అది ఓ సుందరమైన
డిజైనర్ కవర్.
లోపల ఉన్న
కలర్ ఫుల్
కాగితాలపైన రాసి ఉన్న ప్రేమలేఖను బయటకు
తీసింది. ఆమె సన్నటి చేతివేళ్ళు ఆ
కాగితాన్ని తాకి వణికాయి.
కనురెప్పలు బిదియమ్తో వాలిపోయాయి. బుగ్గలు గులాబీ మొగ్గలయ్యాయి. ఎదురుగా తల్లి కూర్చునివుండగా ఆ ప్రేమలేఖ చదవాలంటే కాస్త సిగ్గుగా అనిపించింది.
"అమ్మా నువ్విక్కడే కూర్చోవాలా?''
"ఏం కూర్చుంటే నీకేమైందే?'' కళ్ళెగరేస్తూ అడిగింది పల్లవి. బిగాపట్టిన పెదాల వెనుక ఉబికి వస్తున్నా నవ్వును అదిమిపెట్టడానికి ప్రయత్నిస్తుంటే ఆ నవ్వు ఆమె కళ్ళల్లో మెరిసింది.
"అలా అయితే నేను ఇవి చదవను. నువ్వే తీసుకుపో'' తన ఒళ్ళో కుప్పగా పోసుకున్న కవర్లను చూపిస్తూ అంది. మాటయితే అంది గాని వాటినిచ్చే ఉద్దేశం మాత్రం ఆమెకు లేదని ఆమె ముఖం చూస్తేనే తెలిస్తుంది.
"సరే, నేను ఇటు తిరిగి కూర్చుంటాను. నువ్వు చదువు'' అంటూ తన కుర్చీని మరోవైపుకి తిప్పుకుని కూర్చుంది పల్లవి.
"ఇతరుల ఉత్తరాలు చదవడం మంచిది కాదమ్మా'' అంది మనోజ్ఞ మొహమాటంగా.
"ఇతరులవి ఎందుకవుతాయి, నావే కదా! మీ నాన్నగారు అవి రాసేటప్పటికి నీకు ఒక సంవత్సరం వయసి. ఐఎస్ సెలెక్ట్ అయి ట్రైనింగ్ కానీ ఆయన ముస్సోరీ వెళ్ళబట్టి గానీ లేకపోతే ఆయనకు ఉత్తరాలు రాసే అవసరం ఎక్కడుంది. చదవమని నేనే ఇచ్చాను గదా, చదువు ఏం ఫరవాలేదు'' అంది.
"వీటిపైన పోస్టల్ స్టాంప్ కూడా లేడు. అక్కడ నుంచి ఎలా వచ్చాయి నీ దగ్గరికి?'' కుతూహలంగా అడిగింది మనోజ్ఞ.
"ఆ కవర్లు చూశావా ఎంత రొమాంటిక్ గా ఉన్నాయో. వాటిని అలాగే పోస్ట్ చేస్తే నాదాకా చేరుతాయా? మధ్యలోనే ఏ పోస్ట్ మ్యానో, ఇంకెవరో ఓపెన్ చేసి చదవేవారు. పొడవాటి తెల్లటి ఎన్వలప్ పై నా అడ్రస్ రాసి వాటిలో ఈ కవర్లను పెట్టి పంపించేవారు ఆయన.
మొదటి కవరు వచ్చినప్పుడు ఇదేమిటి ఏదో అఫీషియల్ కవర్ లా ఉందే అనుకున్నాను. తెరచిచూస్తే ఇవి కనిపించాయి.
అప్పుడు నాకు ఎంత థ్రిల్లింగ్ గా అనిపించిందో చెప్పలేను'' పల్లవి కన్నుల్లో అపప్తి మెరుపులు మరోసారి తళుక్కుమన్నాయి.
