Thursday, January 17, 2013

Nuvvu naa todu unte….


మనసు చెమ్మగిల్లిందా ...
అభిమానం ఆర్త్రమైందా ...
ఆత్మీయత కంటతడి పెట్టిందా ...
భార్యాభర్తల సంబంధం సంభ్రమమై, నివ్వెరపోయిందా ...
నా ఆశ శ్వాసయి, శ్వాసలో అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు మమేకమై కాలం కరిగిపోయిందో ... కౌగిలి మంత్రముగ్ధయి నా గుండెగదిలో ముడుచుకుపోయిందో ... నా అణువణువూ నిండిపోయిందో ..
ఎంత అపురూపం ... మరెంత అద్భుతం ... నా సమస్తం నా ప్రియ సహచరుడికే నైవేద్యం.
క్షణం కరిగిపోవద్దు ...
క్షణం అనుభవం, అనుభూతయి నా గుండె గదిలో పదిలపర్చుకుంది. నా కనురెప్పల మీద ముద్రవేసిన అతని చుంబక్షతాల మీదొట్టు. నువ్వు నా తోడుంటే ... అన్న అతని సిన్సియర్ ఫీలింగ్ మీదొట్టు.
.సి. తాలూకు చల్లదనం గదిని ఆక్రమించుకుంది. పెర్ ఫ్యూమ్ ని మించిన మత్తు. గదిలో మంచం మీద చల్లిన మల్లెల నుంచి నీలిరంగు బల్బు, ఇంగ్లీషు మ్యూజిక్, గోడల మీద వేలాడేసిన శృంగార చిత్రాలూ ...
వాత్స్యాయనుని పడకగది ఇలానే ఉంటుందా? రతీ మన్మథుల తొలికలయిక ఇక్కడే జరిగిందా? అన్నట్లుంది.
ఎంత వారైనా కాంత దాసులే అన్నది నిజమే కాదో కానీ గదిలో మాత్రం బ్రహ్మచారులైనా, శృంగార దాసులు కాక తప్పదు అంత ప్లజెంట్ గా ఉంది.
గదితలుపులు మూసుకున్నాయి ...
అక్కడున్న వాళ్ళిద్దరి 'మది' తలుపులు తెరుచుకున్నాయి. మది తలుపుల లోపల ఉన్న మధురమైన తలుపులు మనసు విప్పి మాట్లాడుతున్నాయి.
"
ఏయ్ ... ప్రణవి! ఏంటా సిగ్గు?'' అతనామే చుబుకాన్ని పైకి లేపి అడిగాడు. ఆమె అందమైన మొహం మీద నిజంగానే సిగ్గు మొగ్గలేసింది.
అవును మరి ... అనాచ్చాధితమైన ఆమె మేని ఒంపులు అతను తేరిపార చూస్తూ ఆమెతో ఊసులాడుతూ ఉంటే ఆమె ఎలా రియాక్టవుటుంది.
అతని గుండెలమీద తన పెదాల ముద్రలేసి, మౌనంగా ఉండిపోయింది.
"
ప్రణవి ... నువ్వూ ... నేనూ ... నాలుగ్గోడలమధ్య ఇదే ప్రపంచం. నేను రాజుని ... నువ్వు రాణివి కదూ ...'' అవినాష్ గొంతులో మార్దవం
"
నేనంటే మీకేందుకంత ఇష్టం ....'' అతని చెవిలో గుసగుసలాడింది.
"
ఏమో ... మన పెళ్ళయి అప్పుడే పదేళ్ళు దాటాయంటే నమ్మబుద్దేయట్లేదు కదూ ...''
"
ఊహు ...''
"
మరి ...!''
"
పదేళ్ళు దాటినా మన మధ్య ప్రేమ సన్నగిల్లలేదంటే నమ్మ బుద్దేయడం లేదు. పెళ్ళి జరిగాక భార్యాభర్తల మధ్య ఆకర్షణ తగ్గి, బాధ్యతలు పెరిగి, ప్రేమ తగ్గుతుందంటారు ... కానీ మీలో నా మీద ప్రేమ తగ్గలేదు ... ఆకర్షణ తగ్గలేదు ... ఎందుకో?''
"
పిచ్చి ప్రణవి ... భార్యాభర్తలంటే లైఫ్ టైం అగ్రిమెంట్ రాసుకునే వ్యాపారస్థులు కాదు. నువ్వెప్పుడూ నాకు ఫ్రెష్ గానే కనిపిస్తావు. నా మీద నీకున్న ప్రేమ తగ్గనంత కాలం  ... వుయ్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్'' ఆమెను అల్లుకుపోతూ అన్నాడు అవినాష్.
