Saturday, January 5, 2013

Dakshinam vaipu vaata


రంగనాయకికి మొగుడి డబ్బు యావ అర్థం కాదు. ముసలితనంలో మూడో పెళ్ళి చేసుకున్నప్పుడే తెలుసుకుని ఉండాల్సింది. పడ్డాకా తగులుకుని ఉండకపోతే పడుచుపెళ్ళాం పక్కదారులు పట్టగలదని. అయినా మనిషికి రాత్రింబవళ్ళు మందులు, మాకులూ నూరుతూ డబ్బు సంపదిద్దామన్న తాపత్రయమేగానీ పెందరాళే పక్కకు చేరదామన్న ఇంగితం లేదు.
అప్పటికీ చెప్పి చూసింది నాకు డబ్బుకంటే మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండడమే ఎక్కువ సంతోషాన్నిస్తుందని! ఆచారి కొట్టిపారేశాడు "నీకంటే ముందు ఇద్దరు పెళ్ళాలతో వేగాను. పెళ్ళయిన ఏడాది వరకే కబుర్లన్నీ. తర్వాత మోజులు తీరాలంటే కాసులు రాల్చాల్సిందే. నేను తయారుచేసే ఆయుర్వేదం మందులకి గిరాకీ ఉన్నన్నాళ్ళూ నాలుగు డబ్బులు వడుక్కోవాలి. మన హస్తవాసి తగ్గిందని మాటొచ్చాక పలకరించే దిక్కుండదు. ఎక్కడెక్కడి పత్రాలు, గ్రంథాలు తిరగేసి మందులు తయారుచేసి ఇస్తున్నాను కాబట్టే ఇంత డిమాండు. సిరి కలిసొచ్చేవేళ అది వదిలుకుని పెళ్ళాంతో సరసాలాడుకుంటూ కూర్చుంటే, తర్వాత నువ్వే తప్పు పడతావు, దెప్పి పోడుస్తావు.
తను వాదించింది "అందరు ఆడాళ్ళు ఒకలాటివాళ్ళు కాదని'' మాటకొస్తే లేమి తనకేమీ కొత్తకాదు. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళే అయితే మూడో పెళ్ళివాడికి ఎందుకు కట్టబెడతారు? పెళ్ళి కాకుండానే జీవితం వెళ్ళమారిపోతుందేమో, అందం, ఆడతనం పుష్కలంగా ఇచ్చిన దేవుడు అవి ఎవరికీ ఉపయోగపడకుండానే తీసుకుపోతాడేమోనని భయపడింది.
అదృష్టవశాత్తు ఎవడో ఒక మగాడు తాళి కట్టడం, తన తాపం తీర్చడం జరిగింది. వయసు పెద్దదే అయినా ఆచారి శారీరకంగా గట్టివాడే. గట్టిదనంతోనే తనను ఆకట్టుకున్నాడు. స్వయంగా చేసే మందులు సేవించడం వల్లనే అలా ఉండగలుగుతున్నాడేమో! నిజానికి ఈయన తయారుచేసే కామ ప్రవర్థక మందులకు మంచి డిమాండుట.
అందుకే ఊపిరి సలపనంత పని. తను ఇక్కడ ఊపిరి బిగబట్టుకుని వేచి ఉన్న విషయం పట్టించుకోనంత పని. ఆయన దేన్నైనా పొడి, పొడి చేస్తున్నా, కలవం నూరుతున్నా తనకేమో ఆలోచనలు. రాత్రి పొద్దుపోయేవరకూ ఇవన్నీ చేసి వచ్చి ఆయన కాళ్ళు పీకుతున్నాయి. చేతులు తీపుతున్నాయంటే ఎలా? ఎదుటివాళ్ళ తీపులు పట్టించుకోవాలా? వద్దా? లేక ఎవరిదారి వాళ్ళే చూసుకోవాలని అర్థమా?
                                                                    *****
తన అవస్థ చూస్తే తనకే జాలి వేసింది నాయుడికి. కళ్ళముందు జాంపళ్ళు ఊగుతుంటే పళ్ళులేని ముసలాడు చొంగ కార్చుకున్నట్లనిపించింది. ఆచారిగారి ఇంటి ముందుకొచ్చి రంగానాయకిని చూసినప్పుడల్లా కొరుక్కుతినాలని, కొల్లగొట్టి తీరాలని కోరిక పుట్టుకొచ్చేది. కాని భయం ... 'తను సుఖవ్యాధుల కోసం మందు పుచ్చుకుంటున్నట్టు ఆచారి గారు తన భార్య దగ్గర చెప్పి ఉంటే?