అమ్మా -నాన్న పరస్పరం ప్రేమగా ఉంటారు. తననూ ప్రేమగా చూసుకుంటారు. అందుకే తాను కూడా అటువంటి ప్రేమ సామ్రాజ్యాన్ని పొందాలని మనోజ్ఞ ఎప్పుడో గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే తన మనసుకి నచ్చినవాడిని చూసి ప్రేమించి, పెళ్ళిచేసుకోవాలని ఆమె ఆశ, ఎంత ప్రేమించినవాడైనా తల్లిదండ్రులకు ఇష్టమైతేనే చేసుకోవాలని తనకు తానే ఒక నిబంధన ఏర్పరచుకుంది.
ఎందుకంటే తనని ప్రేమగా పెంచే అమ్మా-న్నాన్నలంటే ఆమెకి కూడా చాలా ప్రేమ.
ఇంజనీరింగ్ లో తన క్లాస్ మేట్ కాశ్యప్ ని చూసి ఇష్టపడింది. సన్నగా, పొడవుగా, కోటేరేసిన ముక్కు, అల్లరిగా నవ్వుతున్న కళ్ళు, ఉంగరాల జుత్తుతో ఆకర్షణీయంగా ఉంటాడు. చదువులో కూడా బ్రైట్ గా ఉంటాడు.
అతనితో స్నేహం చేసింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఫిబ్రవరి పధ్నాలుగున ఆమెకి 'ఐ లవ్ యూ' చెప్పాడు కాశ్యప్.
ఆ మాటలకు ఆమె ఒళ్ళంతా తుళ్ళింతలు. ముందు నుంచి ఎక్స్ పెక్ట్ చేస్తున్నదే అయినా ఆ మూడు పదాల మంత్రం ఆమె మనసును పరవశింపజేసింది. ఐనా అతనికేలాంటి సమ్మతిని తెలుపలేదు 'థాంక్స్' అని అంది.
"మరి నీ విషయం చెప్పవా?'' అడిగాడు.
"నీకు మాట ఇవ్వాలంటే ముందు నేను ఆలోచించుకోవాలి. మాట ఇచ్చి నిలుపుకోలేకపోవడం నాకు నచ్చాడు'' అంది మనోజ్ఞ. ఆ తరువాత కాలేజీలో కనిపించినప్పుడల్లా 'నా విషయం ఏమి చేశావు?' అనేవాడు కాశ్యప్.
తన ఆలోచనలకు ఇంకా స్పష్టమైన రూపం రాలేదని చెప్పలేక మొహమాటంగా నవ్వి, 'గివ్ మీ సమ్ మోర్ టైమ్' అనేది. ఇక ఈ విషయాన్ని తెల్చేయాలని ఇంటికొచ్చి అమ్మతో ఆ విషయం ప్రస్తావించింది.
అందుకే ఆ రోజు కూతురితో మనసువిప్పి మాట్లాడాలని నిశ్చయం చేసుకుంది పల్లవి.
ప్రేమ అనే మాట వింటే యువతీ యువకులలో ఉప్పొంగే భావాలు ఆమెకు తెలిసినవే. వయసులో ఉన్న స్త్రీపురుషులు ఒకరికొకరు దగ్గరగా ఉంటే వాళ్ళ హృదయాలలో కలిగే సంచలనాలు కూడా ఆమెకు తెలుసు. ఆ వయసు వేడిపాల పొంగులాంటిది. అతిగా పొంగితే పాత్రలో నుంచి పొయ్యిలో పడతాయి పాలు.
తన కూతురు మనసులో పొంగే ప్రేమ పాలు కలతల కాపురం అనే పొయ్యిలో పడకూడదని, ఆమె తన జీవిత భాగస్వామితో కలకాలం ఆస్వాదించేలా సుందర సంసారమనే హేమ పాత్రలో పడాలని పల్లవి కోరిక.
