అలవోకగా కదిలి, అప్రయత్నంగా పైట చెదిరి, ముగ్ధమనోహరమైన, ముద్దు సింగారమైన ఆమె అందాల ముందు, అతని బ్రహ్మచర్యానికి చెక్.
అ ... ప్రయత్నంగా అలా ఆమెను చుట్టి, కౌగిలిలో బిగపట్టి, ఉచ్చ్వాస నిశ్వాసాలను నిష్వాసించిన అతని రొమాంటిక్ థెరపి ముందు ... ఆమె కన్యత్వానికి చెక్.
అతని ఘోటక బ్రహ్మచారి, ఆమె కర్కోటక బ్రహ్మచారిణి. వాళ్ళిద్దరి బ్రహ్మచర్యానికి ... పెళ్ళితో చెక్.
****
ఒక్క క్షణం ఆమె వంక చూసి చిన్న కలవరానికి లోనయ్యాడు ముప్పయి ఆరేళ్ళ గోపీనాథ్, ఫిజియోథెరపిస్ట్ గా అతనికి మంచి పేరుంది. ఎప్పుడూ గంభీరంగా ఉందే అతనిలో ఓ ఇంట్రావర్ట్ దాగి ఉన్నాడని, అతడిని తెలిసిన సన్నిహితులు అంటూ ఉంటారు. ఇంకా పెళ్ళి కాలేడు.
"ఎక్స్ క్యూజ్ మీ ...''
ఆమె పేరు గోపిక, వుఅసు ముప్పయి వరకూ ఉంటుంది. థర్టీప్లస్ లో ఉన్నా ఆమెకింకా పెళ్ళికాలేదు. ఆమె పెళ్ళి చేసుకోకపోవడమే అందుకు కారణం తప్ప, ఆమెను పెళ్ళాడేందుకు ఎవ్వరూ రాకపోవడం కాదు. అందంగా ఉంటుంది, ఆమె అందానికి కళ్ళజోడు మరింత అందాన్ని సంతరించి పెట్టినట్టు అనిపిస్తుంది.
గోపీనాథ్ ఆమె పిలుపు విని, ఆలోచనల్లో నుంచి తేరుకున్నాడు. ఆమెనెక్కడో, ఎప్పుడో చూసిన గుర్తు ...
కానీ అతనికి గుర్తురావడం లేడు. ఆమె తన పేషెంటా? క్లాస్ మేటా? ఊహు ...
"హలో ... మిస్టర్ గోపీనాథ్ మీరే కదా ...?'' ఆమె ఈసారి కాస్త అసహనంగా అడిగింది.
"యస్ ...'' అన్నాడు గోపీనాథ్.
"ఫిజియోథెరపీ కోసం వచ్చాను ...'' అంది ముక్తసరిగా "డాక్టర్ మిత్ర రిఫర్ చేసారు''
"ఓహ్ ...'' అంటూ ఒక్క క్షణం ఆమె ఇచ్చిన రిపోర్ట్స్ చూస్తున్నట్లు నటిస్తూనే ఆమె వంకే చూడసాగాడు.
ఆమె వయసి థర్టీ ప్లస్ అయినా, ఆమెను చూస్తుంటే మిస్సందాలు, ప్రౌఢందాలు మిక్స్ అయి, మిస్సయిన అందాలేవీ ఆమెలో మిస్సవ్వలేదని తెలుస్తోంది.
*****
"ఇదిగో ఈ చేయి ... ఇలా ... ఇలా పెట్టాలి'' ప్రయత్నమో, అప్రయత్నమో ... ఆమె సుకుమారమైన కుడిచేయి, అతని కుడిచేతిలో బిగుసుకుంది.
సుతిమెత్తని ఆ చేతివ్రేళ్లు ... అతని బ్రహ్మచార్యపు కుదుళ్ళకు తగిలి ... అతని బ్రహ్మచర్యాన్ని పెకలించే ప్రయత్నం చేస్తున్నాయి.
*****
"ఏంటీ ... మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ ఫిజియోథెరపీ ఇలానే చేస్తారా?'' మూడవ రోజు కూడా వచ్చి అడిగింది. అప్పటికే వాళ్ళిద్దరి మధ్యా కాస్త చనువు పెరిగింది.
"నేను ఘోటక బ్రహ్మచారిని'' అన్నాడతను.
"ఆఫ్ కోర్స్ ... నేను కర్కోటక బ్రహ్మచారిణిని ...'' అని
"ప్రేమ ... పెళ్ళికి, నాకూ పాకిస్తాన్ ప్రెసిడెంట్ జపించే శాంతి మంత్రానికీ, చేతలకూ ఉన్నంత తేడా ఉంటుంది'' గోపిక చెప్పింది.