వాళ్ళ పెళ్ళయి పదేళ్లయింది ...
పదేళ్ళలో వాళ్ళు దూరంగా ఉన్న సందర్భాలు చాలా అరుదు. ప్రణవి పుట్టింటివాళ్ళు ఆహ్వానించినప్పుడు తనే వెళ్ళనంది. అందరూ ముక్కున వేలేసుకున్నారు. అవినాష్ అంటే అంత ప్రేమ ఆమెకు.
అవినాష్ బిజినెస్ పని మీద ఢిల్లీ వెళ్ళి ప్రణవిని చూడకుండా ఉండలేక, కాన్ఫరెన్స్ మధ్యలోనే తిరిగొచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసి అది. వాళ్ళిద్దరికీ ఒకరిమీద మరొకరికి ఉన్న ప్రేమకు పరాకాష్ట అది.
అయినా మా ఇద్దరి మధ్య ఉన్న ఇంట్రప్షన్ ... చిన్న విషాదం ... దాని పేరే మాతృత్వం ...
అతని గుండెల మీద తలపెట్టి పడుకుంది ప్రణవి. గోడ గడియారం పన్నెండు గంటలు కొట్టింది.
"
ఏంటీ ఆలోచిస్తున్నావు?'' ప్రణవి మొహంలోని దిగులుని చూసి అడిగాడు అవినాష్.
"
దేవుడు డబ్బు, హోదా, అంతస్థు, అన్నింటికీ మించి అపురూపంగా చూసుకునే భర్తనూ ఇచ్చాడు ... కానీ ...''
"
కానీ ...'' ఆమె వీపుమీద చేయి వేసీ, తన గుండెలకు హత్తుకుంటూ టీజింగ్ గా అన్నాడు.
"
అమ్మా అని పిలిపించుకోవడానికి బిడ్డనివ్వలేదు'' అతని చేయి పట్టు జారింది. అతని మనసు మోద్దుబారింది. విషాద వీచిక అతని మొహం మీద పెను తుఫానై తగిలింది.
ప్రణవి కళ్ళలో నుంచి రెండు కన్నీటి చుక్కలు అవినాష్ హృదయాన్ని తాకాయి.
"
ప్రణవి ...'' అతని గొంతులో విషాదం ...
"
బాధపడొద్దు ప్రణవి ... మనిషికి లోటూ లేకుండా చేస్తే ఇక తన ఉనికి ఉండదని, తన నెవరూ తలచుకోరని దేవుడు ఏదో ఒక లోపాన్ని లేదా శాపాన్ని మనిషికి ప్రసాదిస్తాడు. వదిలేయ్ ప్రణవి ... లోపాన్ని చెరిపేయ్ ... నాకు నువ్వు ... నీకు నేను ...''
"
కానీ రేపు మనకు తలకొరివి పెట్టడానికి?''
అతనికి సమాధానం లభించలేదు.
డాక్టర్ లోపమంతా నాలోనే ఉందని స్పష్టంగా చెప్పాడు ... అలాంటప్పుడు .... అలాంటప్పుడు ...'' ఆమె సందిగ్ధంగా ఆగింది.
"
అలాంటప్పుడు ... చెప్పు ప్రణవి ...''
"
మీరు మరో పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు?''
అతను ఉలిక్కిపడ్డాడు ... కలవర పడ్డాడు ... కలత పడ్డాడు ....
"
ప్రణవి ... పుత్రోత్సాహం తల్లిదండ్రులకు ఆనందమే కావచ్చు. బిడ్డలున్నారని చెప్పుకోవాలనుకోవడం గర్వకారణమే కావచ్చు. కానీ, పిల్లలే జీవితం కాదు ... నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించింది పిల్లల్ని కనిస్తావని కాదు ... పిల్లలు పున్నామ నరకం నుంచి నన్ను తప్పిస్తారనికాదు. జీవితాంతం నువ్వు నా తోడు ఉంటావని ... నువ్వే నా ప్రపంచమవుతావని ...'' అతను ఉద్వేగంగా చెప్పుకుపోతున్నాడు.
"
మీరెన్నయినా చెప్పండి ... మీరు మళ్ళీ పెళ్ళి  చేసుకోండి'' ఆమెలో మొండి పట్టుదల.