బాధ్యతా తెలిసినదే అసలైన ప్రేమ అని, ఆవేశం, ఆకర్షణలు మాత్రమే ఉన్న స్వల్పకాలపు చమత్కారం ప్రేమ కాదని పల్లవి అభిప్రాయం. కాని ప్రేమించుకుని, పెళ్ళి చేసుకొని జంట లైఫ్ లో అతిముఖ్యమైన, అనుభూతియైన ప్రేమను ఒకరినొకరు నొప్పించుకోవాలనే వాదులాట కాకుండా అవతలవారు చెప్పేదానిలో వినదగిన విషయాలు ఏమిటి అని ఆలోచించడం ఆ ఇంట్లో అందరూ అలవార్చుకున్నదే గనుక, తల్లీకూతుర్ల మధ్య వాదోపవాదాలు చెలరేగలేదు. తల్లి చెప్పదలచుకున్నది మనోజ్ఞ కూర్చుని సావధానంగా వింది.
భార్యాభర్తలు ప్రేమించుకోవచ్చనే ఊహ మనోజ్ఞకు కొత్తదే. ఆ వయసు పిల్లలకు ప్రేమ అనే అపురూపమైన భావంకలిగి తన అభిప్రాయాన్ని ఉత్తరాలలో కొన్నిటిని చదివేసరికి మనోజ్ఞ తల్లి అభిప్రాయాన్ని కొంతవరకు ఒప్పుకొంది. కాని అసలు పేచీ మాత్రం తల్లి ప్రేమకు ఇచ్చిన సరికొత్త నిర్వచనం వల్లనే వచ్చింది.
బాధ్యతనెరిగి ప్రేమించగలగతం అసలైన ప్రేమకు కొలమానం అంది పల్లవి. బాధ్యతలు పట్టని వ్యక్తుల ప్రేమను నమ్మలేము అంది. ఒక యువతి తన ప్రేమను పంచుకొన్న వ్యక్తితో జీవితం ముదిపదాలని కోరుకోవడం తప్పు కాదు. అది సహజం కూడా, కాని ఆ వ్యక్తికి తన జీవితభాగస్వామి అయ్యే అర్హత ఉందా లేదా అనేది ముందుగా చెక్ చేసుకోవాలి అంటుంది.
ఒకవేళ ప్రేమను పంచుకున్న తర్వాత ఆ వ్యక్తికి అటువంటి అర్హతలేదని తెలిస్తే ఎంత విషాదంగా ఉంటుంది అని పల్లవి అభిప్రాయం. మనోజ్ఞకు అదే నచ్చలేదు. హృదయం తన జీవితభాగస్వామిని చూడగానే పదికడుతుందని, దాన్నే 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్' అంటారని ఆమె నమ్మకం. హృదయం చేయాలైసినదాన్ని మేధస్సుతో చేయాలని చూస్తే అది ప్రేమ ఎలా అవుతుంది, వ్యాపారమవుతుంది గాని అని అంటుంది మనోజ్ఞ.
ఒకరినొకరు చూడగానే కలిగే భావావేశం హృదయానిదా, శరీరానిదా అనేది ఎలా గుర్తుపడతావు అంటుంది పల్లవి. సృష్టి సహజమైన శరీర ధర్మాలను తక్కువ అంచనా వేయ్యోద్దని చెప్తుంది ఆమె. జీవితాంతం కావాల్సిన తోడుని హృదయం కోరుకుంటుంది కాని, సృష్టికి కావాల్సిన శరీరధర్మం పునరుత్పత్తితో తృప్తి చెందుతుంది.
అందుకే ఒక్కోసారి శరీర ధర్మం మనసుని కూడా మోసం చేస్తుంది. అదుపు చేయాల్సింది కూడా అలంటి కోరికలనే అని అంటుంది పల్లవి.
తల్లి మాటలు విని ఆలోచనలో పడింది మనోజ్ఞ. తను చివరగా చదివిన ఉత్తరంలోని విషయాలు మనసులో మృదువైన ప్రకంపనలు సృష్టిస్తుంటే అలాగే మంచంపై వాలి నిద్రలోకి జారుకుంది మనోజ్ఞ.
నిండుగా ఎదిగిన కూతురిలో ఇంకా మెదులుతున్న పసితనం నవ్వుకుంటూ లైట్ ఆఫ్ చేసి గదిలోనుంచి నడిచింది పల్లవి. వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్న కవర్లన్నీ జాగ్రత్తగా లేక్కచూసి మరీ తీసుకెళ్ళింది.
