్ గార్మెంట్స్ విదేశాలకు ఎగుమతి చేసే మపెనీలో చైర్మన్ సురెంద్రప్రసాద్ కు పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం రావడం ఆషామాషీ విషయం కాదు. అయిందంకెలకు తక్కువ కాని జీతం. బాస్ తో జర్నీ, కాస్త అడ్వాన్సయితే బోల్డు అడ్వాన్స్ లూ ... ఇవన్నీ దృష్టిలో వుంచుకొని కూడా ఇంటర్వ్యూ కి అటెండయిన వాళ్ళున్నారు.
రివాల్వింగ్ చేయిర్ లోచి లేచాడు సురేంద్రప్రసాద్. నలభై అయిదేళ్ళ సురేద్రప్రసాద్ ఎప్పుడూ గ్లామర్ గా కనిపించడానికి ప్రయత్నిస్తాడు.
అతని వీక్ నెస్ లు మూడు ...
ఒకటి అందమైన అమ్మాయిలూ ...
రెండు అందమైన అమ్మాయిలూ ...
మూడూ అందమైన అమ్మాయిలే ... అలా అని అతను కాల్ గర్స్ ని ఎంటర్ టైన్ చేయడు.
అతనికి ఫ్యామిలీ టైప్ అంటేనే ఇష్టం. అమ్మాయిలను ట్రాప్ చేయడంలో అతను సిద్ధహస్తుడు. ఎవరికి వీక్ నెస్ వుందో ముందే కనిపెట్టి ప్రకారం ప్రోసీడవుతాడు.
తన దగ్గర పనిచేసే స్టెల్లాని చాలా మామూలు పోస్ట్ లోకి రివర్షన్ లో వెనక్కి పంపించడానికి కారణం స్టెల్లా తన ప్రపోజ్ ని తిరస్కరించడమే. పర్సనల్ అసిస్టెంట్ అనే పోస్టు కేవలం తన చీకటి సరదాలు వెలుగులో కూడా తీర్చుకోవడానికే.
ఓసారి తన ఛాంబర్ ని ఆనుకుని వున్న తన పర్సనల్ రూమ్ కి వెళ్ళి, డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నిలబడి తనను తాను సారి చూసుకున్నాడు. క్రాఫ్ ని సరిచేసుకుని, ఇంపోర్టెడ్ పెర్ ఫ్యూమ్ ను స్ప్రే చేసుకొని, ఛాంబర్ లోకి నడిచాడు.
టాబుల్ ముందున్న ఫైల్ తీసి, పర్సనల్ అసిస్టెంట్ పోస్టుకు వచ్చిన అప్లికేషన్లు, అమ్మాయిల ఫోటోగ్రాఫులు చూస్తూ క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలో ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలను చూస్తున్నాడు.ముందుగా అమ్మాయిని పిలిచాడు.
"
హలో సర్ ... అయామ్ విలాసిని ... కొందరు ముద్దుగా విల్లా అని, మరికొందరు హాసిని అని ... ఇంకొందరు డాళింగ్ అని పిలుస్తారు. మీరెలా పిలిచినా నాకిష్టమే సార్ ...'' హస్కీగా అంది అదోలా చూస్తూ విలాసిని అనబడే క్యాండిడేట్.
బ్లూజీన్స్, వైట్ టీషర్ట్, రెక్ లెస్ గా వదిలిపెట్టిన జుత్తు, పెదాలకు మందంగా దట్టించిన లిప్ స్టిక్ .., సురెంద్రప్రసాద్ ఆమె సర్టిఫికెట్స్ చూడకుండానే "యు కెన్ గొ'' అన్నాడు.
"
అదేంటి సార్ ... 'నావి' చూడకుండానే ... అదే సర్టిఫికెట్స్'' అంది డబుల్ మీనింగ్ లో మత్తుగా చూస్తూ.
సురెంద్రప్రసాద్ సీరియస్ గా చూడడంతో అమ్మాయి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది.
మరో అమ్మాయి వచ్చింది.
చుడీదార్ లో వుంది ... బుద్ధిగానే కూర్చుండి.
"
నీ పేరు?'' సర్టిఫికేట్ లో ఆమె పేరు చూసి కూడా అడిగాడు.
