Thursday, January 3, 2013

Pedavula savvadi


వయస్సు వేడితో రగిలిపోతూంటే ... వలపు వాగులా పొంగుతోంది వాళ్ళిద్దరిలో ... ధారగా పడ్తున్న జడివాన వారిద్దరినీ మరింత దగ్గరకు చేర్చింది. వర్షానికి తడిసిన తెల్లచీరలో అలేఖ్య ఒంపు సొంపులు మరింత స్పష్టంగా కనిపించి రోహిత్ ని సంమోహితుడ్ని చేస్తున్నాయి ...
చీకటిని చీల్చుకుని రోడ్డుమీద నుండి వచ్చే స్ట్రీట్ లైట్ కాంతిలో వారిద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు.
అలేఖ్య జడలోని జాజుల పరిమళం అతన్ని మరింత మత్తెక్కించేస్తుంటే ... మరింత దగ్గరకు లాక్కుని ఆమె అదిరే లేత ఆధారాలను గాఢంగా చుంభించాడు.
చుంబనలోని మధురిమ అలేఖ అణువణువునూ పాకి ఏదో తెలీని మైకం కంమేస్తుంటే ... రోహిత్ ని మరింత గాఢంగా హత్తుకుని అతని పెదవులను, తన పెదవులతో బంధించింది.
ధారగా కురుస్తున్న వర్షపు నీరు ... వారి ఆధారాలను తాకి అమ్రుతదారలుగా మారిపోతోంది. చినుకు వారి శరీరాల వేడికి ఆవిరైపోతూంటే ... మరో చుక్క ఆమె మెడలో ముత్యంలా మెరుస్తోంది.
ఆమె అందాన్ని కళ్ళతో తాగేస్తూ ... తమకంగా అలేఖ్య శరీరం మీద ముద్దుల ముద్రలు వేయటం మొదలుపెట్టాడు రోహిత్.
ఇది వారి తొలిరేయి ముచ్చట ... పదిరోజులు ముందుకు వెళితే ....
                    *****
సుగుణ టి.వి.కి కళ్ళు అంటించేసి చూస్తోంది. అందులో ఛానెల్లో "మ్ము ... మ్ము ... ముద్దంటే చేదా ...'' అన్న పాటతో డాన్సర్ సర్కస్ ఫీట్లు చేస్తోంది.
అంతలో విసురుగా వచ్చి ఠక్కున స్విచ్ ఆఫ్ చేసింది అలేఖ్య.
అలేఖ్య తత్త్వం తెలిసిన సుగుణ ... చటుక్కున చేతిలోని మాగజైన్ లో తల దూర్చింది.
అయినా ఆమె ఊరుకోలేదు ....
"
అత్తా ... ఇలాటి చెత్త పాటలు ... వింటే టి.వి, పగలగొడ్తాను'' విసురుగా అక్కణ్ణించి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళినవైపే గుడ్లప్పగించి చూడసాగింది సుగుణ.
                    *****
అలేఖ్య ఉద్యోగంలో చెరి ఆర్నేల్లైంది ... హైదరాబాద్ లో ఆమెని ఒంటరిగా ఉంచటం ఇష్టంలేక ఆమె తల్లిదండ్రులు తోడుగా సుగుణను పంపారు.
సుగుణకు నలభై ఏళ్ళుంటాయి. పెళ్ళైన ఆర్నెల్లకి భర్త పోవటంతో ఆమె సంసార జీవితానికి దూరమైంది. హైదరాబాద్ వచ్చాక ఆమెకి ఎంతో హాయిగా అనిపించింది. తనకిష్టమైన సినిమాలు చూస్తుంది. మాంచి రొమాంటిక్ నవలలు, కథలు తెచ్చుకుని హ్యాపీగా చదువుకుంటుంది. అయితే ఇవన్నీ అలేఖ్య కంటబడకుండానే జరిగిపోతుంటాయి. రోజు సెలవ్ కావటంతో పాత అలేఖ్య చేవినపడింది.