మరునాడు కాలేజీకి వెళ్ళిన మనోజ్ఞకు కాశ్యప్ చాలా మూడీగా కనిపించాడు. ఆ రోజు అతని బర్త్ డే. మనోజ్ఞ కాశ్యప్ ని విష్ చేస్తేవిషాదంగా నవ్వి "నేనెందుకు సెలబ్రేట్ చేసుకోవాలి. నీకు ఐ లవ్ యూ చెప్పి నెలదాటింది. కాని నీ నుంచి రెస్పాన్స్ లేడు.
అందరూ నన్ను ఫూల్ లా చూస్తున్నారు. ఇంక కొన్ని నెలలలో ఈ కాలేజీ వదిలేస్తాం. నీ ప్లానేమిటో నాకు తెలియదు. నాకు స్టేట్స్ లో ఎమ్.ఎస్. చేయాలని ఉంది. మనం కలుస్తామో లేదో తెలియటం లేదు'' అన్నాడు.
అతన్ని చూస్తే జాలేసింది మనోజ్ఞకి. "సరే నన్నేమి చేయమంటావో చెప్పు'' అంది.
"సినిమాకి వెళ్దాం, వస్తావా'' ఆశగా అడిగాడు.
అంతేకదా అనుకుంది మనోజ్ఞ. "సరే పద'' అని అతని బైక్ మీద కూర్చుంది. అంతకుముందు ఎన్నోసార్లు అతని బైకుమీకు కూర్చుని వెళ్ళింది. కాని అలాంటి ఫీలింగ్ ఆమెకి కలగలేదు.
ఒకరినుంచి మరొకరికి ప్రసరించే శక్తి కొన్ని మధురభావనలకు ఉంటుందని ఎవరైనా అంతే నమ్మాల్సిందే. దానిని బాడీ కెమిస్ట్రీ అనో, ప్రేమావేశమనో, మరేదనో పిలుచుకోవచ్చు కాని దాని ఎఫెక్ట్ మాత్రం ఒక్కటే.
శరీరం దూదిపింజలా తెలికైనట్లు, చుట్టూ ఉన్న ప్రపంచమంతా ఎంతో అందంగా మారినట్లు, అందరూ సంతోషంగా ఉన్నట్లు, పగటి సూర్యుడు పున్నమి వెన్నెలలు కురుపిస్తున్నట్టు ఇంకా చాలా భావాలు తియ్యగా మనసును తాకి మైమరిపిస్తున్నాయి. అనవసరంగా ఇంతకాలం ఆలోచనల పేరుతొ కాశ్యప్ ని దూరంపెట్టి తప్పు చేశానేమో అనిపించి కొంచెం బాధపడింది.
"కాస్త స్పీడుగా వెళ్ళాలి. జాగ్రట్ట్టగా పట్టుకుని కూర్చో'' అన్నాడు కాశ్యప్. ఆమె తనను పట్టుకుని కూర్చుంటుందనే ఆశతో. "ఇంకా టైముంది, మెల్లగానే వెళ్ళు'' అంది మనోజ్ఞ, సీటు వెనుక ఉన్న రాడ్ పట్టుకుంటూ.
సినిమా హాలులో జనాలు పల్చగా ఉన్నారు.
రెండు బాక్సు టిక్కెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళి ఒక మూలగా కూర్చున్నారు ఇద్దరూ. అప్పటికే ఒక యువజంట ముందు లైన్లో కూర్చుని ఒకరిమీద ఒకరు పడి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు.
అటు చూసిన మనోజ్ఞకు గుండె ఝల్లుమంది.
కాశ్యప్ టో తను అలా కూర్చుంటే ఎలా ఉంటుంది అనే ఊహరాగానే ఆమె వయసు ఉరకలు వేసింది. కాని వెంటనే తల్లి చెప్పిన మాటలు గుర్తొచ్చి, "మరీ మూల కూర్చుంటే బొద్దింకలుంటాయి. కాస్త మధ్యలోకి వెళ్దాం'' అని లేచింది. "ఫరవాలేదులే కూర్చో'' చొరవగా ఆమె చేయి పట్టుకుని లాగాడు కాశ్యప్.