"
మాల ... రత్నమాల'' చెప్పిందా క్యాండిడేట్.
"
ఉద్యోగం నీకు చాలా అవసరమా?'' అడిగాడు సురెంద్రప్రసాద్.
"
అవున్సార్ ...'' అంటూ తనకున్న తెలుగుసినిమా కష్టాల లిస్టు చదివింది రత్నమాల.
"
ఉద్యోగం చాలా రెస్పాన్సిబులిటీస్ తో కూడుకున్నది. రాత్రులు కూడా వర్క్ చేయాల్సి వస్తుంది'' 'వర్క్' అన్న పదం ఒత్తి పలుకుతూ అన్నాడు సురెంద్రప్రసాద్.
"
ఫర్లేదు సార్ ... రాత్రులు మొత్తం ఉండాల్సి వచ్చినా అభ్యంతరం లేదు. మీరెలా చెబితే అలా ... మీరెంత చెబితే అంత ...'' అంది తనూ 'రాత్రులు' అనే పదం ఒత్తిపలుకుతూ.
"
అంటే, నేను చెప్పినట్లుంటారా?''
"
తప్పకుండా'' అంది అతనివైపు చూస్తూ తన కాలిని, అతని కాలుకు తగిలేలా చేస్తూ.
"
.కే. మీరు వెళ్ళొచ్చు''
"
సర్ మరి నా ఉద్యోగం?''
"
వన్ అవార్ లో నోటీస్ బోర్డులో సెలక్టయిన క్యాండిడేట్ పేరు వుంటుంది'' చెప్పదు సురెంద్రప్రసాద్.
చాలా చిరాగ్గా వుంది సురెంద్రప్రసాద్ కి.
ఇంటర్వ్యూలో తనకు కావలసిన క్యాండిడేట్ దొరకలేదు.
ఇంకా చాలామంది అమ్మాయిలూ మిగిలివున్నారు.
అంతా పోస్టు మీద క్రేజ్ తో వచ్చినవాళ్ళే, మరికొందరు ఉద్యోగం అవసరమై, అవసరం కోసం ఏమైనా, ఏదైనా చేయడానికి ప్రిపేరై వచ్చినవాలు.
తనక్కావలసింది అల్లాటప్పా అమ్మాయి కాదు, అందం, అణుకువ, భయం, బిడియం, సంప్రదాయం, శీలం కోసం ప్రాణం అయినా వదులుకునే మెంటాల్టీ ... సరిగ్గా అలంటమ్మాయిని తను ట్రాప్ చేస్తే వుండే సుఖం వేరు.
వద్దన్న కొద్దీ అనుభవిస్తే ఎంత ఆనందం? అతనిలోని మరో మనిషి ఫీలింగ్ ఇది!
అందరూ అయిపోయారు.
చివరగా మిగిలింది ఒకే ఒక అమ్మాయి ... అనామిక ...
డోర్ తీసుకుని, మెల్లిగా లోపలికి వచ్చి తల వంచుకుని నిలబడింది. సురెంద్రప్రసాద్ ఫైల్ లోంచి తలెత్తి ఆమె వైపు చూసి స్టన్నయ్యాడు.
స్ట ... న్నిం ...గ్ ... బ్యూటీ ....
బ్రహ్మదేవుడికి అమ్మాయిలను అందంగా ... ఇంతందంగా పుట్టించడం సరదా కాబోలు. పాలరాతి శిల్పానికి బట్టలు తొడిగినట్టుంది ... ఎక్కడ వుండాలల్సిన అందాలు అక్కడ అమిరిపోయేయి ఆమె శరీరంలో.
"
ప్లీజ్ బీ సీటెడ్''
అనామిక కూర్చుండి.
"
మీ పేరు?''
"
... ... అనామిక''
"
మీ పేరులో మూడు ''లు వున్నాయా?'' సురెంద్రప్రసాద్ అడిగాడు,
"
నో సర్ ... ఓన్లీ వన్ ... అనామిక ఈజ్ మై నేమ్'' చెప్పింది కుర్చీలో కూర్చుని.