అప్పటికే ... మేనకోడలు మాంచి మూడ్ లో ఉన్నప్పుడల్లా సుగుణ ... పెళ్ళి, రోమాన్స్ గురించి నూరిపోస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఆమె సడెన్ గా అపరకాళిలా మారిపోతుంది. కోపంతో ఆమె ముఖం ఎర్రబాడటం ... ఆమె గులాబీ పెదవువు సన్నగా అదిరి సవ్వడి చేయటం సుగుణ గమనిస్తూనే ఉంటుంది.
"
హు ... దీన్ని పెళ్ళి చేసుకుని, పెదవుల సవ్వడిని ఆస్వాదించే వాడు, పుట్టాడో లేదో'' నిట్టూర్చింది సుగుణ.
                *****
రోహిత్ స్పీడ్ గా వచ్చి ... తన బైక్ పార్కింగ్ ప్లేస్ లో ఆపాడు.
ప్రక్కనే తెల్లపావురంలా ఉన్న అలేఖ్య, కైనటిక్ హోండా అతనికి మరింత హుషారు నిచ్చింది.
అలేఖ్య పనిచేసే ఆఫీసు ... రోహిత్ పనిచేసే బ్యాంక్ ఒకే కాంప్లెక్స్ లో ఉన్నాయి.
అలేఖ్య జాయినయిన ఆర్నెల్లకి ... రోహిత్ అక్కడ బ్యాంక్ ఆఫీసర్ గా చేరాడు.
అతనికి ఆమంటే మొదటిచూపులో ప్రేమ పుట్టింది. అలేఖ్య కాస్త హెడ్ స్ట్రాంగ్ అవటంవల్ల ఆరునెలలైనా ఆమెతో స్నేహం పెంచుకోలేకపోయాడు.
"
అబ్బ ... వెహికల్ ప్రేమ ఎన్నాళ్ళో ...'' అనుకుంటూ ఆఫీసులోకి ఎంటర్ అయ్యాడు.
రోజు అలేఖ్య ఆఫీసులోకి ఎంటరయ్యేసరికి ఆఫీసంతా హడావిడిగా ఉంది ...
ప్రతి ఒక్కళ్ళు నవ్వుతూ ఉల్లాసంగా ఉన్నారు.
"
ఏంటో ... వీళ్ళంతా ఇంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు ...'' అనుకుంటూ తన సీటులోకి వచ్చింది.
అప్పుడే పళ్ళన్నీ కన్పించేలాగా నవ్వుతూ రోజీ అక్కడకు వచ్చింది.
ఆమె మేకప్ ని గమనిస్తూ ... "ఎనీ గుడ్ న్యూస్ టు డే?'' అని అడిగింది.
"
యా ... వెరీ ఇంట్రస్టింగ్'' అంటూ రోజీ ఆమె దగ్గరగా వచ్చింది.
రోజీ శరీరం నుంచి ఫారిన్ స్ప్రే గుప్పుమంది. అలేఖ్యకి సింపుల్ గా వుండటం అంటే ఇష్టం. ఎప్పుడూ పార్టీకి వచ్చినట్టు దట్టంగా లిప్ స్టిక్, పెర్ ఫ్యూమ్స్ వాడే రోజీ అంటే ఎలర్జీ తనకి.
అలేఖ్య ఫీలింగ్ పట్టించుకోకుండా ... తన ధోరణిలో "మన క్రొత్త బాస్ మహా ఫాస్ట్ గా ఉన్నాడు'' అంది కిసుక్కున నవ్వుతూ.
"
ఫాస్టా ... ఎందులో?'' కాస్త విసుగ్గా అడిగింది అలేఖ్య.
"
రోజే జాయిన్ అయ్యాడుగా ... మధ్యాహ్నం అందరికీ మిర్చి ... మసాలా టైపులో ట్రీట్ ఇస్తున్నారు'' కన్ను గీటుతూ అంది.