",,, నాదీ సేమ్ ఫీలింగ్ ...'' అన్నాడు ఆమె ఎక్సర్ సైజులు ఎలా చేయాలో చెబుతూ.
"ఇలా ఎక్సర్ సైజులు చేస్తే నా ప్లాబ్లెం క్లియర్ అవుతుందా?'' అడిగింది గోపిక.
*****
"వెన్నెల రాత్రి ...
వెచ్చని కౌగిలి ....
మల్లెపూల కాంబినేషన్, మత్తెక్కించే రొమాంటిక్ మూడ్స్ కోపరేషన్ ... ఎంత బావుంటుందో కదా ... సరసమైన కథలో రాస్తారు కదూ .. రైటర్స్ అలాగే అంటారు కదూ ...''
"కథలో రాస్తారని రైటర్స్ ని అలా ఊహించుకోవద్దు. అందమైన ప్రపంచాన్ని పాఠకుల ఊహల్లో పోసే వాళ్ళే రైటర్స్ ... అందరి తలరాతలను బ్రహ్మదేవుడు రాస్తే, దంపతుల మధ్య మధురోహాలను రాసే ఛాయిస్ రతీమన్మథులకు ఇచ్చాడట బ్రహ్మ.
బద్దకించిన రతీమన్మథులు, మిస్సయిన దంపతుల మధురోహాలను గుర్తు చేయమని, సరసమైన కథలు రాసే రైటర్స్ ని రిక్వెస్ట్ చేసాడు. రైటర్స్ అందమైన మధురోహాలను మధురమైన మృదువైన రోమాంచిత కథలుగా రాస్తున్నారు. ఒక విధంగా బ్రహ్మ మనుషులను సృష్టిస్తే ... ఈ రైటర్స్ పాత్రలను సృష్టిస్తున్నారు. మధురోహాలను ప్రోది చేస్తున్నారు. రోమాన్స్ రాసే రైటర్స్ ని రొమాంటిక్ దృష్టితో చూడొద్దు. అడ్మైరింగ్ గా చూడాలి. అంతే'' తర్జనితో అతని నుదురు మీద వార్నింగ్ సిగ్నేచర్ చేస్తున్నట్టు అంది గోపిక.
ఆమెనాలాగే దగ్గరకు లాక్కున్నాడు అతను.
ఆమె నడుం ఒంపు అతని పెదవులకు చిరుమజిలీ అయింది. అతని మనసు, ఆమె శరీరానికి రొమాంటిక్ థెరపీ చేస్తోంది. ఆమె చదివిన సైకాలజీ అతన్ని స్టడీ చేస్తోంది.
శబ్దం కన్నా నిశ్శబ్దం చాలా ఉద్వేగంగా ఉంది.
ఆమె థెరపీ పేరుతొ అతని పాలిట మాగ్నెట్ అయింది. అతను ఆమె సైకాలజీ ట్రీట్ మెంట్ తో ఆమె పాలిటనాథుడే అయ్యాడు. గోపికానాథుడు అయ్యాడు.
*****
ఫస్ట్ నైట్ ...
షరా మామూలే ...
అగరొత్తులు, మల్లెల పరిమళాలు ... స్వీట్స్, పాలగ్లాసు, తెల్లచీర ... అన్నీ క్వయిట్ నేచురల్లే ... ఆమె తలపులన్నీ వలపుల ఆలోచనలే.
అతనామెకోసమే ఎదురుచూస్తున్నాడు ....
*****
"అబ్బ నీకోసం గంటనుంచీ ఎదురుచూస్తున్నాను. విరహంతో గ్యాస్ మీద మరిగే నీరులా ఉంది బాడీ''
"మీకు పోలికలు రావు ... అదే తిలక్ అయితే ఏమనేవాడో తెలుసా ...?''
"నువ్వా సైకాలజీ చదివావు, భావుకత్వాన్నీ చదివావు, నాకా తిలక్ లు అర్థం కారు ...''
"కానీ నాకు మీరు అర్థమవుతారు. మీరిప్పుడు గోపీలోలురు .... అదే గోపీనాథులు ... నాథా అంటే పతి ... భర్త ... నాథుడు ... అని అర్థమట. ఈ గోపికకు ఆల్ ఇన్ వన్ మీరే ... అందుకే గోపికానాథులు ... గోపీనాథులు ...'' అంది.
అతను మాట్లాడలేదు. అది మాటల సమయం కాదని తెలుసు.
