పళ్ళున్న చెట్టుమీదే చిలుకలు వాలును …! సంద్రమున్న చోటే ఓడ దోగాలుంటారు … !! ‘ఒన్ ఫర్ సారా … టూ ఫర్ జాయ్ …’ పుడుకులాం రాసుకుంటూ హమ్ చేసుకుంటున్న ఆరాధానని అడిగాడతను …. మళ్ళీ “అడిగేది నిన్నే ఒక్కదానివే సిన్మాకి వెళ్ళావా …?’’
“యస్ …!’’ అద్దంలోంచి అతనికేసి చూస్తూ చెప్పింది.
“ఒక్కదానివే ఎలా వెళ్ళావ్ …?’’ ఇందాకటి అసహనం ఇప్పుడు నీరసంగా మారింది.
“ఇద్దరూ కలిసి చేయాల్సిన పనులు కొన్ని, ఒక్కళ్ళే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయ్! బట్ సిన్మాకి వెళ్ళడం …’’ అంటూ నవ్వింది.
ఒళ్ళు మండి, వెళ్ళిపోదామని లేచి గబగాబా తల దువ్వుకోసాగాడు.
“నేను దువ్వుతానుండు …’’ అతని చేతిలో నుండి దువ్వెన తీసుకోబోయింది,
“అఖ్ఖర్లేదు … నా పని నేను చేసుకోగలను …’’
“ఎవరి పని వాళ్ళు చేసుకునే మగాళ్ళంటే నాకు ముందు అసహ్యం .., తర్వాత జాలి …’’
“నాటీ గాళ్ …’’ ఆమె భావం అర్థమై నవ్వి, ఆమెకి దువ్వెనిచ్చాడు.
“దట్స్ గుడ్ … కొన్ని కొన్ని పన్లు అందమైన ఆడపిల్లలే చేయాలోయ్ …’’ తల దువ్వుతూ అందామె.
“నువ్వసలు ఆడపిల్లవేనా …?’’
చేస్తున్న పనిని ఆపి, రెండడుగులు వెనక్కి వేసి క్రింద నుంచి పైకి తనను తాను విచిత్రంగా చూసుకుని అర్థం కానట్టు ముఖం పెట్టుకొని మళ్ళీ పైనుంచి క్రిందకు చూసుకొని …”ఏమ్మా నాకేం తక్కువ అయ్యింది …?’’ చాలా మురిపెంగా అడిగింది కళ్ళార్పి!
“అందరాడపిల్లల్లానే రెండు కళ్ళూ, రెండు పెదాలు, రెండు చేతులు … రెండు … కావాలనే ఆగింది …’’
“స్టాప్ …! స్టాప్ …! నేనడిగింది ఆ ఆడతనం గురించి కాదు …’’ విసుగ్గా అన్నాడు.
“హా హా …! ఆ విషయం గురించా …?’’ అపుడప్పుడే అతడి భావం అర్థమైనట్టు తియ్యగా నవ్వి “అదే అయితే ఏ మగాడ్నయినా పిలువ్ … తెలుస్తాడు! అయినా ఎవరి దాకానో ఎందుకు నువ్వున్నావుగా …’’ ఒక్కో అడుగు అతనికేసి వేసింది.
“ఆడాళ్ళు కూడా తాగుతారా …? అతను వింతగా అడిగాడు.
“ఏం పాపం వాళ్ళకి నోరు, కడుపు లేవా …?’’ ఆరాధన సిప్ చేస్తూ అడిగింది.
“అలా అని కాదు … సరే కానీ నీకో విషయం’’ అడిగాడతను. ఆమె గ్లాసులో తెల్తున్న ఐసు క్యూబ్ ని చూస్తుంది.
“నేన్నిన్ను ప్రేమిస్తున్నాను …’’ చెప్పాడతను.
“పెళ్ళి చేసుకుంటావా …?’’ కూల్ గా అడిగిందామె.
“ఛ …! తుచ్చమైన పెళ్ళిలో ఏముంది? మొగుడు పెళ్ళాలవ్వటం, కీచులాడుకోవటం, పిల్లలు, ఏడ్పులు, ట్రాష్ … నా ప్రేమ అమరమైనది. కలకాలం నిలుస్తుంది’’ ఎమోషనల్ గా చెప్పాడు.
“చూడు …! ప్రేమ పెళ్ళి దాకా వెళ్ళక్కర్లేదు … పార్కుల దాకా … హోటళ్ళ దాకా వెళితే చాలు అని ఏ టీనేజ్ అమ్మాయికో చెబ్తే ఉన్న పళంగా ఫ్లాట్ అయిపోయి పడకింటి దాకా వచ్చేస్తుంది. అంతేగానీ నా వయసులో వున్న ఏ ఆడదీ నమ్మదు….’’ చేతిలో గ్లాసుని టీపాయ్ మీద పెట్టేస్తూ చెప్పింది.