"
దానికేనా ఫాస్ట్ అన్నావు ...!''
"
దానిక్కాదులే ... లంచ్ అయ్యాక మాంచి డిబేట్ పెట్టారు తెలుసా?'' ఎగ్జైటింగ్ గా చెప్పింది.
"
ఎందుకలా ఎగ్జైట్ అవుతున్నావు? డిబేట్ లో టాపిక్ నీకు తెలుసా?'' నవ్వుతూ అంది అలేఖ్య.
"
ఎస్ ... యు ఆర్ రైట్ ... నాకు నచ్చిన టాపిక్'' కిలకిల నవ్వుతూ అంది.
"
ఏంటో అది?'' క్యూరియస్ గా అడిగింది అలేఖ్య.
"
ముద్దంటే ... చేదా ...?''
                *****
లంచ్ టైం దగ్గరపడుతుంటే అలేఖ్యకి వికారం మొదలైంది. మనస్సంతా గందరగోళంగా ఉంది ...
"
... ఆఫీసులో ఓపెన్ గా ఇలాంటి టాపిక్స్ మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గనిపించదా ... ఇదేమన్నా లవర్స్ స్పాట్ అనుకుంటున్నారా ... రాను రాను ... చిన్నా పెద్దా కూడా ఎడ్వాన్స్ అయిపోతున్నారు''
ఆఫీసులో అందరూ ఆనందంగా కనిపిస్తున్నారు ....
"
పెళ్ళికాని అమ్మాయిలూ మెలికలు తిరిగిపోతుంటే ... అబ్బాయిలు వాళ్ళ ముఖాల్లో హావభావాలు చూసి వెర్రెత్తిపోతున్నారు.
ఇంకా పెళ్ళైన వాళ్ళంతా తమ అనుభవాలు గుర్తు తెచ్చుకుంటున్నారేమో ... అందరి మొహాలు చిచ్చుబుడ్డిలా వెలిగిపోతున్నాయి.
అలేఖ్య అటుగా వెళుతున్న మీనాక్షిని పిలిచింది. నలభై ఏళ్ళ ఆవిడ కూడ ... బాలాకుమారిగా మారిపోయింది. ముసిముసినవ్వులు చిందిస్తూ ... అలేఖ్య దగ్గరకు వచ్చింది. "మేడం ... నాకు ఒంట్లో బావుండలేదు ... హాఫ్ డే లీవ్ ... పరిమిట్ చేయండి''
"
లీవా ... ఇంకా నయం ... మన క్రొత్త బాస్ ఎంతో స్ట్రిక్టు ... పైగా రోజు ఎంటర్ టెయిన్ మెంట్ ప్రోగ్రామ్ ఎవ్వరూ మిస్ కాకూడదని నువ్వు వచ్చేముందే వార్నింగ్ ఇచ్చాడు. ట్రై, టు స్పీక్ సమ్ థింగ్ ఎబైట్ కిస్'' నవ్వుకుంటూ అనేసి తప్పుకుందావిడ. అలేఖ్య ఒక్కసారిగా డల్ అయిపొయింది. ... వీళ్ళంతా ఇక్కడ పుట్టాల్సిన వాళ్ళు కాదు ... ఏదో ఒక వెస్టర్న్ కంట్రీలో పుట్టాల్సిన వాళ్ళు ... అనుకుంది ....
లంచ్ వరకు ఆమె బుర్ర పనిచేయలేదు ... ముందురోజు అత్త చూస్తున్న సినిమాలోని పాట గుర్తొచ్చి వాంతి వచ్చినంత పనైంది ...
అదిగో అదే ఫీలింగ్ ఆమెను రక్షించింది. మీనాక్షిని కన్వీన్స్ చేసి ఆఫీస్ బయటపడింది అలేఖ్య ....