అతను ఆవేదనలో పడ్డాడు ... ఆందోళనలో పడ్డాడు ... చివరికి ఆలోచనలో పడ్డాడు.
రోజు రోజుకీ ప్రణవి చిక్కిపోతోంది. ఆమె అందం తరగిపోతోంది. ఆమె మనసులో విషాదం నిండిపోతోంది.
ఎప్పుడూ పడకగదిలో తనతో పాటు సమానంగా అల్లరి చేసే ప్రణవిలో   " ఆసక్తి;; తగ్గడం భరించలేకపోతున్నాడు ... దీనికి పరిష్కారం కావాలి ....
వెన్నెలతో గదిని నింపినట్లుంది ... చలల్గి గాలి కిటికీ రెక్కల గుండా లోపలికి వస్తోంది.
చలికాలం కావడం వల్ల చలి అప్పుడే పెత్తనం చెలాయించేస్తోంది.
"
ప్రణవి ... అయిందంటే అయిదే నిముషాల్లో తయారవ్వాలి ...'' ఆర్డర్ జారీ చేశాడు అవినాష్.
"
ఎందుకండీ ...?!'' అడిగింది ప్రణవి అనుమానంగా ....
"
ఎందుకేమిటోయ్ ... రాత్రి పది దాటింది ... వాత్స్యాయనుడు మొన్నోసారి నా కలలోకి వచ్చి 'మీరే నాకు కొత్త పాఠాలు నేర్పుతారనుకుంటే కామ్ గా ఎందుకుండిపోయారు' అని బావురుమన్నాడు. మన్మథుడైతే  రతీదేవితో మనం కలవడం లేదని తెగ ఫీలయిపోతున్నాడట ...''
అతని రొమాంటిక్ సెటైర్ కి మరోసారి అయితే నవ్వేది, అతన్ని కవ్వించేది ... కానీ ఆమె మూడాఫ్ లో వుంది.
"
ఏయ్ ... బీ చీర ఫుల్ ... నీ ఇష్టప్రకారమే నేను నడుచుకుంటాను ...''
"
నిజమా?'' ఆమె కళ్ళల్లో కోటి మెరుపులు ...
"
నిజమే ... కానీ ముందు మనం రాత్రిని మన కౌగిలిలో కరిగించేయాలి ... అదీ కండీషన్ ...''
ఆమె మనస్ఫూర్తిగా ఒప్పుకుంది ....
దాదాపు నెలరోజులుగా ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. పిల్లల్లేని కొరత తీరడానికి అతడ్ని పెళ్ళి చేసుకోమంది. చుట్టుపక్కల వాళ్ళు, చుట్టాలు రకరకాల కామెంట్లు చేయడం వల్ల మానసికంగా కృంగిపోయింది.
దానిక్కారణం పిల్లలు అంటే అతనికి ఇష్టం లేకపోవడం కాదు. పిల్లలే జీవితం కాదని అతని నమ్మకం. పిల్లలకన్నా తనకు ప్రణవే ఎక్కువన్న నిజం ... విషయం ప్రణవికి తెలుసు.
చాలా రోజుల తరువాత ....
ఇద్దరి మధ్యా అద్భుతమైన కలయిక ... సృష్టి కార్యాన్ని శృంగారోద్వేగంతో నిర్వర్తించిన క్షణం రోమాంచితమై
రెండు శరీరాల కలయికలో ....
రెండు మనసుల మమేకంతో ...
ఒకరి ఉచ్చ్వాసం మరొకరి నిశ్వాసమై ....
వేడి నిట్టూర్పులు, తీపి మూలుగులు, తమకంతో పెనవేసుకున్న కోరికల పరవళ్ళు ....
వెన్నెల నివ్వెరపోయింది. చలికాలపు చల్లదనం ... కౌగిళ్ళలోని వెచ్చదనంతో చెరి వేడెక్కిపోయింది.
అతనామే శరీర వీణను అతి నైపుణ్యంగా శృతి చేస్తున్నాడు. ఎన్ని స్వరాలు ... మరిన్ని రాగాలు ... అతను శృంగార విద్యుత్తులో అగ్రగణ్యుడు.
ఇద్దరి మధ్యా సాగిన శృంగార యుద్ధం ముగిసింది ... ఇద్దరూ విజేతలేనని నలిగిన మల్లెలు తీర్పు చెప్పాయి ... ఎక్కడో కోడి కూత ...