“అది కాదు …’’ అతను నసిగాడు.
“అది కాదు … కాదు … అదే …! నేను తెల్సుకోలేనని అనుకోకు … సూటిగా చెప్పు నీకేం కావాలో …?’’
“తెలీదు …’’ సిన్సియర్ గా చెప్పాడు – చెప్పాలనుకున్నాడు.
“హా ! మరేం పాపం ! అమాకుడివి బోర్లా పడుకోవడం కూడా తెలియదు …’’ వెక్కిరించింది.
“తెల్సో లేదో చూద్దూ గాని …’’ కవ్వించాడు.
“ఆ చూపించే సంగతే కావాలని డైరెక్ట్ గా అడగొచ్చుగా …’’
“నాకు తెలీదు … నీకంత పచ్చిగా చెప్పాలని …’’ కసిగా అన్నాడు.
ఆమె అతనివైపు డీప్ గా చూసింది …. పక్క ఫ్లాట్ లో వుంటూ, పెళ్ళాం పురిటికని పుట్టింటికి వెళ్ళగానే సరాసరి తన బెడ్ రూమ్ లో కొచ్చిన ధీరుడు …. వీడికేం చెప్పాలి …? “వెళ్ళిపోవోయ్ ….’’ నిదానంగా చెప్పింది.
“ఎందుకు …? ఇప్పుడు నీకోసం ఎవడయినా వస్తాడా …?’’
“వస్తే నే చూసుకోగలనా సంగతి’’ చెప్పింది.
“మరి …’’
“మీ ఆవిడకీ సంగతి తెలిస్తే ….’’
“వ్వాట్ నాన్సెన్స్ …’’
“మరేం లేదు … సిఫిలిస్ కి ఈరోజే ఆఖరి ఇంజెక్షన్ తీసుకున్నా …’’
“అబద్ధం …’’ “చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంతగా కావాలంటే ఆయామ్ రెడీ! కమాన్ మై డియర్ బోయ్ … వెహికల్ ఆర్ కెప్ట్ ఎట్ వోనర్స్ రిస్క్ … తర్వాత నన్ను బ్లేమ్ చెయ్యొద్దు …’’ నవ్వింది.
అతనికి నోట మాట రాలేదు. “నా ప్రొఫెషనల్ ఎతిక్స్ నేను మర్చిపోను …’’ అతను కాల్తో టీపాయ్ ని తన్ని వెళ్ళిపోయాడు.
ఆమె నవ్వింది … కన్నీళ్ళు వచ్చేదాకా …!
అదేమిటో చిత్రం … నవ్వినా కన్నీళ్ళే … ఏడ్చినా కన్నీళ్ళే …
*****
“రియల్లీ యు ఆర్ వండర్ ఫుల్ ఇన్ బెడ్ … పుడుతూనే నేర్చుకున్నావా …? అడిగాడతను.
“యు సిల్లీ బోయ్ … పుడుతూనే చాలా పన్లు రావు’’ నవ్విందామె.
అతనూ నవ్వాడు.
“లాంగ్ లెగ్స్ గాళ్ ఆర్ గుడ్ సెక్స్ బర్డ్స్ …’’ అతని చేయి ఆమె తొడ మీదుగా జరుగుతుంది. కాళ్ళు పొట్టిగా ఉంటే ఆ అమ్మాయి మంచి డాన్సర్ అవుతారట … ఎవరు ఎవరన్నారీమాట ? ఆలోచిస్తోందామె …
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ….
“ఎవరో బజర్ కొడుతున్నట్టున్నారు …’’ చెప్పాడతను.
ఆమె గబగబా నైటీ వేసుకుంది. “యు ఆల్సో గెట్ డ్రెస్ డ్ …’’ బయట గదిలోకి వెళుతూ చెప్పింది.
అర నిముషంలో చాలా మామూలయిపోయి తలుపు తీసింది. ఎదురుగా వున్న వ్యక్తులందరినీ ఒక్కసారిగా చూసి బిత్తరబోయింది. మరుసటి క్షణంలో తేరుకుని అప్రయత్నంగా ప్రక్కకు జరిగింది. ఒకరి తర్వాత ఒకరు గబగబా త్రోసుకుంటూ, థియేటర్లోకో, ఆడిటోరియంలోకో వచ్చినట్టుగా లోపలికి వచ్చేశారు. ఇంతలో లోపల ఉన్న అతను బయటికి వచ్చేసాడు. ఇంతమందిని చూసి తడబడ్డాడు.
“ఎవరతను ..?’’ ఓ నడివయస్కురాలు సూటిగా అడిగింది.