దాదాపుగా అతని ఒళ్ళో పడబోయిన మనోజ్ఞ పక్కసీటు పట్టుకుని నిలదొక్కుకుంది.
"సారీ'' అన్నాడు కాశ్యప్. అతని చేయి తగిలిన తన శరీరం ఎలా స్పందిస్తుందో చూసి ఆమెకు ఆశ్చర్యం వేసింది. థియేటర్ లో అప్పటివరకు ఉన్న లైట్లు ఆరి క్షణకాలం చీకటిపరచుకుంది కాబట్టి ఆమె ముఖంలో ఉన్న పారవశ్యం అతని కంటపడలేదు. తను చేయిపట్టుకోవడం ఆమెకు నచ్చక ముభావంగా ఉందని అనుకుని, సినిమా మొదలయ్యేవరకు అతను మౌనంగా ఉండిపోయాడు. కొంచెం సేపటికి ధైర్యం తెచ్చుకుని తన చేతిని ఆమె చేతికి సుతారంగా ఆంచాడు. ఆమె ఏమీ అనకపోయేసరికి మరికాస్త ధైర్యం తెచ్చుకుని తన చేతిని ఆమె చేతిఐ ముద్దు పెట్టుకున్నాడు.
మనోజ్ఞ చటుక్కున చేతిని లాక్కుంది. తన శరీరంలోని స్పందనలకు, హృదయంలోని వివేకానికి కలిగే సంఘర్షణ స్పష్టంగా తెలిసింది మనోజ్ఞకు. అప్పుడే ఆమె బ్యాగ్ లోని మొబైల్ మోగింది. 'అమ్మ' అనే పరు కనబడగానే కాల్ కట్ చేసి "నేను వెళ్ళాలి'' అంటూ లేచి అతనికోసం ఆగకుండా బయటకు వచ్చేసింది.
కాశ్యప్ ఆమె వెంటేవచ్చి తన బైక్ మీద డ్రాప్ చేస్తానన్నా వినకుండా ఆటోలో వెళ్ళిపోయింది.
ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి అందరూ ఆటోగ్రాఫ్ పుస్తకాలను రకరకాల 'పంచ్' లైన్లతో నిమ్పుతున్నప్పుడు కాశ్యప్ వచ్చి ఆటోగ్రాఫ్ పుస్తకం మనోజ్ఞ మున్డుపెట్టాడు. 'నన్ను పెళ్ళిచేసుకోవా?' అని ఉంది దానిలో.
మనోజ్ఞ నవ్వి 'ప్రతిస్నేహం పెళ్ళికి దారితీయదు' అని రాసింది. కాశ్యప్ నవ్వి "నో హార్డ్ ఫీలింగ్స్'' అన్నాడు.
ఆ రోజు ఇంటికి వెళ్ళాక తల్లికి జరిగిందంతా చెప్పింది. కాశ్యప్ ప్రపోజ్ చేయడం దగ్గరనుంచి ఆ రోజు తను అతనికి రాసిన ఆటోగ్రాఫ్ వరకూ, సినిమాకు వెళ్ళినది కూడా దాచలేదు. తన ఒళ్ళో తలపెట్టుకుని, కనులు మూసుకుని జరిగినదంతా ప్రశాంతంగా చెప్తున్నా కూతురిని తదేకంగా చూసింది పల్లవి. తర్వాత ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆమె నుదుటిపై ముద్దుపెట్టుకుంది.
"అమ్మా నీకో విషయం చెప్పనా?'' కనులు తెరిచి అంది మనోజ్ఞ. తను తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణం చెప్పబోతుందని తెలిసి మనసంతా ఆమె మాటకోసం నిరీక్షిస్తుండగా "ఊ ...'' అంది పల్లవి.