                *****
టైం మధ్యాహ్నం పన్నెండుగంటలు.
ఎండ తీవ్రంగా ఉంది ... ఆలేఖ్యకి గండం గట్టెక్కిందన్న సంతోషంలో .... అంత ఎండా ... వెన్నెలలాగా కనిపించింది. బ్యాగ్ లోంచి కూలింగ్ గ్లాసెస్ తీసి పెట్టుకుని తన బైక్ దగ్గరకు వచ్చింది.
అప్పుడే టీ తాగి వస్తున్నా రోహిత్ ఎదురుపడ్డాడు .... అలేఖ్య ముఖం చిట్లించింది అతన్ని చూసి. రోహిత్ చిన్నగా నవ్వి ... ప్రక్కనుంచే కళ్ళెగరేస్తూ వెళ్ళిపోయాడు.
"
స్టుపిడ్'' గొణుక్కుంది అలేఖ్య,
తన బైక్ దగ్గరకు వచ్చి స్టార్ట్ చేయబోతుంటే ఠక్కున ఆగింది.
ఆమెకి కనిపించిన వింతని మళ్ళీ చూసింది ... దానిమీద లవ్ మార్క్ స్టిక్కర్ అంటించి ఉంది.
ప్రక్కనే ఉన్న రోహిత్ వెహికల్ మీద హారో మార్క్ అంటించి ఉంది.
ఒక్క క్షణం ఆమెకి అయోమయంగా అనిపించినా మరుక్షణం కోపం తారాస్థాయికి అందుకుంది.
తన బైక్ కి ఉన్న స్టిక్కర్ పీకి పారేసి ... కాలితో అతని బైక్ ని ఒక తన్ను తన్నింది.
విసురుగా స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. దూరం నుంచి రోహిత్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఆమె ప్రవర్తనకి నవ్వుకుంటూ తన ఆఫీసులోకి వెళ్ళిపోయాడు.
                *****
ఆరోజు ఉదయం ఆఫీసుకి బయల్దేరిన అలేఖ్య బైక్ కీస్ తీసుకెళ్లకపోవడం చూసి ... "అలేఖ్యా! ఇవాళ తాళాలు తీసుకోలేదు ... ఎలా వెళుతున్నావు ఆఫీసుకి?'' అని అడిగింది సుగుణ.
"
ఆటోలో వెళ్తాను ...''
"
ఎందుకు?''
"
అబ్బా ... అన్నిటికీ ప్రశ్నలే ... నాకు వెళ్ళాలనిపించింది వెళుతున్నాను అంతే ...''
"
దీనివన్నీ కళాకళలు వెళావెళలు'' అనుకుంది సుగుణ అలేఖ్య వెళ్ళిపోయాక.
రోహిత్ తన బైక్ పార్క్ చేస్తూ ప్రక్కకి చూశాడు ... అలేఖ్య వెహికల్ లేదు ... పార్కింగ్ ప్లేసంతా వెదికాడు ... ఎక్కడా లేదు. అక్కడే ఉన్న వాచ్ మెన్ ని పిలిచి "ఈరోజు అలేఖ్య గారు రాలేదా?'' అని అడిగాడు.
"
వచ్చారండి ... కానీ బస లో వచ్చారు ...'' తనలో తానే నవ్వుకుంటూ అన్నాడు వాచ్ మెన్.
"
అయితే ఒక పనిచెయ్యి ... నా బైక్ ని తీసుకెళ్ళి మెకానిక్ షాప్ లో ఇచ్చిరా ... చిన్న రిపేర్ ఉంది ... అది వాళ్ళు చూసుకుంటారు ... నేను రేపెళ్ళి తెచ్చుకుంటాను'' అని అతని చేతికి కీస్ ఇస్తూ అన్నాడు.