ఆరాధన మాట్లాడలేదు.
“అతనికీ, నీకు ఏమిటి సంబంధం?’’ ఇంకో ఆవిడ అంది.
అందరూ ఒక్కసారిగా ఎందుకు వచ్చారో ఆరాధనకి అర్థం కావట్లేదు. ఇంతలో ఎవరో మరి తొందరపడ్డారు. “కథలల్లబాకు …రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని అబద్ధాలు చెప్పబాకు … సూటిగా చెప్పు ఏ సంబంధమూ లేకుండానే రాత్రుళ్ళకి రాత్రుళ్ళు కలిసి వుంటున్నారా …?’’
“అబ్బే … ఏ సంబంధమూ లేదని నేనన్లేదే …’’
ఆమె ఏమీ అనకపోవడంతో వచ్చినవాళ్ళందరికీ బోల్డంత ధైర్యం వచ్చేసింది. ఒకరి తర్వాత ఒకరు విజృంభించసాగారు.
“ఏమిటిది … హద్దూ ఆపూ లేకుండా పగ్గపగలే … హవ్వ’’ ఒకావిడ కొంగు భుజాలకేసి లాక్కుంది.
“నట్టనడి రాత్రి అయితే ఫర్లేదా …? ఫర్లేదేమోలె మీరంతా కళ్ళు మూసుకుంటారుగా …!’’
“ఏదో ఇన్నేళ్ళకి ఓ కొమ్పంటూ ఏర్పరుచుకున్నాం … చచ్చీ … చెడీ …’’ ఓ పెద్దావిడ! చంపారు పొండి! చచ్చీ, చెడీ వచ్చాక చెడేదేమిటి …?
“అమ్మాయ్ …! మేమిక్కడ సంసారాలు చేసుకోవాలా …? అక్కర్లేదా …?’’ ఓ ముసలాయన అడిగాడు.
"అయ్యో చేసుకోండి తాతగారూ … నేనేమీ అడ్డు రానే … మడిబట్ట ఇమ్మంటూ మీరు పనమ్మాయి చేయి పట్టుకుంటే ఆ పిల్లేమో మీ చెంప పగలగొట్టింది … పోన్లే ముసలాడు సరదా పడ్డాడు అని ఊరుకోకుండా మీ ఆవిడ మిమ్మల్ని రచ్చకీడ్చింది గానీ నేనేమైనా అన్నానా …?
“ఇలా సంసారుల మధ్య వుండడమేమిటి? వూరి చివర్న ఏదో పంచన పడుండాలి గానీ – మళ్ళీ ముసలాయనే …!
’’నిజమే తాతగారు … కానీ ఎవరి పంచనున్నా మధ్యలో ఈ ఫ్యాంట్ల గొడవ తప్పేట్టు లేదు. ఏం చేయను ….వాళ్ళెందుకొచ్చారో ఆమెకి ఇప్పుడే అర్థం అవుతోంది.
“ఇంత పబ్లిగ్గా ‘షోరూం’ తెరిచి పెట్టుకున్నంత పబ్లిగ్గా ఈ ఫ్లాట్ ని తయారీ చేశావు … బోర్డు ఒక్కటే తక్కువ … మీలాంటి వాళ్ళందరినీ ఏమని అంచనా వేసుకోవాలసలు …’’
"ఓ అడ్డపంచె … ఎపుడయినా నీ ముఖం అద్దంలో చూసుకున్నావా …? నిన్ను చూస్తే నీ పెళ్ళానికి కూడా మూడొచ్చేలా లేదు. ఆవిడే నిన్ను సీలవంతుడిలా వదిలేసి వుంటుంది అని నా అంచనా !
“మాలాంటి వాళ్ళు బయట ఎలా తలెత్తుకు తిరగాలి …?’’ ఓ రిప్రజెంటేటివ్ అడిగాడు.
"నీ ముఖం …! నీకు నెలకు ముప్పై క్యాంపులు- నీకు ముగ్గురు పిల్లలంటే నీ పెళ్ళాన్ని మాత్రమే కంగ్రాట్స్ చేయాలి.
“ఇదిగో మేమంతా సొసైటీ తరపున నీకు చెప్పేదేమీటంటే … నువ్వు ఫ్లాట్ అర్జెంటుగా ఖాళీ చేయాలి. నీలాంటి దాన్ని మాలాంటి మర్యాదస్తులు సహించలేరు.’’
వీడు పెళ్ళాం పుట్టింటికి వెళితే తన పడగ్గదికి పరిగెత్తుకొచ్చేవాడు.
“పిల్లా, జెల్లా వున్నవాళ్ళం … అన్నెం, పున్నెం ఎరుగని వాళ్ళం మగపిల్లలు వున్నారు … చెదగోట్టేయకు తల్లీ …’’ ఓ తల్లి చేతులు జోడించింది.