అడ్డమైన ఆడవాళ్ళ వెంటపడే ఆంబోతుననుకుంటుందేమో?' విలువ తెలిసి నీ దగ్గరకొచ్చాను అంటే ఆడదైనా హర్షిస్తుంది కానీ ఎవరైనా నాకోక్కరే అంటే ఏం మెచ్చుతుంది? తనకీ ఉచ్చం, నీచం తెలియక కాదు. అవసరం అలాంటిది. ఒళ్ళు చేసే మారాం అలాంటిది. గారం గజ్జెలకేడిస్తే ఎమరీ గజ్జెలదాన్ని అప్పగించాల్సిదేగా! సందు చూసి ముందడుగు వేస్తే రంగనాయకి ముందుకొస్తుందా? చిందులేస్తుందా? ఒకే వీధిలో ఉంటున్న వాళ్ళం కాపురం ఉంటున్న చోట అల్లరి పడితే రేపు తలెత్తుకుని తిరగడం ఎలా?
పదిమందిని చూసిన వాణ్ని కాబట్టి రంగనాయకి కళ్ళలో ఆకలీ, ఆహ్వానం కనబడకపోలేదు.,ముసలి మొగుడి పెళ్ళాం కాబట్టి అందివచ్చే పండులా అనిపించడంలో ఆశ్చర్యమూ లేదు. కాని ఆచారి డానికి తగ్గ బందోబస్తు ఏదో చేసుకునే ఉంటాడు. ఊళ్ళో అందరికీ మందులిచ్చేవాడు తన శక్తి పెరగడానికో, ఆమెకు ఆసక్తి తరగడానికో మందులు వాడకుండా ఉంటాడా?
అందుచేత పెదాలు తడుపుకుంటూ వెకిలి చూపులు చూడడం తప్ప తనకి వేరే దారిలేదు అనుకుంటున్నప్పుడు రోజు అనుకోకుండా అవకాశం వచ్చింది. మధ్యాహ్నం వెళ్ళి ఆచారిగారు కనబడకపోతే ....
"
ఆచారిగారు లేరాండీ?'' అనడిగాడు.
"
ఆయనతో పనుండి వచ్చారా?'' రంగనాయకి నొక్కుతూ ...
"
ఆయనతోనే కదండీ పని ... వేరేవారితో ఉంది కనుక?'' అన్నాడు ఆశగా చూస్తూ.
"
కలిపించుకుంటే అందరితోనూ పనిబడుతుంది''
"
కలవనిస్తేగా కలిపించుకోవడానికి''
మాట నిజమే. ఎవరైనా ఇంటికి రాగానే ఆచారి 'లోపలికెళ్ళు' అంటూ తరిమేస్తాడు. అతను ఇల్లు కదిలే సందర్భాలు అరుదు. ఇక కావాలన్నా అవకాశం చిక్కేదెలా?
కొంచెంసేపాగి "మందు చాలాకాలంగా తీసుకుంటున్నట్టున్నారు ... మీ రోగం కుదిరినట్టేనా?'' అందామె చిలిపిగా.
అతడు నవ్వి "మీవారి హస్తవాసి అలాంటిది'' అన్నాడు.
"
ఇకమీదైనా జాగ్రత్తగా ఉంటారా?''
అతను గతుక్కుమని "మీకన్నీ చెప్పేశారా?'' అన్నాడు ఆందోళనగా.
"
ఆహా! అందుకనే పథ్యం జాగ్రత్తగా తీసుకోమంటున్నాను''
"
అంటే?''
"
బజార్ల వెంటబడకుండా ఇరుగూ పొరుగూతొ సరిపెట్టుకోమని'' అంది పెదవి నొక్కుకుంటూ.
అతనికి ధైర్యం వచ్చింది. "వాళ్ళు ఒప్పుకోవద్దూ?'' అన్నాడు ఆమెను ఎగాదిగా చూస్తూ.
"
కృషితో నాస్తి ...''
"
ఖుషీ'' అని పూరించాడు.
"
రాసికులే''
"
అందుకేగా మందులు అవసరం పడ్డాయి. ఆఫ్ కోర్స్ ఇప్పుడవన్నీ తగ్గిపోయాయనుకోండి. బలానికి మందులు తీసుకొంటున్నాను.''