ఆఫీసులో అంతా ముందురోజు జరిగిన ప్రోగ్రామ్ గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు ... వాళ్ళకి అంత బాగా ఇంప్రేవ్స్ చేసిన టాపిక్ అలేఖ్యకి మాత్రం చేదుగా ఉంది. రోజంతా ముళ్ళమీద కూర్చున్నట్టు కూర్చుండి.
ఆరుగంటలవుతుండగా బయల్దేరింది ఇంటికి. తీరా బయటికి వచ్చి చూస్తే ... ఆకాశం అంతా మబ్బులు పట్టి వాతావరణం చీకటిగా మారిపోయింది. ఆటొ కోసం వెయిట్ చేస్తుంటే గుర్తొచ్చింది ఆరోజు ఆరో స్ట్రైక్ అని ...
"
... ... ఇప్పుడేంటి పరిస్థితి బస్ ఎక్కాలి'' విసుగ్గా నాలుగు అడుగులు వేసింది.
అంతే ...
మొదటి వానచుక్క ఆమె నుదురు మీద ముద్దుపెట్టుకుంది ... వెంటనే ఒక్కసారిగా జోరుగా వర్థం ... ఆఫీసు నుంచి కొద్దిగా దూరంగా ఉన్న బస్టాప్ కి పరిగెడుతున్నట్టుగా వెళ్ళింది ... అయినా ఆమె పూర్తిగా తడిసిపోయింది.
బస్టాప్ లో ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ... వచ్చే బస్సులన్నీ నిండుగర్భిణిలా వచ్చి ... అస్సలు ఎక్కేందుకు అవకాశమే లేకుండా ఉంది ... బైక్ లేనందుకు తనలోతానే తిట్టుకుంది. మరికాసేపట్లో ఇద్దరు పాసింజర్లు కూడా మాయమయ్యారు ....
టైం ఏడుగంటలు అవుతోంది ... ఎవరినన్నా లిఫ్ట్ అడుగుదామంటే మనస్సోప్పటం లేదు ....
వాన ఉధృతం అయింది ... మెరుపులు, ఉరుములు అలేఖ్యకి నెమ్మదిగా భయం అనిపించటం మొదలెట్టింది ...
క్షణంలో ఆమెకి రోహిత్ గుర్తొచ్చాడు ... " ... అతని వల్లే తనకీ కష్టం ... ఎప్పుడూ తినేసేలా చూస్తాడు. పైగా లవ్ సింబల్స్ ... కళ్ళతో పలకరించడాలు ...'' విసుక్కుంది.
"
ఎక్స్ క్యూజ్ మీ ...'' అన్న మాటలకు లోకంలోకి వచ్చింది.
ఎదురుగా రోహిత్ ... చేతిలో గొడుగుతో ... అంత దగ్గరగా అతన్ని చూసేసరికి ఎందుకో భయం కలిగింది ఆమెకు ... అయినా పైకి కనపడనీయకుండా ముఖం ప్రక్కకు తిప్పుకుని ... కొద్దిగా వెనక్కి జరిగింది.
"
అలేఖ్యగారూ ... ఈరోజుకి వర్షం తగ్గదు ... ఇదిగో నా దగ్గర గోడుగుంది ... మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసాను ... నో అనకండి ప్లీజ్ ...'' రిక్వెష్టింగ్ గా అడిగాడు.
అలేఖ్యకు అతన్ని చూసి జాలి అనిపించినా వెంటనే ముఖం చిట్లించి "మీ దయార్థ్ర హృదయానికి జోహార్లు ... నా దోవన నన్ను వెళ్ళనీయండి ... ఎప్పుడు వాన తగ్గితే అప్పుడే వెళ్తాను ...'' ధీమాగా అంది.