ఆరాధన పెదవి విప్పలేదు. “అస్సలు ఇళ్ళ మధ్యన ఉన్నదే తప్పు … బరితెగించిన ఆడది ఇంత అందుబాటులో ఉంటే ఏ మగాడికి కళ్ళు మూస్కుని నిద్రపోవాలనిపించదు …’’ ఆమెకి మొదటిసారిగా ఏ మగాడి మీదా రాని అనుమానం అతగాడి మీద వచ్చింది … ఈ ముఖానికి జాకెట్టు, బ్రా విప్పడమయినా వచ్చా అని …..
“ఎక్కడో మంచి వుద్యోగమే వెలగబెడుతున్నట్టున్నావ్ … ఆ సంపాదన సరిపోవట్లేదా … ఇలా మగాళ్ళ మీద పడ్డావ్ …’’ ఆమె మొగుడు తుమ్మినా, దగ్గినా ఆమెకి అనుమానమే. ఆ మొగుడ్ని సాధించడానికి రాత్రిం పగలు తేడాయే ఉండదు.
“ఇదిగో పెద్దాడ్ని నే చెబుతున్నా … నువ్వు ఫ్లాట్ అమ్మేసి వెళ్ళిపోతే అందరికే రొంబ సంతోషం …’’ తనని వుంచుకుంటానని కాళ్ళా, వెళ్ళా పడ్డ అరవ ముసలాయన.
“ఇలా ముంగిలా నిలబడితే సరిపోతుందనుకుంటున్నావేమో … అదేం కుదరదు …. పోలీసుల్ని పిలిపించి పెట్టే, బేడా బైట …’’ సెప్తోన్న ఆమె మధ్యలోనే ఆపేసింది … ఆరాధన నవ్వటంతో.
“ఆలస్యమెందుకు …? కానివ్వండి … హి ఈజ్ రవి కుమార్ …. యస్సయ్ …’’ అంటూ అతడ్ని చూపించింది.
అందరూ నిశ్చేష్టులైపోయి … ఫ్రీజ్ షాట్ లో లా అతడ్ని చూస్తుండిపోయారు.
“యస్ …! మీరెవ్వరూ నన్నేమీ చెయ్యలేరు. ఆయా, దట్ స్ట్రాంగ్! ఇతగాడ్ని చూపించి అన్నలాంటి వాడనో, తమ్ముడు లాంటి వాడనో చెప్పి ఆత్మవంచన చేసుకోలేదు. అది మీకు నచ్చలేదు… నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను …. ధైర్యం వున్న ఆడపిల్లని చూస్తే ఆడాళ్ళందరికీ నీటి సూత్రాలే చెప్పాలనిపిస్తుంది. పాపం …! మగాళ్ళకే వాత్సాయన కామసూత్రాలు నేర్పాలనిపిస్తుంది …. ఇటీజ్ క్వాయిట్ నేచురల్ …’’ ఆగి నవ్విందామె.
“ఆల్రైట్ ఈ బిల్డింగ్ మొత్తంలో ఏ మగాడ్నీ .. మీ తాతో … తండ్రో … భర్తో … బ్రదరో …. కొడుకో … ఎవరయినా కావచ్చు! ఎవ్వడ్నీ నాగుమ్మం తోక్కనివ్వను …. అయి మీన్ నా మంచం ఎక్కనివ్వను … సరేనా …?’’ అందర్నీ అడిగింది.
మగాళ్ళందరూ రక్తపీడనం ఆగినట్లు నిర్ఘాంతపోయి చల్లబడ్డారు. ఆడాల్లె ఎటూ చెప్పలేకపోయారు.
ఆ చెప్పలేక పోయినదానిని ఇందాకటి పెళ్ళాం చెప్పేసింది. “నీ మాట సరే! మా మగాళ్ళు ఏదో వూరి చివరంటే సందేహిస్తారేమో గానీ మరీ ఇలా ప్రక్కనే అనేసరికి మా కంట్లో కారం కొట్టి … కన్ను గప్పి నీ దగ్గరికి వచ్చేస్తారు … అందులో ఏ అనుమానం లేదు …’’
ఆడాళ్ళంతా రిలీఫ్ గా వూపిరి పీల్చుకుంటుండగా ఆరాధన ఫక్కుమని నవ్వి అడిగింది …
“నాకు తెలియని సంగతి అదే … మరో ఆడదాని ప్రక్కలో పడుకొంటాడని తెలిసినా ఆ మగాడితో జీవితమంతా కల్సుంటారు …మరి …. మరి ఈ ఆడదాన్నెందుకు మీ ప్రక్కన బ్రతకనివ్వరు …?’’

No comments:
Post a Comment