"
వెరీ ప్రెట్టీ నేమ్ ... అనామిక అంటే 'ఉంగరపు వేలు' కదూ ... ఏదీ మీ ఉంగరం వేలును చూడనివ్వండి'' అంటూ ముందుకు వంగి, ఆమె నాజూకైన చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
స్పర్శ అతడ్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అతడింకా స్పర్శ నుంచి తేరుకోకముందే, తన చేతిని వెనక్కి లాక్కుంది అనామిక.
సురెంద్రప్రసాద్ ఆమె వైపు పరిశీలనగా చూస్తున్నాడు. కాంఠాన్ని చూస్తే శంఖమే గుర్తొస్తోంది. కంఠం కిందుగా ఉవ్వెత్తున ఎగిసే కెరటాన్ని గుర్తు చేసూ  ... ఆమె హృదయభాగం.
అతని చూపు గమనించిన అనామిక, కొంగును భుజం చుట్టూ కప్పేసుకుంది.
ఆమె చూస్తున్న కొద్దీ టెంప్టవుతున్నాడు సురెంద్రప్రసాద్.
"
ఉద్యోగం మీకు చాలా అవసరమా?'' అనడిగాడు అనామికవైపు చూస్తూ.
"
అవున్సార్'' చెప్పింది తల వంచుకునే.
"
వెల్ ...'' అంటూ అనామిక దగ్గరకి వెళ్ళి, ఆమె భుజమ్మీద చేయివేసి తనవైపు  తిప్పుకుని, తన చేతిని భుజమ్మీదనుంచి నడుమ్మీదకి చేర్చి, నడుమ్మడత మీద నొక్కాడు.
అనామిక దూరంగా జరిగింది ...
"
ప్లీజ్ అనామిక ... నా మాట వింటే, జాబ్ నీదే ... బోనస్ లు, అడ్వాన్సులు బోల్డు వుంటాయి. కారు కూడా ఎలాట చేస్తాను'' ఆమెను గట్టిగా తనవైపు తిప్పుకుంటూ అన్నాడు.
"
సారీ సర్! నేనలాంటిదాన్ని కాదు'' అంది బెదిరిపోతూ అనామిక.
"
నేనూ అలాంటివాణ్ని కాదులే'' అంటూ అనామిక పక్కనే ఉన్న సోఫామీదికి లాగి, తనూ ఆమె మీద ఒదిగిపోయాడు.
ఆమె చీరకొంగు తొలిగింది. గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. నాభి మెరిసిపోతోంది. ఆమెలోని అందాలను ఆబగా టచ్ చేయసాగాడు.
అప్పటికి తేరుకున్న అనామిక అతడ్ని తోసేసింది. ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
సురెంద్రప్రసాద్ ఒక క్షణం కామ్ గా ఉండిపోయి, "ఇట్సాల్ రైట్ ... మీ సిన్సియారిటీ, ప్రిన్సిపల్స్ నాకు నచ్చాయి ... ఉద్యోగం మీదే ... రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చు ... పదివేలు అడ్వాన్స్ కూడా ఇస్తున్నాను'' అంటూ టేబుల్ మీద ఉన్న బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి అందులోనుంచి వందరూపాయల బండిల్ తీసిచ్చాడు.
"
సర్! ఇది నిజమా? నాకు ... నాకు ఉద్యోగం ఇస్తున్నారా? నన్ను క్షమించండి సార్ ...'' అంటూ కన్నీళ్ళతో ఎమోషనల్ గా సురెంద్రప్రసాద్ చేయి పట్టుకుని అంది అనామిక.
"
దట్సాల్ రైట్ ...'' అంటూ ఆమె వీపు నిమురుతూ "యూ కెన్ గో'' అన్నాడు.
మరోసారి థాంక్స్ చెప్పి, చీర భుజమ్మీదుగా నిండుగా కప్పుకొని బయటకునడిచింది అనామిక.
            ******
"
ఆర్యూ మ్యాడ్ ... ఎంతోమంది అమ్మాయిలూ ఉద్యోగానికి వచ్చి, నువ్వేం చేసినా మౌనంగా వుండడానికి, పైగా నిన్ను ఎంటర్ టైన్ చేయడానికి సిద్ధపడితే వాళ్ళని కాదని, పిచ్చాడిలా, నిన్ను రిజెక్ట్ చేసిన పాత చింతకాయ పచ్చడిలాంటి అమ్మాయిని సెలక్ట్ చేసుకుంటావా? పైగా పదివేలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చావా? వాటిస్ దిస్ నాన్సెన్స్ ...?'' కోపంగా అడిగాడు ఆరో రౌండ్ లో మురుగేశ్ సురెంద్రప్రసాద్ ని.