"నా చిన్నప్పుడు నేను మొట్టమొదటిసారి నవ్వినప్పుడు బోర్లాపడినపుడు, అమ్మా అన్నప్పుడు, కళ్ళు నులుముఉంనప్పుడు, మొదటి అడుగు వేసినప్పుడు అలా ఎన్నోన్నే విషయాలను మనం తేదీలతో సహా రాసి పెట్టుకున్నావు కదమ్మా. ఆ పుస్తకం చూసి నువ్వు ఆ జ్ఞాపకాలను తలుచుకుని ఎప్పుడూ మురిసిపోతుంటావు కదూ!
నాకూ అలాంటిదే చిన్న కోరిక. నా పెళ్ళైన తర్వాత నేను పొందే అనుభూతులను ఒల పుస్తకంగా రాసిపెట్టుకోవాలని, అది జీవితాతం మాకు మధురస్మృతిలా ఉండాలని. అందుకే పెళ్ళికి ముందు ఎలాంటి పొరపాటు చేయకూడదనుకున్నాను'' అంది నిజాయితీగా.
పల్లవికి మనోజ్ఞ మనసులో ఉన్న డోలాయమాన స్థితి అర్థమైంది. కాశ్యప్ ని కాదనడానికి సరైన కారణం ఉందా అని అనుమానం వచ్చింది. "నీ ఉద్దేశం బాగుంది. అయినా నువ్వు ఆటోగ్రాఫ్ పుస్తకంలో రాసింది సగమే నిజం. మిగిలిన సగం ఏమిటో చెప్పనా'' అంది పల్లవి.
'చెప్పు' అన్నట్టు చూసింది మనోజ్ఞ. "ప్రతి మధురమైన పెళ్ళి స్నేహానికి దారితీస్తుంది'' అంది నవ్వుతూ.
కాలేజీ చదువు ముగిశాక కొందరు పై చదువులకోసం, మరికొందరు క్యాంపస్ సెలెక్షన్స్ లో దొరికిన ఉద్యోగాలు చేయడం కోసం వెళ్ళిపోయారు. పీజీ చేసే ఉద్దేశం లేని మనోజ్ఞ తను క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన ఉద్యోగంలో చేరిపోయింది.
చూస్తూ చూస్తూనే నాలుగేళ్ళు గడిచిపోయాయి. ఎన్నో సంబంధాలు వచ్చినా పెళ్ళికి మనోజ్ఞ అంతగా ఇంట్రస్ట్ చూపలేదు. కాని పలవి ఒక సంబంధం గురించి చాలా గొప్పగా చెప్తే ఏమిటా అని వివరాలు వింది.
అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడంటే మొదట ఇష్టపడానికి కాస్తా అతనికి అమెరికా తిరిగి వెళ్ళే ఉద్దేశం లేదని తెలిసి 'సరే చూద్దాం' అంది.
అదే ఊరిలో ఉన్న తల్లిన్దండ్రులను చూసుకుంటూ స్వంత కంపెనీ పెట్టాలనుకుంతున్నాదంటే 'అతని ఉద్యోగం ఊదిపోయిందేమో' అని జాలేసి చూసింది. అది కాదు, ఇక్కడ ఉద్యోగాలు సృష్టించి, మన వాళ్లకు ఏదైనా చేయాలనుకుంటున్నాడని తెలిసి 'ఫరవాలేదు, బాధ్యతా తెలిసినవాడే అయుంటాడు' అనుకుంది మనోజ్ఞ.
పెళ్ళికొడుకుని చూసి ఆమె గుండె లయ తప్పింది. కొంటెగా ఆమె కళ్ళల్లోకి చూసి అతను నవ్వితే తన కలలలోని రాకుమారుడు గుర్రంమీద వచ్చి తనను కూడా ఎక్కించుకుని రైడింగ్ కి తీసుకెళ్తున్నట్టు అనిపించింది. ఇంకేముందు పెళ్ళి వైభవంగా జరిగింది.