"
బలం సంపాదించి ఎవరి ఎదాన గుమ్మరిద్దామని?''
"
ఎదను కుమ్ముదామని అనండి'' అంటూ ఆమె వక్షంకేసి చూశాడు. ఘనంగా ఉంది ...
ఆమె పైట సర్ధుకుని "మీరు చూపులతోనే పని చేసేట్లున్నారు. వేళా పాళా అక్కర్లేదా?'' అంది.
"
వేళకు రమ్మంటారు పోనీ'' అన్నాడు చేయి పట్టుకుని. చేతిని సుతారంగా వదిలించుకుంటూ గురువారం సాయంత్రం ఆయన భజనకు వెళ్తారు. ఇంట్లోకి రాకూడదని చెప్పి నేను ఇంటిపట్టునే ఉండిపోతాను. మీరొస్తే ఏదైనా ఉపాయం ఆలోచించి ఉంచుతాను. ఇప్పటికి వెళ్ళిరండి'' అంది తలుపు మూసేస్తూ.
ఇన్నాళ్ళూ రంగానాయకిని చూస్తే గుటకలు మింగినా ఇవాళ ఆమె చూపిన చొరవ మింగుడు పడలేదు నాయుడికి. 'దేనికిదంతా? కొంటూ పరవడానికా? కొంగుపట్టుకుని ఆడించడానికా? తన సంగతి తెలిసీ తనంటే ఎందుకు తపించాలి? ఏమో కారణం ఉందొ? నలుగుర్ని రుచి చూసినవాడే నారీ హృదయం తెలిసి మసలుకొంటాడని అనుకుందేమో? అవకాశం రావాలేగానీ ఆమెను నిరాశపరచడం జరగదు అనుకున్నాడు.
గురువారం సాయంత్రం అతను రాగానే ఆమె మధ్యగదిలోకి తీసుకుపోయింది. అతను తనివితీరా గట్టిగా కౌగిలించుకున్నాడు. కాని ఆమె సుతారంగా విడిపించుకొంటూ, చిరునవ్వుతో అంది "మీరింకా బలానికి మందులు వాడాలి కాబోలు''
ఒక్కసారి మనస్సు చివుక్కుమంది. ఆమె అన్నమాట నిజమే. ఆమె అవయవసౌష్టానికి తను చాలడేమో. తనకీ నలభై దాటాయి. పెళ్ళాం తృప్తిపడకపోయినా నోరు విప్పి చెప్పదు. డబ్బు పుచ్చుకుంటారు కాబట్టి బయటివాళ్ళు తృప్తి నటిస్తారు. కాని అలాంటి మొగమాటం ఈమెకేముంది? ఉన్న నిజం చెప్పేసింది.
"
ముందు చాలా దృఢంగా ఉండేవాణ్ణి ... మధ్య జబ్బుపడి ...''
"
నాకు తెలుసు మీ జబ్బులు. ఛాతీ చూస్తేనే నాకు సై అంటే సై అనేట్టున్నారని అర్థం చేసుకున్నాను. వీధిలో మీ అంత తెగింపు కూడా ఎవరికుంది కనక. కానీ నా బాధ నాది. వాటేసుకుంటే వళ్ళంతా హూనం చేసేవాడు కావాలి నాకు''
"
నిజమే మరి ఆచారిగారి నడిగి మరో మందు ...''
"
ఆగండాగండి ... ఆయన మందు తీసుకుని బలం చేకూర్చుకుని వచ్చేదాకా మనకు ముద్దూ ముచ్చటా ఉండొద్దా?''
"
ముచ్చట మాటెలా ఉన్నా ముద్దులు మాత్రం ...''
"
మీ ఉబలాటం నాకు తెలియదా? అందుకనే నోనొకటి చెప్తా! జాగ్రత్తగా వినండి. ఇదిగో తాళపత్రం ... మా పుట్టింట్లో ఉన్న తంత్ర గ్రంథాల్లో దొరికింది. మూలగుంట ఆకు ఏకాదశి నాటి రాత్రి కోసి శ్మశానంలోకి వెళ్ళి దాన్ని నూరి ...''
"
వివరాలన్నీ ఎందుకులే, అవన్నీ చేస్తే ఏమొస్తుంది?''
"
మందు సేవిస్తే మగాడికి అమోఘమైన శక్తి వస్తుంది. ఆడదైనా తగులుకుందంటే ప్రాణం పోయినా విడిచిపెట్టదు.''