వాళ్ళిద్దరూ బ్లూమూన్ పబ్ లో కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు.
"
పిచ్చి ఫ్రెండూ ... డబ్బుకోసం మనం చెప్పినట్టు చేసి, పడుకోమన్నట్టు పడుకుంటే మజా ఏముంటుంది? వద్దు ... వద్దంటున్న పిల్లని, మన దారిలోకి తెచ్చుకోవడమే గొప్పతనం. అమ్మాయి ... అదే అనామిక వట్టి సెంటిమెంటల్ గాళ్. కాస్త మంచితనం, అడ్వాన్స్ గా ఇచ్చి, కాసింత సిన్సియారిటీ 'పే' చేస్తే చాలు ... తన కన్నెతనం మనకిచ్చి కరిగిపోతుంది'' చెప్పాడు గర్వంగా తన స్ట్రాటజీ తప్పుకాదన్నంత ధీమాగా సురెంద్రప్రసాద్.
సరిగ్గా అదే సమయంలో ....
            ******
తన గదిలో స్టీరియో సౌండ్ పెంచి షకలకబేబీ పాటను వింటూ డ్యాన్స్ చేస్తోంది అనామిక.
"
ఏయ్ షకలక బేబీ ... ఏంటీ హుషారు?'' అడిగింది అనామిక ఉత్సాహాన్ని చూస్తూ రోషిణి.
వాళ్ళిద్దరూ కాల్ గర్ల్స్ ... అనామిక ముద్దుపేరు షకలకబేబీ.
డ్యాన్స్ చేస్తూనే చెప్పింది అనామిక.
"
రోషిణి డియర్ ... కాల్ గర్ల్స్ గా డబ్బు సంపాదించడం మీద బోర్ కొట్టింది. పైగా కాంపిటీషన్. ప్రతి అడ్డమైన వెధవకు ఒళ్ళు అప్పగించాలి. శరీరాన్ని మంచంమీద పరిస్తే మగాడికైనా లోకువే. శరీరాన్ని దాచేసి, ప్యూర్ వర్జిన్ అన్న స్టాంపు నాకు నేనే వేసుకుని, క్యూట్ అండ్ క్యూట్ పర్సనల్ అసిస్టెంట్ ఇంటర్యూకి అటెండయ్యా.
నా చీరకట్టూ, సిన్సియారిటీ ప్లస్ కన్నాంబ లెవల్లో నా నటన చూసి పాపం జీవుడు ఫ్లాటయి, అడ్వాన్స్ యిచ్చి రేపే జాయిన్ అవ్వమన్నాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న టచ్చింగ్ లు ఇస్తూ కొన్నాళ్ళయినా మొనాటినీని బ్రేక్ చేయాలనుకుంటున్నాను'' సన్నటి కన్నీటి పోరని దాచుకుంటూ, కన్నుగీటి చెప్పింది అనామిక.
"
పాపం అలా మోసం చేయడం తప్పుకదే ...'' అంది రోషిణి.
"
పిచ్చి రోషిణీ ... చెప్పాగా ... ఇదే జీవుడు నేను కాల్ గర్ల్ ని అని తెలిస్తే 'లోకువ'చేసి చూసి, వెయ్యో, రెండువేలో నా మొహాన విసిరేసి, నా శరీరాన్ని నలిపేసి, నా అమాయకత్వాన్ని, కన్నెతనాన్ని ట్రాప్ చేసి వాడుకోవాలనుకుంటున్నాడు. ఎట్ సేమ్ టైం ... నేనూ అదే ట్రిక్ ప్లే చేశాను. దటీజ్ షకలక బేబీ స్టయిల్'' అంటూ తన ఒంటిమీద చీర, పెటీకోట్ విప్పేసింది ... లోపల షార్ట్స్ వెసుకుని వుంది.
మళ్ళీ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తోంది షకలకబేబీ పాటకు హమ్ చేస్తూ అనామిక.

No comments:

Post a Comment