అప్పటికి టైం ఏడున్నర గంటలు కావస్తోంది ... రోడ్డులో జనసంచారం లేక నిర్మానుష్యంగా ఉంది. రోహిత్ ఆమె మాటను పట్టించుకోకుండా తనూ అలానే నిలబడ్డాడు. ఇంకో అరగంట వర్షాన్ని తిలకిస్తూ నిల్చున్నారు. ఇప్పుడు అలేఖ్యలో సన్నని వణుకు ప్రారంభమైంది ... అసలే తడిసిన బట్టలు ... చలిగా అనిపిస్తోంది ... పైగా ఎవ్వరూ లేని ప్రదేశంలో రోహిత్ తనని చూపులతో కాల్చేస్తూ ....
దాదాపు తొమ్మిది కావస్తుండగా నెమ్మదిగా రోహిత్ దగ్గరకు వచ్చింది ...
"
నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ...'' తలొంచుకుని చెప్పింది ...
ఇద్దరూ గొడుగు కింద తలలు దూర్చి వర్షంలో అడుగుపెట్టారు.
వర్షం ... చలి ... పక్కనే మగాడు ... నిజంగా అలేఖ్యకి ఏదో క్రొత్తగా, వింతగా ఉంది ....
మనస్సులో తెలియని అలజడి ... అంత చలిలో బాడీలో వేడి తగుల్తున్న ఫీలింగ్ ... మధ్యలో ఓసారి కళ్ళెత్తి రోహిత్ వంక చూసింది ... అతను సిన్సియర్ గా గొడుగు పట్టుకుని అడుగులేస్తున్నాడు.
అప్పుడే పెద్ద మెరుపు మెరిసింది. వానగాలి తీవ్రతనంతరించి అతని చేతిలో గొడుగు వెనక్కి తిరిగి బలంగా పట్టుకున్నా ఒక్కసారిగా అది చేతులనుంచి ఎగిరిపోయింది.
పెద్దగా ఉరిమిన శబ్దానికి అలేఖ్య గుండె వేగంగా కొట్టుకుంది ... భయంలో ఆమె చటుక్కున రోహిత్ ని వాటేసుకుంది ...
చుట్టూ చీకటి ... ధారగా వర్షం ... వయస్సులో ఉన్న యువతీయువకులు ... నెమ్మదిగా రోహిత్ లో వేడి రాజుకోవడం మొదలెట్టింది ...
తడిసిన బట్టల్లో అలేఖ్య మరింత టెంప్టింగ్ గా అనిపించింది. అతను ప్రొసీడ్ అయ్యేలోపే ఆమె అతని కౌగిలి వీడే ప్రయత్నంలో ఉంది.
క్షన్లో మిరిమిట్లు గొలుపుతూ పెద్ద మెరుపు మెరిసింది.
వెలుగులో ... ఎర్రటి ఆమె పెదాలు చేసే సన్నటి సవ్వడి ... అతని హృదయంతరాలలొకీ కోరికను లేపింది.
చటుక్కున ఆమె పెదాలని ... తన పెదాలతో అందుకున్నాడు. చిత్రంగా ఆమెలో ప్రతిస్పందనా లేదు. పైనుండి వర్షం వారి చెంపలమీదుగా జారిపోతుంది.
అలేఖ్య కళ్ళు అరమోడ్పులై ... తొలిముద్దు తీయదనాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది.
ప్రకృతి చేసే గర్జనలు వారిని మరింత దగ్గర చేర్చాయి. సరిగ్గా సంఘటన జరిగిన పదిరోజుల్లోనే వారిద్దరూ పెళ్ళి చేసుకున్నారు.
ఆరోజు వారి తొలిరేయి ముచ్చట. తమని ఒకటిగా చేసిన వర్షంతొ కలిసి జరుపుకోవాలనుకున్నారు. అందుకే స్పెషల్ గా రాత్రి వారికి మధురమైన రాత్రి ... వెరైటీగా జరిగిన శోభన రాత్రి ... అది మొదలు ఆమె పెదవుల సవ్వడి రోహిత్ గుండెను తడ్తూనే ఉంది. అలంటప్పుడు అలేఖ్య తీయని అనుభూతిని పొందుతూనే ఉంది ....

No comments:

Post a Comment