"
అయ్యబాబోయ్ మరి మందు ఎక్కడ? ... ఎలా?''
"
వస్తున్నానుందండి ... ఇది పట్టుకెళ్ళి మా ఆయనకిచ్చి మందు తయారు చేయమనండి. కోరినంత డబ్బు ఇస్తాననండి. ఆయన డబ్బాశకొద్దీ ఒప్పుకుంటాడు. మొత్తం ఆరు మోతాదులు ... అంటే ఆరు ఏకాదశులు. రాత్రిళ్ళు ఆయన గంటా రెండు గంటలు ఉండరు. మనక్కాస్త ఏకాంతం ... ఆయనక్కడ శ్మశానంలో పొడి చేస్తూ, తడి చేస్తూ ఉంటే పని మీరు ఇక్కడ చేద్దురు గాని'' అభిమయ సహితంగా వివరించింది రంగనాయకి.
నాయుడు వెర్రెక్కిపోయాడు "బ్రహ్మాండంగా ఉంది. ఎంత డబ్బు కావాలన్నా పడేస్తాను. ఏదీ తాటాకు పత్రం?''
"
ఇదిగో ఎవరో సాదువిచ్చాడని చెప్పండి''
నాయుడుకి హఠాత్తుగా సందేహం వచ్చింది ... " మందు మీ ఆయన కూడా తీసుకుంటే? అప్పుడు నా దగ్గరికి రావా?''
రంగనాయకి మొహం ఎర్రబడింది. "ఏమిటి మీ ఉద్దేశ్యం? ఆడదానికి ముందు మాంసం ఉంటుందని తప్ప దాని వెనుక మనసు కూడా ఉంటుందని మీ మగవాళ్ళకి ఎప్పటికీ అర్థం అవుతుంది? మనసుపడి మీ దగ్గరకు వస్తే లోకువైపోయానన్నమాట. మీ దగ్గరకు ఎందుకు రావాలన్న సందేహమే రాలేదా? మందూ వద్దూ, విందూ వద్దు వెళ్ళిరండి'' అని ఏడుస్తూ తాటాకు పత్రం లాక్కోబోయింది.
నాయుడికి ఏడుపు వచ్చింది. అంది వచ్చింది అంతర్థానమై పోయినట్టనిపించింది. కాళ్ళు పట్టుకున్నాడు, ఒట్లు వేశాడు. రంగనాయకి హృదయమే తప్ప శరీరం అక్కర్లేదన్నాడు. తను రానిచ్చినంత వరకే వస్తానన్నాడు.
చివరికి రంగనాయకి శాంతించింది. పెదాలపై చిన్న ముద్దు పెట్టి పంపించింది.
                                                       *****
నాయుడు ఇచ్చిన తాళపత్రం ఆచారి శ్రద్ధగా చూశాడు. "ఇందులోని మందులన్నీ వీర్యవృద్ధికే. అర్థరాత్రి పూజలెందుకు? పత్రం వెనకాల నోరు తిరగని మంత్రాలు పఠించాలనడం ఎందుకు? తంత్ర పూజలంటే ఇంతే కాబోలు. ఎందుకొచ్చిన గొడవ అనుకొన్నా నాయుడిస్తానాన్న సొమ్ము విన్నాక కాదనబుద్ధి కాలేదు. పనిలో పనిగా ఒక గంట లేటైనా ఎక్కువ మోతాదులో చేసుకుంటే నాయుడిలాంటి వాళ్ళకి డబుల్ రేటుకు అమ్మ్ముకుని ఇంకా డబ్బు చేసుకోవచ్చు.
మరి రంగానాయకిని రాత్రి విడిచిపెట్టి వెళ్ళడం ఎలా? అసలే తలుపులు, గడియలు సరిగ్గా లేవు. పక్కింటావిడ్నిసాయం పడుకోమంటే? వద్దు, అర్థరాత్రి శ్మశానంలో పూజలని తెలిసిందంటే చేతబడి చేస్తున్నాననుకుని గొడవ చేస్తారు. రంగానాయకినే ఎలాగో జాగ్రత్తగా ఉండమంటే సరి!
                                                                   *****
నాయుడు పెద్ద మనిషే ... మోతాదు ఇవ్వగానే దాని డబ్బు చేతిలో పెట్టేస్తున్నాడు. రెండు మోతాదులు సరిగ్గా పడ్డాయి. మూడో మోతాదు చేస్తున్నప్పుడే ఇబ్బంది వచ్చిపడింది.