శోభనం గదిలోకి వెళ్ళేటప్పటికి మనోజ్ఞకు అప్పటివరకు లేని సిగ్గు దొంతరలుగా వచ్చింది. భర్తతో పెళ్ళికి ముందు మాట్లాడినప్పుడు కలగని సిగ్గు, అతని ఇంటికి వెళ్ళి అతని అమ్మానాన్నలతో మాట్లాడినప్పుడు రాని సిగ్గు అప్పుడు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది.
ఆమెను లోపలికి పంపి తలుపులు వేసిన ముత్తయిదువుల నవ్వులకు బెదిరిన జిన్కపిల్లలా కళ్ళు ఆర్పుతూ అతను ఉన్నవైపు తప్ప అన్ని వేపులా చూసింది.
కొంటెగా నవ్వుతూ, ఆమె దగ్గరగా వచ్చి నడుముచుట్టూ చేయివేసి "ఇదంతా సిగ్గే'' అన్నాడు. అతని కళ్ళల్లోని కొంటె కోరికల సెగ తగిలి ఆమె శంఖంలాంటి మెడఓంపుల్లో గిలిగింతలు రేగాయి.
ఒకచేతితో ఆమె పిడికెడునడుముని చుట్టి మరోచేతిని ఆమె గరిమ నాభికి కిందుగా అడునైన చోట పట్టి రెండు చేతులపై ఆమెను లేపి గిరగిరా తిరిగాడు. ఆ కేళీ విలాసా నికి 'ఒప్పుల కుప్ప' శాస్తా 'వయ్యారిభామ' అయింది.
అతని మెడచుట్టూ చేతులు వేసి నవ్వుతూ 'చాలు వాదులు' అంది. "ఏమిటీ వదులా సరే'' అంటూ 'బిగించి పట్టుకుని ఆచ్చాదన తొలగి నాభి కనిపిస్తున్న ఆమె పలుచటి పొట్టపై ముద్దు పెట్టుకున్నాడు.
ఆమె ఒళ్ళంతా తియ్యటి కోరిక రేగింది. తనువులో ఎక్కడో దాగివున్న అమృతకలశం ఒలికి మధురమైన రుచితో ఆమె మేనినిండింది. ఆ రుచి ఆమె గొంతులోకి వచ్చి అధరాలు తడిసి అమృతమయం అయ్యాయి.
కంపిస్తున్న ఆమె పెదవులని, అరమోడ్పులయిన ఆమె సోగ కన్నులను చూస్తూ మెల్లగా ఆమెను పడకపై చేర్చాడు. ముందుకి వంగి ఆమె తియ్యటి పెదాలను తన పెదవులతో అందుకోబోయాడు.
చటుక్కున కళ్ళు తెరిచి, ముందుకు వస్తున్నా అతని పెదవులకు అడ్డంగా తన చేతిని ఉంచింది.
"నేను ముందు'' అంది.
"ఏం ఎందుకు? లేడీస్ ఫస్టా'' అన్నాడు చిలిపిగా.
"అవును. ఇది నా తొలిముద్దు, ఎప్పటికీ గుర్తుండిపోవాలి మనిద్దరికీ'' అంది అతని కళ్ళల్లోకి చూస్తూ ....
భార్య తోలికోరిక తీర్చడానికి సిద్ధపడిపోతూ "సరే కానీయి. కాని పెదాలు కలిశాక ఎవరు ముందు ముద్దు పెట్టారో ఎలా తెలుస్తుంది'' అన్నాడు.
అతని ప్రశ్నతో ఆమె అందమైన మోములోని విల్లులాంటి కనుబొమ్మలు క్షణకాలం కలిసి విడిపోయాయి. "నేను చూసుకుంటానుగా ఆ విషయం, నువ్వు కళ్ళు మూసుకో ... నువ్విలా చూస్తూ ఉంటే నాకు సిగ్గు''
బుద్ధిమంతుడిలా కళ్ళు మూసుకున్నాడు. అతని పెదవులపై ఆమె తన చేతిని ఉంచింది. సన్నటి వేళ్ళతో ఆమె తన పెదవులను తాకుతుంటే అతని ఒళ్ళంతా పులకరింతలు, 'అబ్బ ముద్దు పెట్టకుండానే చమేప్స్తుంది. ఇక ముద్దుతో ఏమి చేస్తుందో' అనుకున్నాడు మనసులో. అంతలో ఆమె తన రెండు వేళ్ళ మధ్య సందు చేసింది. అతని శ్వాస వేగం మరింత పెరిగింది.