"
నేను ... నేను మిమ్మల్ని బాధ పెట్టానా? పిల్లల్లేరన్న బాధ ... అదీ నా కారణంగానే అనే బాధా ... అందుకే మనకూ పిల్లలున్నారని పదిమందీ అనుకోవాలి. మనమూ అమ్మా, నాన్నా అని పిలిపించుకోవాలి ... అందుకే ...'' అతని గుండెలమీద తలవాల్చి చెప్పుకుంటూ పోతోంది ప్రణవి.
అవినాష్ లేచాడు ....
ప్రణవి ఆశ్చర్యంగా చూసింది ....
ప్రణవిని గార్డెన్ లోకి తీసుకెళ్ళాడు అవినాష్ ...
ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు ...
మంచు కురుస్తోంది. పచ్చగడ్డిమీద మంచు బిందువులు మెరిసిపోతున్నాయి. గార్డెన్ లో వున్న సిమెంట్ బెంచీ మీద ప్రనవిని కూర్చోబెట్టాడు. తను గడ్డిలో కూర్చుని ... తలను ప్రణవి ఒళ్ళో పెట్టాడు.
"
ప్రణవీ .... నీకు బిడ్డ కావాలి ... అంతేకదా ...?''
"
అవును ...''
"
అందుకు నేను పెళ్ళి చేసుకోవడమెందుకు ప్రణవీ ... బిడ్డని దత్తత తీసుకుందాం .... నీ స్థానంలోకి మరొకరిని ఆహ్వానించడం నాకిష్టం లేదు. అలా అని నిన్ను మభ్య పెట్టడానికి, నా కోరిక తీర్చుకోవడానికి రాత్రి నేను అబద్ధం చెప్పలేను .... నేను నిన్ను అమ్మని చేస్తాను''
"
నిజమా?'' ఆమె కళ్ళల్లో సంభ్రమం వైపు సందిగ్ధం మరోవైపు.
"
అవును నిజమే ... నిన్ను అమ్మను చేస్తాను బిడ్డకు ... '' అతని గొంతు వణికింది. ఆమె నడుం చుట్టూ చేయి వేసీ, ఆమె ఒడిలో తల పెట్టాడు. చిన్న కన్నీటి చుక్క నడుం ఒంపును చెరి మురిసిపోయింది.
ఒక్క క్షణం ఆమె చలించిపోయింది. మరుక్షణం కన్నీటి పర్యంతమైపోయింది.
"
అవును ప్రణవి ... ఉదయమంతా నన్ను నీ బిడ్డగా దత్తత తీసుకో, సాయం వేళ నా మంత్రిగా ఉండిపో, రాత్రి వేళ నా సగభాగమై నిలిచిపో ... 'భోజేషుమాత' అన్నారు. నిజంగా అమ్మ ప్రేమను నువ్వు అన్నం వద్దిన్చినప్పుడు చూశా ... 'కరణేషు మంత్రి' అన్నాడు ... వ్యాపార సమస్యలతో సతమతమయ్యే వేళ నీ ఓదార్పు చూశా ... 'శయనేషు రంభ' అన్నారు ... పడగ్గదిలో నీ ప్రేమానురాగాలనూ, శృంగారోద్వేగాల కలయికనూ అనుభవించా ... చివరికి 'కార్యేషు దాసీ' గానూ చూశా ... నా భార్యగా ఇన్ని రూపాలను చూపించే నీకు ... నేను బిడ్డగా ఉండతగనా? నీలో లోపం ఉందని ... నేను మరో పెళ్ళి చేసుకోవాలా? ఇదెక్కడి నీతి ప్రణవీ ... పిల్లల్ని కనడం కోసమే మనం దంపతులమయ్యామా? నేనే నీ బిడ్డననుకో ... నన్ను లాలించు, మురిపాలతో నీ బిడ్డగా చూసుకో ...''
ఆమెకు అతని మనసు అవగతమైంది ... అతని భావం అర్థమైంది ... ఆమె అంతరంగం ఆర్త్రమైంది ... పొత్తిళ్ళలలోని పాపాయిని, గుండెలో శ్రీహరినీ ఒకేసారి ఆదరించగలిగే ఆమె జన్మ ధన్యమైంది. ఆమె మాన్స్ఫూర్తిగా అనుకుంది 'నువ్వు నా తొండుంటే బిడ్డలా ఒడిలో పాపాయివై, భర్తగా గుండెలో నిలిచిపోతే ... చాలు ... ఎనఫ్ ఫర్ మీ ... యు ఆర్ ఓన్లీ ఫర్ మీ'

No comments:

Post a Comment