శ్మశానానికి వెళ్ళాక చూస్తే కల్వం కనబడలేదు. సంచీలో పెట్టినట్టే గుర్తు ఎలా మిస్సయ్యిందో? ఈసురోమంటూ ఇంటికి తిరిగిరాక తప్పులేదు.
తలుపు తట్టబోతుండగా నాయుడి నవ్వు వినబడి ఆగిపోయాడు.
'
అమ్మదొంగా! ఇద్దరూ కలిసేనన్నమాట ... ఎంత కాలంగా సాగుతుందో? ఎంత దూరం పోయిందో? ఓపిక పెడితే అన్నీ తెలుస్తాయి ...'
"
గట్టిగా నవ్వినా ఫర్వాలేదు ... మీ ఆయన్ని అనుకొంటార్లే'' నాయుడు అంటున్నాడు.
"
ఆయన నవ్వరు ... నవ్వే టైములో మందులు నూరుతుంటే నాలుగు డబ్బులు వస్తాయనుకుంటారు.''
"
పోనీ నువ్వు నవ్వు ... నవరత్నాలు రాలుతాయి''
"
మా ఆయన్తో అనేరు! నవరత్నాలూ అమ్ముకోగలరు''
ఆచారికి మనస్సు చివుక్కుమంది 'తనంతటి ధనపిశాచా?'
"
మరి నువ్వు అలా పెదాలు బిగించి కూచుంటే నా పెదాలు పెట్టి ఇంకా బిగించబుద్దేస్తుంది''
"
మారా పని చేయరేం? ఆయన తిరిగొచ్చేదాకా కూచుంటారా?''
సీసాలోంచి బిరడా తీసిన చప్పుడు వినబడింది.
"
పైన పెదాలు పనిచేస్తుంటే కింద చేయి కూడా పనిచేయాలా? ఏమిటది వెదుకుతోంది లంగా బొండా?'' అంటోంది రంగనాయకి.
"
మరి ఎన్నాళ్ళైనా పైపైనే సరిపెట్టుకోమంటావా?''
"
అదిగో మళ్ళీ మాట తప్పుతున్నారు. నేనెప్పుడంటే అప్పుడే అన్నారు కదా? నేను మాత్రం అసలొద్దన్నానా? మందు ఆరు డోసులు అయ్యాక అంటున్నాను మన ప్రథమ సమాగమం చిరస్మరణీయంగా ఉండాలి. ఎన్ని జన్మలైనా సరే అది తలుపుకు రాగానే పులకింత రావాలి. ఒళ్ళు పులిసిపోయింది గుర్తుకు రావాలి. ఆరో డోసులు అయ్యేదాకా ఆగాల్సిందే''
"
సరే నీ ఇష్టమే కానీ ...''
ఆచారికి విషయం అర్థమైంది. జరిగిందేదో జరిగింది. జరగబోయేది ఆపితే మంచిది. తలుపు కొట్టి అల్లరిపెట్టి అల్లరి పడే బదులు గంటాగి వస్తే మంచిది. పదిమందికీ తెలిస్తే తననే తప్పుబడతారు. వయసులో పెళ్ళాడినందుకు ఎవరూ జాలిపడరు. నిజానికి తనదీ తప్పుంది. అప్పటికీ రంగనాయకి చెప్తూనే ఉంది. డబ్బు కాదు నాకు కావాల్సింది మనిషేనని వెంటనే ఇల్లు మార్చేసి నాయుడికి దూరంగా వెళ్లిపోవాలి. మందు, గిందూ చెయ్యనని చెప్పేయాలి. డబ్బుకి కక్కుర్తి పడితే పెళ్ళాం దక్కదు.
                                                                  *****
ఇల్లు మారుద్దామని మర్నాడు భర్త చెప్పినప్పుడు రంగనాయకి నవ్వుకుంది. తను కల్వం దాచేసి, మంచిపని చేసిందని తన మొగుడికి తన దగ్గరకు రాప్పించుకొనే పథకానికి తెలియకుండా సాయపడిన నాయుడికి మనస్సులోనే కృతజ్ఞతలర్పించింది.
ఇదీ రంగనాయకి కథ. మళ్ళీ ఆర్నెల్లకు తిరిగి వచ్చేసరికి రాజ్యలక్ష్మి కనబడింది.

No comments:

Post a Comment