ఆమె మెల్లగా తన పెదవులను ఆ వేళ్ళమధ్య నుంచి అతని పెదవులకు ఆనించి గాఢంగా ముద్దుపెట్టింది. ఆమె పెదవుల స్పర్శకు కోరికలు ఒక్కసారిగా రేగి, ఆమె పెదవులను ఆక్రమించుకోవడానికి చూసిన అతని నోటికి అడ్డంగా తన చేతిని ఉంచి ...
"చూశావా ఇది నా తొలిముద్దు'' అంది.
"సరేలే నువ్వే గెలిచావు'' అన్నాడు నవ్వుతూ, "నీకో విషయం చెప్పనా'' అన్నాడు ఫోజుగా.
'చెప్పు' అన్నట్టు చూసింది మనోజ్ఞ.
"ప్రతి మధురమైన పెళ్ళి, స్నేహానికి దారి తీస్తుంది'' అన్నాడు కాశ్యప్ చిలిపిగా నవ్వుతూ.
"దొంగా, అమంతో మాట్లాడావు కదూ'' అంది మనోజ్ఞ అతని చుట్టూ తన చేతులు వేసి అల్లుకుపోతూ.
తన గదిలో భర్త దగ్గర కూర్చుని ఉన్న పల్లవి "మనూకి తన మనసుకి నచ్చిన సంబందహం చేయగలిగాము కదూ'' అంది. తన చేతిలోని పుస్తకం తిరగేస్తూ.
"అదంతా నీ ప్రయత్నమే కదా, కాశ్యప్ నిన్ను నాలుగేళ్ల క్రితమే కలిసి అన్నీ వివరంగా చెప్పాక అతని ప్రేమ నిజమైతే అది తప్పక ఫలిస్తుందని నమ్మకం కలిగించావు. అందుకే అతను ధైర్యంగా తన చదువు పూర్తిచేసుకుని ఇక్కడ కంపెనీ పెట్టడానికి కావలసిన అనుభవం సంపాదించుకుని మరీ వచ్చాడు.'' అన్నాడు అరవింద్.
"కాని ఒక సందేహం ఉంది అడగనా?'' అన్నాడు.
"నాకు తెలుసులెండి, నేను అమ్మాయితో అంత డైరెక్టుగా ప్రేమ, పెళ్ళి, శృంగారం గురించి మాట్లాడవచ్చా అనే కదా! వయసులోని పిల్లలు తమకు కలిగే సందేహాలను తీర్చుకోవడానికి బయటివాళ్ళపై ఆధారపడితే మంచిది కాదు, పోనీ స్నేహితులని అడిగితె వాళ్లకు తెలీదు. ఎందుకంటే వాళ్ళూ పిల్లలే కదా'' అంది పల్లవి.
'నా మనూ మొదటి పుస్తకం' అని రాసి ఉంది ఆ పుస్తకం కవర్ పైన. ఆ పుస్తకాన్ని ప్రేమగా నిమురుతూ "తప్పటడుగులు వేయకుండా సాధించిన స్వచ్చమైన ప్రేమానుభూతులు, జీవించడంలో ఉన్న మాధుర్యాన్ని నిరూపిస్తాయి కదూ'' అంది పల్లవి.
"నీ పెంపకంలో మనూ చక్కటి వ్యక్తిత్వం సంపాదించుకుంది. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతలోనే ఎంత ఎదిగింది'' ఆనందాశ్చర్యాలు కలబోస్తూ అన్నాడు అరవింద్. భర్తను చూసి తృప్తిగా నవ్వింది పల్లవి.

No comments:
Post a Comment