*****
ఇద్దరిమధ్యా కోరికల జ్వాల జ్వలనమైంది, ప్రజ్వలమైంది, కాంక్షాభరితమైన శరీరాలు, అనచ్చాధాలై ... పొరపొచ్చాలు లేని శృంగార యుద్ధానికి ఆయత్తమవుతున్నాయి. సృష్టి నియమాన్ని కొనసాగిస్తున్నారు.
ఆమె కఠోర బ్రహ్మచర్యానికి అతను చెక్ చెప్పాడు. అతని ఘోటక బ్రహ్మచర్యానికి ఆమె చెక్ చెప్పింది.
అతనామె హృదయభాగమ్మీద అలుముకున్న స్వేదాన్ని, తన పెదవులతో తుడిచేసాడు. అతని నడుము ఆమెకు ఆసరాగా మారింది.
ఆమె శరీరం అతనికి నులివెచ్చని పానుపే అయింది. రెండు ఉద్వేగాల మధ్య ఒక తృప్తి సాకారమైంది.
రెండు ఉచ్చ్వాస, నిశ్వాసాల మధ్య ఒక అనుభవం ఆవిష్కారమైంది.
రెండు శరీరాల మధ్య ఒక కాంక్ష దీర్ఘంగా విశ్వసించి, అనుభవం నుంచి అనుభూతివరకూ పయనించింది. కోరికలోని వెచ్చదనాన్ని స్పృశించింది.
*****
మూడో రాత్రి ముచ్చట ముగిశాక, బిడియాలన్నీ సడిలేక చెప్పింది గోపిక, గోపీనాథుడితో.
"ఇంకెప్పుడూ అమ్మాయిలకు ఫిజియోథెరపీ చేయకు ... నేర్పించకు ...''
"సారీ మేడమ్ ... నీ ఫిజిక్కుకు చేసిన థెరపీ ఎక్స్ క్యూజివ్ ... తమర్ని మిసెస్ ని చేసుకోవాలని డిసైడయ్యేకే ... లవ్ థెరపీ మొదలెట్టా ...'' ఉక్రోషంగా అన్నాడు. ఆమె పొట్టమీద పెదువులాన్చుతూ....
"ఆ మాత్రం తెలుసు కాబట్టే ... మీ సైకాలజీ చదివేకే ... మీతో థెరపీ చేయించుకున్నాను'' అంది అతడ్ని మంచం మీదకి లాగుతూ.
"అబ్బ ... నడుం విరుగుతుంది.
"మీ ఫిజిక్కుకి థెరపీ చేయడానికి నేను రెడీ'' అంది.
'సారీ గోపికా ... పదేళ్ళ క్రితం ... పెళ్ళి అంటే ఆసక్తి లేక ... నువ్వు నచ్చలేదని చెప్పాను. అప్పుడే ఓ.కే. అని ఉంటే ... ఇప్పుడెన్ని అనుభవాలు నా గుండె బ్యాంకు ఖాతాలో డిపాజిట్స్ అయి ఉండేవో' అనుకున్నాడు గోపీనాథ్ ... తనను గోపిక గుర్తించలేదనే నమ్ముతూ.
'గాడ్ ఈజ్ గ్రేట్ ... పదేళ్ళ క్రితం పెళ్ళిచూపుల్లో నన్ను చూసి నచ్చలేదని మొహమ్మీదే చెప్పినట్టు కంప్యూటర్ మొహమ్మీద (స్క్రీన్) మీద చెప్పేసావు. అప్పుడే ఆ కోపంలో, టెన్షన్ లో స్పాండిలైటిస్ ఎటాకై ... ఇలా పెరిగిపోయింది. యాక్సిడెంటల్ గా నీ దగ్గరికే ఫిజియోథెరపీ కోసం వచ్చాను. స్వీట్ రివెంజ్ తీర్చుకున్నాను. నీ బ్రహ్మచర్యానికి. నా టెన్షన్ కు చెక్ చెప్పాను. మీరు నన్ను గుర్తించలేదు ...'' అనుకుంది గోపిక ... మిసెస్ గోపికానాథ్ ... దట్సిట్.
ఆ విధంగా ఒకరి బ్రహ్మచర్యానికి మరొకరు 'చెక్' చెప్పుకున్నారు. అనుభవాలకు అనుభూతులకూ వెల్ కమ్ చెప్పుకున్నారు. హేవ్ ఏ నైస్ డే ... విష్ దెమ్ హేపీ అండ స్వీట్ మెమోరీస్.
No comments:
Post a Comment